రివ్యూ

సాగుతూనే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు*సాహసం శ్వాసగా సాగిపో
**
తారాగణం: నాగచైతన్య, మంజిమ మోహన్, బాబాసెహగల్, సతీష్‌కృష్ణన్, నాగినీడు, రాకేందువౌళి తదితరులు
నిర్మాత: రవీందర్‌రెడ్డి
సంగీతం: ఏఆర్ రహమాన్
సినిమాటోగ్రఫీ: డాన్ మెకర్తర్,
డానీ రేమండ్
దర్శకత్వం: గౌతమ్ మీనన్
**
ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన సినిమా -ఏమాయ చేసావే. నాగచైతన్య కెరీర్‌లోనే పెద్ద కమర్షియల్ హిట్. దానికి దర్శకుడు గౌతమ్ మీనన్. విభిన్న కథాంశాలు, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించడంలో అతనిదో ప్రత్యేకమైన శైలి. అలాంటి వీళ్ల కాబినేషన్‌లో వచ్చిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ప్రేమ కథలు చెప్పడానికి పూర్తిగా అలవాటుపడిపోయిన గౌతమ్ మీనన్, ఈసారి ఇందులో యాక్షన్ పాళ్లు కలిపాడు. నిజానికి ఇది చైతూ, గౌతమ్‌ల కొత్త ప్రయోగం.
**
రజనీకాంత్ (నాగచైతన్య) చదువు పూర్తిచేసి ఖాళీగా తిరుగుతున్న ఎగువ మధ్యతరగతి కుర్రాడు. మంచి జాబ్ దొరికే వరకూ సింపుల్ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి లీల (మంజిమ మోహన్) ప్రవేశిస్తుంది. కొద్దిరోజుల్లోనే ఒకరికొకరు అవుతారు. ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ఓరోజు ఫ్రెండ్ మహేష్ (రాకేందువౌళి)తో కలిసి బైక్‌పై కన్యాకుమారి వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు రజనీకాంత్. బయలుదేరే ముందు తనూ వస్తానని బైక్ ఎక్కుతుంది లీల. అలా బైక్‌పై రజనీకాంత్, లీల జర్నీ స్టార్టవుతుంది. కన్యాకుమారి ట్రిప్ నుంచి వెనక్కి వస్తున్న వీరి బైక్ హైవేలో ప్రమాదానికి గురవుతుంది. తీవ్రంగా గాయపడిన రజనీకాంత్‌ని ఆస్పత్రిలో చేర్పించి అక్కడినుంచి వెళ్ళిపోతుంది లీల. మూడురోజుల తర్వాత లీలనుంచి ఫోన్‌కాల్ వస్తుంది. జరిగింది యాక్సిడెంట్ కాదని, తనను చంపడానికి వేసిన ప్లాన్ అని, తన తండ్రిపైనా హత్యాయత్నం జరగడంవల్ల ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్ళిపోయానని చెప్తుంది. ఇది విన్న రజనీకాంత్ షాక్ అవుతాడు. లీలను ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? తను ప్రేమించిన లీలకు ఎదురైన సమస్యను రజనీకాంత్ ఎలా పరిష్కరించాడు? అన్నది సినిమాలో చూస్తాం.
