తెలంగాణ

కాంగ్రెస్‌కు ఇలా జరగాల్సిందే: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం లభించిందని టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ పరిణామాలు ముందుగా ఊహించినవేనని ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌లో అన్నారు. గతంలో కెసిఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నపుడే కాంగ్రెస్ పార్టీని హెచ్చరించామని, ఆ తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను బలవంతంగా బయటకు పంపారని అన్నారు. ఈ పరిణామాలను టి.కాంగ్రెస్ నేతలు పట్టించుకోనందునే నేడు ఆ పార్టీ కనుమరుగయ్యే దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ఖాళీ అయ్యాక కెసిఆర్ దృష్టి బిజెపి ఎమ్మెల్యేలపై పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ పార్టీలపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు. తెరాస అరాచకాలపై విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాల్సి ఉందన్నారు.