రివ్యూ

గురి తప్పలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఫోర్స్-2
**
తారాగణం: జాన్ అబ్రహాం, సోనాక్షి సిన్హా, తాహిర్ రాజ్ భాసిన్, అదిల్ హుస్సేన్, నరేంద్ర ఝా తదితరులు
సంగీతం: రామ్ సంపత్
నిర్మాతలు:
విపల్ అమృత్‌లాల్ షా - జాన్ అబ్రహాం
దర్శకత్వం: అభినయ్ డియో
**
2011లో రిలీజైన ‘్ఫర్స్’కి ఇది సీక్వెల్. ఆ చిత్రంలో ఏసిపి యశ్‌వర్థన్ వీరోచిత పోరాటాలూ - యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలూ -సెంటిమెంట్ సీన్లూ మదిని తొలచి.. తీయటి అనుభూతులకు తెర తీశాయి. అప్పట్లోనే సీక్వెల్ తీద్దామన్న ఆలోచనను బయటపెట్టినప్పటికీ- స్క్రీన్‌ప్లేగా రూపాంతరం చెందటానికి ఐదేళ్లు పట్టింది. జేమ్స్‌బాండ్ టైప్ యాక్షన్ సన్నివేశాల్తో.. మ్యూజిక్‌తో అలరించేందుకూ.. మొదటి చిత్రంలోని కొన్ని సన్నివేశాల్తోపాటు - ఈ కథ ఏయే మార్పులు చెందిందో చూసుకొంటూ ‘్ఫర్స్’గా చిత్రాన్ని చూడాల్సిన పరిస్థితి రాలేదు. మరో యాక్షన్ థ్రిల్లర్‌ని చూసిన అనుభూతే కలిగింది?
***
ఏసిపి యశ్‌వర్థన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీలో సిన్సియారిటీ కారణంగా భార్య మాయని పోగొట్టుకొంటాడు. నేటి పరిస్థితిలోకి వస్తే- ముగ్గురు ఆర్.ఎ.డబ్ల్యు ఏజెంట్లు హత్యకి గురవుతారు. వారిలో యశ్‌వర్థన్ సన్నిహితుడు హరీష్ ఒకరు. హరీష్ మరణించే ముందు ఒక క్లూని అందిస్తాడు. బుడాపెస్ట్ ఎంబసీలో ‘స్పై’గా వర్క్ చేస్తున్న కొందరు ‘ఆర్.ఎ.డబ్ల్యు’ రహస్యాలను ఎప్పటికప్పుడు విదేశాలకు చేరవేస్తున్నారని తెలుస్తుంది. ఆర్‌ఎడబ్ల్యు హెడ్ అంజన్‌కీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌కీ ఈ సంగతులను ‘యశ్’ వివరిస్తాడు. ఈ కేసుని ఇనె్వస్టిగేట్ చేసేందుకు ‘యశ్’నీ, ఈస్ట్రన్ యూరోపియన్ ఇన్‌ఛార్జ్ కమల్‌జిత్‌ని బుడాపెస్ట్ పంపిస్తారు. అక్కడికి చేరేనాటికి వారిపై దాడి జరగడంతో తమకి దొరికిన ‘క్లూ’ ఇన్‌ఫర్మేషన్‌ని కన్‌ఫర్మ్ చేసుకొంటారు.
శివ అసలు పేరు రుద్రప్రతాప్ సింగ్. మాజీ ‘రా’ ఏజెంట్ కరణ్ పుత్రరత్నం. ‘రా’లో ముప్పై ఏళ్ల సర్వీస్ చేసిన వ్యక్తి. ‘శివ’కి ‘రా’ మీద ఎందుకంత కసి? అసలు కారణం ఎవరు? తన తండ్రి మృతికి కారణమైన కేబినెట్ మినిస్టర్ బ్రిజేష్ యాదవ్‌పై పగ తీర్చుకోవటానికి ఇదంతా చేస్తున్నాడా?
ఇలా కథ అక్కడికక్కడే తిరుగుతూ -‘రా’ ఏజెంట్ల హత్యకు గల కారణాలతో క్లైమాక్స్ ముగుస్తుంది. బ్రిజేష్‌ని ‘యశ్’ మట్టుపెట్టాడా? ‘శివ’ అసలు రూపం ఏమిటి? ఇత్యాది అంశాలన్నీ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ప్రతి సన్నివేశం ఆద్యంతం అలరిస్తుంది.
జాన్ అబ్రహాం నటనకు హేట్సాఫ్. సిన్సియర్ ఆఫీసర్‌గా తనదైన నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో శివశర్మగా నటించిన తాహిర్ రాజ్ భాసిన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఈ చిత్రంలో అతని కేరెక్టర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారనిపిస్తుంది. పర్‌ఫెక్ట్‌గా తన పాత్రకి న్యాయం చేశాడు. సోనాక్షి సిన్హా పాత్ర పరిధి తక్కువ కావటంవల్ల అంతగా ప్రభావితం చూపదు. సన్నివేశ పరంగా సంగీతం నడుస్తుంది.

-బిఎన్