రివ్యూ

కదిలించిన జిందగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** డియర్ జిందగీ

తారాగణం: అలియాభట్, షారుక్ ఖాన్, కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేడీ, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేదీ
నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మా ప్రొడక్షన్స్
దర్శకత్వం: గౌరీ షిండే

మనసు -అదో అగాధం. లోలోతుల్లోకి వెళ్లి వెతికితే అంతుచిక్కని సంఘర్షణలూ -వైరుధ్యాలూ, తెలీని భయాలు, ఆది అంతమూ లేని రహస్యాలు. అనే్వషణకి దొరకని అల్లకల్లోలం. గందరగోళం తప్ప క్లారిటీ లేని మనసు తెర. ఈ స్క్రిప్ట్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అక్షరాలకి కొదువుండదు. నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్ -వింగ్లీష్’తో తానేంటో చెప్పిన గౌరీ షిండే -‘డియర్ జిందగీ’తో మరోసారి ‘మనసు పొరల్ని’ కదిలించింది. ‘్భయం’ అనేది ఎంతటి దుస్థితికీ పరిణామాలకూ తీసుకెళ్తుందో కళ్లకి కట్టినట్టు.. మనసుతో మాట్లాడినట్టూ చూపించింది. ‘ఇంగ్లీష్..’లో ఓ మధ్యతరగతి గృహిణి -పరాయి దేశంలో ఇంగ్లీష్ మాట్లాడటానికి పడే ఇబ్బందీ.. ‘జడ్జిమెంటల్’గా ఆలోచించటాన్నీ.. ఆ భాషని నేర్చుకోవాలన్న తపన.. గృహిణిగా.. ‘ఎంట్రపెన్యూర్’గా ఎదుర్కొన్న మానసిక సంఘర్షణనూ ఆ చిత్రం తెలియజేస్తే.. ‘డియర్ జిందగీ’లో నేటితరం అమ్మాయి భయాల్నీ.. సవాళ్లనీ... మనసు మాటున దాగిన రహస్యాలనూ.. టాలెంట్ ఉండీ ‘తెర’మీదికి రాలేని జీవితాన్నీ ఆవిష్కరించారు.
ఇది ఖైరా (అలియా) మనసు కథ. సినిమాటోగ్రాఫర్‌గా చిన్నచిన్న అడ్వర్టయిజ్‌మెంట్స్.. ప్రాజెక్ట్స్ చేస్తూంటుంది. అయితే- ఏనాటికైనా ఒక ఫుల్‌లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేయాలని కోరిక. అవకాశం వస్తుంది కూడా. కోరిక కార్యరూపం దాల్చబోతూండగా -ఆమెలో తెలీని భయం ప్రవేశించి.. అసలు ఆ ‘్ఫల్మ్’కి న్యాయం చేయగలనా? అన్న వేదన ఆమెని ఆవరిస్తుంది. కో-ప్రొడ్యూసర్ రాఘవేంద్ర (కునాల్ కపూర్), ఖైరా ఫ్రెండ్ సిద్ (అంగద్ బేడీ)లకు కూడా ఏమీ చెప్పుకోలేని సంఘర్షణకు గురవుతుంది. ఈ ‘్భయం’ వల్ల కెరీర్‌ని నాశనమవబోతోందని తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఖైరా ఫ్రెండ్ ఆమెని వదిలి వెళ్లిపోతుంది. అద్దె రూంలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని ఇంటి యజమాని ఇష్టపడడు. దీంతో సొంత ఊరు గోవాకి చేరుకొని తల్లిదండ్రుల్తో ఉంటుంది. అనుక్షణం ఈ భయాలు ఆమెని వెంటాడుతూనే ఉండటంతో ‘దిమాగ్ కా డాక్టర్ అకా డిడి’ని కలుసుకొంటుంది.
జహంగీర్ ఖాన్ అలియాస్ జగ్ ఓ సైకియాట్రిస్ట్. తన దగ్గరికి వచ్చే పేషెంట్స్‌ని మందుల్తోకాక.. నవ్వుల్తో నయం చేస్తూంటాడు. వారి బాధని తన బాధగా ఫీలవుతాడు. ఆ బాధకి పరిష్కారాన్ని వెదుకుతాడు. వారి జీవితాల్లో మమేకమై వారిలో ఒకరిగా మెలగి.. సమస్యల్ని తీసివేస్తాడు. ‘వీ ఆర్ ఆల్ అవర్ ఓన్ టీచర్స్ ఇన్ ది స్కూల్ ఆఫ్ లైఫ్’ అంటూ హితబోధ చేస్తూంటాడు. ఖైరా పరిస్థితిని అర్థం చేసుకొంటాడు. ఆమెలోని భయాల్ని పోగొట్టేందుకు ‘జగ్’ ఏం చేశాడన్నది క్లైమాక్స్. ఈ తరం అమ్మాయి మానసిక సంఘర్షణని తెలియజెప్తుందీ చిత్రం. సెకండ్ హాఫ్ అంతా సైకియాట్రిస్ట్ సెషన్స్‌తోనూ.. ఆమెలోని ఒంటరితనం తాలూకు చేదు జ్ఞాపకాలనూ వెలికితీసే ప్రయత్నం చేయటంవల్ల కథ ‘డెప్త్’కి వెళ్లింది. నటనాపరంగా -్ఫస్ట్ హాఫ్ అలియాభట్.. సెకండ్ హాఫ్ నుంచీ షారుక్ ఖాన్ ఆయా పాత్రల్లో జీవించారు. ఒక సైకియాట్రిస్ట్ ఎలా ఉంటాడో? ఏవిధంగా ప్రవర్తిస్తాడో? కేసుని ఎలా డీల్ చేస్తాడో? కళ్లకి కట్టినట్టు ‘షారుక్’ చూపిస్తే.. అలియాభట్ ‘ఖైరా’ పాత్రలో లీనమైంది. మానసికంగా కృంగిపోయిన టీనేజ్ యువతిగా.. క్లారిటీలేని ప్రియురాలిగా విభిన్న తరహా పాత్రని పోషించి మెప్పించింది. ‘ఇంగ్లీష్ -వింగ్లీష్’ లాంటి మరో చిత్రాన్ని చూశామన్న సంతృప్తిని మిగిల్చింది డైరెక్టర్ గౌరి.

-బిఎన్