రివ్యూ

భయమ్ము లేదురా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **జయమ్ము నిశ్చయమ్మురా

తారాగణం:
శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ, పోసాని కృష్ణమురళి, పృథ్వి తదితరులు.
సంగీతం: రవిచంద్ర
నిర్మాత: శివరాజ్ కనుమూరి,
సతీష్ కనుమూరి
దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
కమెడియన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు శ్రీనివాస్‌రెడ్డి. తరువాత ‘గీతాంజలి’ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా చేసిన మరో ప్రయత్నమే ‘జయమ్ము నిశ్చయమ్మురా’.

సర్వమంగళం (శ్రీనివాస్‌రెడ్డి) కరీంనగర్ నుంచి కాకినాడకు ఉద్యోగరీత్యా వచ్చిన పల్లెటూరి వ్యక్తి. మూఢనమ్మకాలు, స్వామిజీలను ఎక్కువగా నమ్మే సర్వమంగళం కాకినాడలో రాణి (పూర్ణ)ని చూసి ఇష్టపడతాడు. ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్స్‌ఫర్ చేయించుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యంతో పని చేస్తుంటాడు. ఇంతలోనే రాణి తనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. పరిస్థితుల ప్రభావం కారణంగా రాణికి దగ్గరవ్వలేక, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేక సర్వమంగళం సతమతమవుతుంటాడు. అలా మానసిక సంఘర్షణలో ఉన్న సర్వమంగళం రాణిని ఎలా కాపాడుకున్నాడు? ఎలా తన ప్రేమను రాణికి చెప్పాడు? చివరికి తన లక్ష్యమైన ట్రాన్స్‌ఫర్‌ను పొందాడా? లేదా? అన్నదే మిగతా సినిమా.
దర్శకుడు ఎంచుకున్నది అతి సాధారణమైన స్టోరీలైన్. దానిచుట్టూ కథను అల్లుకున్న తీరు బాగుంది. డైరెక్టర్ శివరాజ్ రోజువారీ జీవితంలో కనబడే ఒక పిరికి పాత్రను తీసుకుని, కష్టమైన పరిస్థితుల ప్రభావంలో ఇరికించి, చివరికి హీరోని చేసిన తీరు, ఎక్కడికక్కడ ప్రేక్షకుడికి సంతృప్తినిచ్చే మలుపుల్లాంటి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే నటుడు శ్రీనివాస్‌రెడ్డి మూఢనమ్మకాలను ఆశ్రయించి, ఆత్మవిశ్వాసం లేని వెనకబాటు అతిమంచి వ్యక్తిగా తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ పూర్ణ తన పాత్ర వరకూ చేసింది. ఫస్ట్ఫా, సెకండాఫ్‌లలో పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసానిచేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కృష్ణ్భగవాన్ చేత చేయించిన కామెడీ వర్కవుటైంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో పోసాని కామెడీ అదిరింది. నవలా ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు కథ, దానికి తగినంత కామెడీ కలుపుకుని కథనం రాసుకున్న దర్శకుడి రచనా ప్రతిభ మెచ్చుకోవాలి. ఫస్ట్ఫా, సెకండాఫ్‌లలో కథనం కాస్త నెమ్మదించినా దాన్ని తెరకెక్కించిన తీరు బాగున్నాయి. ఇక కాకినాడ, భీమిలీ లొకేషన్లను అద్భుతంగా చూపించిన కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. రవిచంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఓకే.
నిజ జీవితంలోని ఒక పాత్ర చుట్టూ తెలివిగా అల్లిన కథ, కథనాలతో సాగిపోయే సరదా చిత్రం. వాస్తవికతకు దగ్గరగావుండే కథ, మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణల నటన చిత్రానికి ప్లస్ పాయింట్స్. ఫస్ట్ఫా కథనం చాలావరకూ సాగదీతకు గురై నెమ్మదించడం, సెకండాఫ్‌లో కథ కాస్త దారి తప్పడం, అనవసరమైన సన్నివేశాలు మైనస్ పాయింట్లు. సినిమా ఫస్ట్ఫాను బాగానే మొదలుపెట్టినా మొదటి 20 నిముషాల తరువాత కథ నెమ్మదించింది. అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం బోర్‌కొట్టింది. ఇక సెకండాఫ్‌లో కూడా సర్వమంగళం పాత్ర పూర్తిగా మారిపోయిన తరువాత వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు, పాత్రలు కథను కాస్త పక్కదారి పట్టించాయి.

-త్రివేది