రివ్యూ

తగ్గిన హోరు, జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* రాక్ ఆన్-2
**
తారాగణం: ఫర్హాన్ అక్తర్, శ్రద్ధాకపూర్, అర్జున్ రాంపాల్, పూరబ్ కోహ్లీ, ప్రచీ దేశాయ్, శశాంక్ అరోరా తదితరులు
సంగీతం: శంకర్ - ఇశాన్ - లాయ్
మాటలు: ఫర్హాన్ అక్తర్
స్క్రీన్‌ప్లే: పూబాలి చౌదరి
కథ: అభిషేక్ కపూర్ - పూబాలి
నిర్మాత: రితేష్ సిధ్వానీ - ఫర్హాన్ అక్తర్
దర్శకత్వం: సుజాత్ సౌదాగర్
**

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం- ఓ ‘రాక్’ సంగీతం సంచలనం సృష్టించింది. మ్యూజిక్‌తో మేజిక్ చేసి.. చరిత్రలో సరికొత్త ‘రాక్’ని ఆన్ చేసింది. సంగీతపరంగా - సాహిత్య పరంగా బోలెడంత భావుకత్వాన్ని వొలకబోసి.. మానవత్వ విలువలకూ.. ఊహా జగత్తు తాలూకు అనుభూతులకూ తెర తీసింది. కుర్రాళ్లని ఎంతగా కట్టిపడేసిందంటే.. ‘రాక్’లాంటి హృదయాల్ని సైతం కదిలించి -ఉర్రూతలూగించింది. అదో సువర్ణ్ధ్యాయం. శాస్ర్తియ సంగీతపు సరిగమల స్థానే పాశ్చాత్య వొరవడి వేళ్లూనుకొనేందుకు నాంది పలికింది. నిజానికి- రాక్ ఆన్ చిత్రం రిలీజ్ అయిన కొన్నాళ్లకి -ఆ చిత్రాన్ని సీక్వెల్ తీయాలన్న ఆలోచన మొదలైనప్పటికీ -కథాపరంగా కావొచ్చు, మరే ఇతర కారణాలరీత్యానో కార్యరూపం దాల్చటానికి ఎనిమిదేళ్లు పట్టింది. స్క్రిప్ట్ కోసం మూడేళ్లు శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. అయతే- మొదటి చిత్రం తాలూకు అనుభూతిని ఈ చిత్రం ఇవ్వగలిగిందా? ఆయా పాత్రల స్వరూప స్వభావాలన్నీ ఈ చిత్రాన్ని బతికించగలిగాయా? అంటే ప్రశ్నార్థకమే.
***
ఆదిత్య (్ఫర్హాన్ అక్తర్)ని ఒక సంఘటన విపరీతంగా కలచివేస్తుంది. మానసిక ప్రశాంతత కోసం మేఘాలయ వెళ్తాడు. మానవత్వపు విలువల పట్ల అతడికున్న ప్రగాఢ విశ్వాసం.. రాన్రాను కనుమరుగైన పోతున్న మానవ సంబంధాల పట్ల వేదన అతణ్ణి ఒకచోట నిలువనీయవు. తిరిగి ముంబై చేరుకొంటాడు. ఓ రియాల్టీ షో న్యాయ నిర్ణేత ‘జో’ (అర్జున్ రాంపాల్)ని కలుసుకొంటాడు. సంగీత జగత్తుని తిరిగి నెలకొల్పేందుకు వీరి ఆలోచనలు దగ్గరవుతాయి. సింపుల్‌గా ఇదీ కథ.
‘రాక్ కేపిటల్’గా పిలువబడే షిల్లాంగ్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించటంతో -సహజత్వానికి మరింత చేరువయింది కథ. సీక్వెల్ తీయాలన్న ఆలోచనకి బీజం ఎనిమిదేళ్ల క్రితమే పడినప్పటికీ- కథగా రూపాంతరం చెందటానికి మరో మూడేళ్లు పట్టింది. స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా ఉన్నా.. ఈ ఎనిమిదేళ్లలో ఎనె్నన్నో మార్పులు జరిగాయి. ఈశాన్య ప్రాంతపు సంగీతాన్ని బాలీవుడ్‌లోకి జొప్పించటానికి తీవ్ర కృషి జరిగినా.. ఎక్కడికో ‘్ఫల్’ మిస్సయినట్లు అనుక్షణం ప్రేక్షకుల్ని వేధిస్తుంది. ఒక సంస్కృతిని మళ్లీ వేదిక మీదికి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ- కుర్రకారుకి ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో.. ఆధునిక సంబంధ బాంధవ్యాలూ.. మానవత్వపు విలువలకూ మధ్య ఉన్న బంధాన్ని సరిగ్గా చెప్పలేకపోయారా? అన్న సందేహం వెంటాడుతుంది. ఎప్పటి నుంచో ‘నార్త్ ఈస్ట్’లో సినిమా తీయాలన్న ఫర్హాన్ అక్తర్ కోరిక నెరవేరిందేమోగానీ- పాశ్చాత్య సంస్కృతి ధోరణిని పూర్తిగా జీర్ణించుకున్న నేటి తరానికి అంతగా తలకెక్కే అంశాలేవీ ఈ చిత్రంలో లేవు. సీక్వెల్ అనేటప్పటికి.. సహజంగా రెండింటి మధ్య పోలిక మొదలవుతుంది. ఆయా కేరెక్టర్స్ కొనసాగింపు ఈ చిత్రంలో ఎలా ఉందన్నది తరచి చూట్టం జరుగుతుంది. అలా పోలిక మొదలైందంటే.. సామాన్యంగా కథలో లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఈ చిత్రంలో సీక్వెల్ సందేహాలు వస్తూనే ఉన్నాయి. సంగీత ప్రపంచపు తాలూకు నీలినీడల్ని.. రియాల్టీ షోల తెర వెనుక బాగోతాల్నీ.. గాయనీ గాయకులు ఎదుర్కొంటున్న సవాళ్లనూ.. చక్కగా తెర కెక్కించటంతో వొకింత కథ పట్ల అంకిత భావం కనిపిస్తుంది. సాహిత్య పరంగా.. సంగీత పరంగా - పాటలన్నీ బాగున్నాయి. నటనాపరంగా ఎవర్నీ ఎంపిక పెట్టటానికి లేదు. ముఖ్యంగా హావభావాల విషయంలో శ్రద్ధాకపూర్ మంచి మార్కులు కొట్టేసింది. ఫర్హాన్ అక్తర్ కథకుడిగా.. స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. నటుడిగా తన ధోరణిలో నటిస్తూ వెళ్లాడు. అర్జున్ రాంపాల్, పూరబ్, ప్రచీ దేశాయ్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకత్వం విషయానికి వస్తే- లోపం ఉందని చెప్పటానికి లేదు. కాకపోతే- జనంలోకి వెళ్లే కథ కాకపోవటంవల్ల - ‘రాక్ ఆన్-2’ మధ్యలోనే ఆగిపోయినట్టయింది.

-బిఎనే్క