ఏమాయ చేసావె చిత్రం తర్వాత యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌పైనే ఫోకస్ చేసిన నాగచైతన్య, మొన్నవచ్చిన ప్రేమమ్‌తో మరోసారి తనలోని లవ్ యాంగిల్‌ను అందంగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో లవ్‌తోపాటు యాక్షన్, ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. చాలా రోజుల క్రితమే షూట్ పూర్తి చేసుకున్న సినిమా కావడంతో -డైలాగ్స్ చదువుతున్నట్టు అనిపించిందే తప్ప పాత్రలో మమేకమై చెప్పినట్టు అనిపించదు. ప్రేమమ్‌తో పోలిస్తే ఈ చిత్రంలో నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్ పూర్. హీరోయిన్‌గా పరిచయమైన మంజిమ మోహన్ పెర్‌ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రం. కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, కొన్ని సీన్లలో పేలవం అనిపించింది. తెలుగు సినిమాలో మనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులు తక్కువ. పోలీస్ ఆఫీసర్‌గా చేసిన బాబాసెహగల్ కొంతవరం న్యాయం చేశాడు. యాక్షన్, రొమాన్స్‌ను మిక్స్ చేయడం ఒక్కటే దర్శకుడు గౌతమ్ మీనన్ చేసిన తెలివైన పని. ఫస్ట్ఫా అంతా రొమాన్స్‌తో, రోడ్ ట్రిప్‌తో సరదాగా నడిపి, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో స్టోరీకి కొత్త డైమన్షన్ ఇచ్చారు. తరువాత సినిమా అంతా యాక్షన్ థ్రిల్లర్‌ను పోలివుంటుంది. ఫస్ట్ఫాలో గౌతమ్‌మీనన్ స్టైల్ మేకింగ్, రొమాంటిక్ సీన్స్‌తో ఫన్నీగా తీసుకెళ్లిపోయాడు. హీరో ఫ్రెండ్ మహేష్ పాత్రచుట్టూ వచ్చే ఫన్ కూడా బాగుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్‌లో ఫ్రెష్‌నెస్ కనిపించింది. కోన వెంకట్ సంభాషణలు ఎక్కడా ఆకట్టుకోలేదు. మేకింగ్‌పరంగా రిచ్‌నెస్ కనిపించింది. సాదాసీదా బ్యాక్‌డ్రాప్, అంతే క్వాలిటీ సన్నివేశాల మధ్య లవ్ ఫీల్‌ను పూర్తిగా అందించలేకపోయారు. ఆడియన్స్‌ని విజువల్‌గా ఇంప్రెస్ చేసే అంశాలూ ఎక్కడా లేవు. ఏఆర్ రెహమాన్ బాణీలు ఆకట్టుకోవడమే కాదు, కథలో భాగంగా వస్తూ ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రాఫీలో రిచ్‌నెస్ కనిపించింది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
నిజానికి తెలిసిన కథనే తీసుకున్నా, గౌతమ్ మీనన్ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇది కూడా అలాంటి సింపుల్ కథతో వచ్చిన సినిమాయే అయినా, ఫస్ట్ఫాలో అంతా లవ్ కాలక్షేపాన్ని మాత్రమే చూస్తాం. అవన్నీ ఏమాయ చేసావె చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. సెకెండ్ ఆఫ్ అంతా యాక్షన్ డ్రామాతో నడిపేశారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రులపై ఎటాక్ జరిగిందన్న బ్యాంగ్‌లో కథ చూడాలని సిద్ధమైన ప్రేక్షకుడికి -నిరాశే మిగిలింది. సెకెండాఫ్‌ను ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చెప్పలేకపోయాడు. క్లైమాక్స్‌లో హీరో రజనీకాంత్ డిసిపిగా ఎంట్రీ ఇవ్వడం ఆడియన్స్‌కి నవ్వు తెప్పిస్తుంది. క్లైమాక్స్‌ను కథతో సంబంధం లేకుండా విచిత్రంగా డిజైన్ చేయడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. నాగచైతన్య పాత్రను ఈజీగా కనెక్టయ్యేలా డిజైన్ చేసి, సినిమా నడిచేకొద్దీ మార్పులు చేసుకుంటూపోవడం నమ్మశక్యంగా తోచదు. స్లోనెరేషన్ కొన్నిచోట్ల ఇబ్బంది పెట్టింది. మొత్తానికి స్క్రీన్‌మీద సినిమా నడుస్తూనే ఉంటుంది. ఇంకా అయిపోలేదా? అనుకోవడం ప్రేక్షకుల వంతైంది.

-త్రివేది