రాష్ట్రీయం

పథకాలపై 11న విజయవాడలో సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్ర రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టం, కరవు వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం ఈ నెల 11వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కానుంది. సమావేశానికి అన్నికీలక శాఖల కార్యదర్శులు హాజరై నివేదికలను అందించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు.
రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఆయన వివిధ శాఖల కార్యదర్శులతో శనివారం సమావేశమయ్యారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను బాధితులకు సరఫరా చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ‘మీకోసం’ అనే పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు.
సామాజిక సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదని, లబ్ధిదారులకు ఈ పథకం ఫలాల ఆలస్యం లేకుండా అందించాలన్నారు. జన్మభూమి కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, స్మార్ట్, మెగా సిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతిపాదించారన్నారు. భూ సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రతిపాదనలు పంపాలన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నిధులను ఖర్చుపెట్టాలన్నారు. లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రణాళికలను ఖరారు చేయాలన్నారు. ఈ నెల 12వ తేదీన విజయవాడలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు.