రివ్యూ

అలా.. చెట్ట్టెక్కేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** భేతాళుడు

తారాగణం:
విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్, చారుహాసన్, వై.జి.మహేంద్ర, కిట్టి, మీరాకృష్ణన్, మురుగదాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్
ఎడిటింగ్: వీర సెంథిల్‌రాజ్
సంగీతం: విజయ్ ఆంటోనీ
దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి
**
సలీంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో.. విజయ్ ఆంటోనీ బిచ్చగాడుతో బాగా దగ్గరయ్యాడు. ఇటీవలి కాలంలో ఏ అనువాద సినిమాకూ రానన్ని కలెక్షన్లు సొంతం చేసుకుని -స్టార్ వాల్యూ పెంచుకున్నాడు. దీంతో తాజా చిత్రం ‘్భతాళుడు’పై అంచనాలు పెరిగిపోయాయి. తమిళ్‌లో సైతాన్, తెలుగులో బేతాళుడుగా విడుదలైన చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషనే నిర్మించింది. బిచ్చగాడుగా కోట్లు కొల్లగొట్టిన విజయ్, భేతాళుడుగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌ను రుచి చూపించాడు.
***
దినేష్ (విజయ్ ఆంటోనీ) ఓ ఇంటిలిజెంట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అకస్మాత్తుగా ఓ మానసిక రుగ్మతకు గురై ఎవరో తనను వెంటాడుతున్న భావనకు గురవుతుంటాడు. ట్రీట్‌మెంట్ కోసం వైద్యుడిని కలిసినపుడు, గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో దినేష్ బాధపడుతున్నట్టు నిర్థారణ అవుతుంది. గత జన్మలోని జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ పూర్వ జన్మ జ్ఞాపకాలకు, ప్రస్తుతానికి మధ్య దినేష్ నలిగిపోతుంటాడు. అసలు దినేష్ వెతుకుతున్న ఆ జయలక్ష్మి ఎవరు? ఉన్నట్టుండి దినేష్‌కు తన గత జన్మ ఎందుకు గుర్తొచ్చింది? ఆ జన్మ నేపథ్యమేమిటి? చివరికి కథ ఎలా ముగిసింది? అనేది స్క్రీన్ స్టోరీ.
తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్న విజయ్ ఆంటోని, బేతాళుడులో తన పెర్‌ఫార్మెన్స్ మరోసారి చూపించాడు. దినేష్‌గా, శర్మగా డబుల్ వేరియేషన్స్ బాగానే పండించాడు. జయలక్ష్మిగా, ఐశ్వర్యగా అరుంధతి నాయర్ మంచి అభినయాన్ని చూపింది. మిగిలిన పాత్రల్లో వైజి మహేంద్ర, చారుహాసన్, మీరాకృష్ణన్, కిట్టి పరిధిమేరకు నటించారు. ఆసక్తికరమైన ఆరంభంతో విజయ్ ఆంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై సున్నితంగా చూపించిన తీరు ఓకే. విజయ్ ఆంటోనీ నటనలో హైట్స్ చూపించగలిగాడు. గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ, ఆమెను గురించిన విషయాలను తెలుసుకునే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరం అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గత జన్మ తాలూకు కథ క్లైమాక్స్‌కు చేరేసరికి గ్రాఫ్ పడిపోయిందని అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్‌లు బావున్నాయి. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఫస్ట్ఫా ఓపెనింగ్‌ను క్లీన్‌గా ప్రజెంట్ చేశాడు. సెకండాఫ్‌లో ఆంటోనీ గత జన్మ కథను స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ఆసక్తిపెంచే ప్రయత్నం చేశాడు. కథ ఉన్నట్టుండి ట్రాక్ మారడం, క్లైమాక్స్ సన్నివేశాలు కొంచెం బోర్. ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌లో క్లారిటీగా ఉంది.
ఒక సైకలాజికల్ సమస్యతో కథని గత జన్మకు నడిపించి, మరో ట్విస్ట్‌తో ఫస్ట్‌హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందేమోనని ఆశపడిన ఆడియన్స్‌కి -స్క్రీన్‌ప్లే టెక్నిక్ తప్ప మరేం కనిపించదు. అసలు కథని వదిలేసి, కొత్త కథలోకి చేసిన జర్నీ ఆకట్టుకోలేదు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లోనూ ఆడియన్స్ అంచనాలకు చేరలేకపోవడంతో -్భతాళుడు చెట్టేక్కేశాడు. విజయ్ ఆంటోనీ ప్రయోగాల్లో భేతాళుడు ఒకటిగా మాత్రం మిగులుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌కి హారర్ టచ్ ఇవ్వడం సినిమాకు మరో ప్లస్‌పాయింట్.
సెకండాఫ్‌లో ఆంటోనీ గత జన్మ కథ బాగానే ఉన్నా, ప్రస్తుతానికి కనెక్ట్ చేయడానికి వేరే ట్రాక్ తీసుకోవడంలో వైఫల్యం కనిపించింది. డిఫరెంట్ మూడ్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా బయటకు తీసుకొచ్చేయడం నిరుత్సాహపర్చింది. దీంతో సినిమా క్లైమాక్స్‌పై పెట్టుకున్న తారాస్థాయి అంచనాలు నీరుగారినట్టు అనిపిస్తుంది. అటుతిప్పి, ఇటుతిప్పి క్లైమాక్స్‌ను రొటీన్ దగ్గరకే తీసుకొచ్చారు. కథ మధ్యలో వచ్చే పాటలు విసుగుపుట్టించాడు. కథను ఎంత గొప్పగా ముగిస్తాడోనని ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుడిని పట్టించుకోకుండానే -్భతాళుడు చెట్టేక్కేశాడు.

-త్రివేది