రివ్యూ

కుదుపుల ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* అరకు రోడ్‌లో
*
తారాగణం: రామ్‌శంకర్, నికిషా పటేల్, అభిమన్యుసింగ్, కమల్ కామరాజ్, పృథ్వీ, సత్య, కృష్ణ్భగవాన్, కోవై సరళ, చిత్రం శ్రీను, బేబీ జనన్య తదితరులు
నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం,
బి భాస్కర్, వేగిరాజు ప్రసాద్‌రాజు
కథ, సంగీతం, దర్శకత్వం: వాసుదేవ్
ఒకోసారి పేరున్నంత ఆసక్తిగా అందులోని సరుకు ఉండదేమోనన్న అనుమానాన్ని నిజం చేసిన చిత్రం -అరకురోడ్‌లో. టైటిల్‌ను అర్ధోక్తిగా ఆపి చిత్రంలో ఏదో ఉంటుందన్న ఆసక్తినైతే పెంచగలిగారు కానీ, థియేటర్‌లోని ప్రేక్షకుడిని కంటెంట్‌తో పూర్తిగా నిరాశపర్చారు.
***
ట్రక్కు డ్రైవర్ పోతురాజు (రామ్‌శంకర్)కి వయసు మీదపడుతున్నా పెళ్లికాదు. అలా నాన్‌స్టాప్‌గా పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో పోలీస్ కానిస్టేబుల్ రోజా (నికిషా పటేల్)తో పెళ్లి నిశ్చయమవుతుంది. ఈలోగా మేనకోడలు అనారోగ్యానికి గురవ్వడంతో, చికిత్సకు 5 లక్షల రూపాయలు అవసరమవుతాయి. అది సంపాదించే ప్రక్రియలో పోతురాజుకు ఎదురైన సంఘటనలు, వాటినుంచి బయటపడిన తీరూ మిగతా కథ. సినిమా ప్రోమోస్, పోస్టర్లలో హారర్, థ్రిల్లర్ కంటెంట్ టచ్ ఇచ్చి, చిత్రంలో అది లేకుండా ప్రేక్షకులను పక్కదారి పట్టించారన్న భావన కలుగుతుంది థియేటర్‌లో. థ్రిల్లర్ లైన్ తీసుకున్నారని అనుకోవడానికి -ఎలాంటి ఆధారాలు వదలకుండా డ్రైవర్లని (విశాఖ పరిసర ప్రాంతాల్లో తిరిగే లారీలు) వరసగా హత్యలు చేసే వ్యక్తి ఉదంతం పెట్టారనుకున్నా, సరైన క్లారిటీని చిత్రంలో ఇవ్వలేదు. లారీలను ధ్వంసం చేసి అమ్ముకోవడానికి హంతకుడు సీరియల్ మర్డర్స్ చేస్తున్నాడని చూపించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అలాగే కంప్యూటర్ల సాయంతో కొత్త నేరరీతులు ప్రజల అనుభవాల్లోకి వస్తున్న ఈ రోజుల్లో -‘పేకాట ఆడి లక్షలు సంపాదిస్తాను’ లాంటి ఐడియాలు.. పాతబడిపోయిన కథాసూత్రాలే. ఇలాంటి వాటితో కథ అల్లి ప్రేక్షకులను రంజింప చేయాలనుకోవడం బెడిసికొట్టింది. ఫస్ట్ఫా మొత్తం పెళ్లికోసం హీరో వెంపర్లాటతో ముగిస్తే, సెకెండాఫ్ మొత్తం ట్రక్కు డ్రైవింగ్ సన్నివేశాలతో నింపేయడంతో దేనికీ సంపూర్ణత్వం లభించలేదు. ఓ పోలీసు ఉద్యోగి స్థానంలో ఉండి, ఇలా ట్రక్కు డ్రైవింగ్ పనిచేసే వ్యక్తిని ఇష్టపడుతుందా అన్నదీ సినిమాటిక్ జవాబుగా పరిగణించాలి. ఇవన్నీ వదిలేసి నటీనటుల అభినయం విషయానికొస్తే రామ్‌శంకర్ తనకిచ్చిన పాత్రని స్థాయికిమించే చేశాడు. కాకపోతే పైన చెప్పుకున్న కథా బలహీనతల కారణంగా అతని కష్టం వృధాపోయింది. డాన్సుల్లో మంచి ఈజ్ చూపిన రామ్‌శంకర్, డైలాగ్ డెలివరీలో మరో నటుడిని అనుకరించే ప్రయత్నం చేశాడు. రోజా పాత్రలో నికిషా పటేల్‌కు ఇచ్చిన నిడివి తక్కువ. ఉన్నంతలో ఫరవాలేదనిపించింది. జిన్నా పాత్రధారి కావాల్సినంత క్రౌర్యాన్ని పలికించినా, సన్నివేశాల్లోని అసంబద్ధత రాణింపులేకుండా చేసేసింది. రిస్క్ రసూల్‌గా పృథ్వీ తన కలవాటైన నటనతో ఆకట్టుకున్నాడు. కథానాయకుని నానమ్మ పాత్రలో కోవైసరళ, తన బ్రాండ్ తమిళ యాసతో కూడిన తెలుగుని ఇంకోసారి ఉచ్ఛరించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. మిగతా పాత్రల పరిధి తక్కువ. ఈమధ్య సినిమాల్లో సంభాషణల్లో సాధ్యమైనంత మెరుపు చూపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇందులో ఆ పోకడలకు పోనిమాట అటుంచి.. ‘మూసుకో’ పదాన్ని పదేపదే ప్రయోగించి విసుగు కల్పించారు. రిస్క్ రసూల్‌కు భయంవేసిన ప్రతిసారీ ప్యాంటులో మూత్ర విసర్జన చేసే సన్నివేశాలను హాస్యం పండించడానికే అనుకున్నా, ఆ తరహా కామెడీ ఏస్థాయి అభిరుచికి సంకేతమోనన్న సందేహాలు తలెత్తుతాయి. ‘గడ్డం తెల్లబడిపోతుంటే బ్లడ్డూ చల్లబడిపోతాందే’ పాట క్యాచీగా ఉంది. హీరో డాన్సూ ఆకట్టుకుంది. అలాగే విజయ్ యేసుదాస్ ఆలపించిన ‘ఏమో ఏమయ్యిందో...’ అన్న నేపథ్య గీతమూ బావుంది. ప్రత్యేకంగా ఈ పాటలో ‘ఏదారి లేని దారిలో...’ అన్న పదం అర్ధవంతంగా ఉంది. విశాఖ, అరకు అందాల్ని కెమేరా ఉన్న పరిధిలో బాగా ఆవిష్కరించింది. దీనికి తగిన కథ అరకు రోడ్‌లోకి లభించివుంటే ప్రయాణం సాఫీగా సాగేది.

-అనే్వషి