రివ్యూ

మెగా మైండ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** ధృవ
***
నటీనటులు:
రామ్‌చరణ్, అరవింద్‌స్వామి, రకుల్‌ప్రీత్, నాజర్, పోసాని, నవదీప్, షాయాజీషిండే, రణధీర్ తదితరులు.
సంగీతం: హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
కథ: మోహన్‌రాజా
మాటలు: వేమారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్, ఎన్‌వి ప్రసాద్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి

***
మెగా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్‌చరణ్ స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. రామ్‌చరణ్ సినిమా అంటే పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో రూపొందుతాయన్న విషయం తెలిసిందే. కానీ హీరో ఇమేజ్ ఉన్న ఫక్తు మాస్‌మసాలా సినిమాలు చేసే రామ్‌చరణ్, మొదటిసారి ఓ భిన్నమైన కథను ఎంచుకుని రిస్క్ చేశాడు. తమిళ్‌లో హిట్టు అందుకున్న ‘తని ఒరువన్’ కోసం రిస్క్‌తోపాటు, ఫిజిక్‌నూ మార్చుకున్నాడు. ఇంతకుముందు ‘బ్రూస్‌లీ’తో ఫ్లాప్ మాట మూటగట్టుకున్న రామ్‌చరణ్, ధృవగా ఆకట్టుకుంటేనే.. అతను చేసిన రిస్క్‌కు అర్థం పరమార్థం.
**
ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న కుర్రాడు ధ్రువ (రామ్‌చరణ్). శిక్షణ పొందుతున్న నలుగురు స్నేహితులతో కలిసి సిటీలో చిన్నపాటి నేరాలను అడ్డుకుంటూ.. నేరస్థులు పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటాడు. అలా పోలీసులకు అప్పగించిన నేరస్థుల్లో ఒకడు బయట తిరుగుతుండటాన్ని ధృవ, అతని స్నేహితులు గమనిస్తారు. ఎలా బయటపడ్డాడన్న అంశాన్ని చర్చిస్తున్నపుడు -్ధృవ ఎన్నాళ్లగానో రీసెర్చ్ చేస్తున్న ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది. ఆ సమస్యను సాల్వ్ చేసి నేరాలకు కారణమైన పెద్ద క్రిమినల్‌ని పట్టుకోవాలన్నదే లక్ష్యమని చెప్పి, అతని కోసం వెతుకుతుంటాడు. అలా అతని వెతుకులాటలో వ్యవస్థీకృత నేరాలకు మూల కారకుడు సిద్ధార్థ అభిమన్యు (అరవింద స్వామి) అనే సైంటిస్ట్ అని తెలుస్తుంది. అసలు సిద్ధార్థ అభిమన్యు ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అతనికి, ధృవకి మధ్య ఘర్షణ ఎందుకు మొదలైంది? ఇత్యాధి వివరాలు కథలో రివీల్ అవుతాయి.
సిన్సియర్ పోలీస్, ప్రేమికురాలికి కూడా ప్రాధాన్యమివ్వని డ్యూటీ మైండెడ్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ బావుంది. ఎత్తుకు పైఎత్తుగా నడిచే పోలీస్, క్రిమినల్ మైండ్‌గేమ్ స్టోరీకి రామ్‌చరణ్ అతికినట్టు సరిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాలెన్స్ చూపిస్తూనే, యాక్షన్ ఎపిసోడ్స్‌లో స్పీడ్ చూపించాడు. సిక్స్‌ప్యాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డాన్సులకు ప్రాధాన్యం లేని కథ కావడంతో, సెటిల్డ్ రోల్‌ను బాగా డీల్ చేశాడు. ఇక సిద్ధార్థ్ అభిమన్యుగా అరవిందస్వామి పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం. వైట్‌కాలర్ విలన్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ని పలికించటంలో అరవింద్‌స్వామి చూపిన అనుభవం మేజర్ హైలైట్స్. హీరోయిన్ రకుల్‌ప్రీత్ ‘అందమైన’ పాత్రను ఆకట్టుకునేలా చేసంది. ‘పరేషానురా..’ పాటలో గ్లామర్ షో సూపర్బ్. మిగిలిన పాత్రలన్నీ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
దర్శకుడు సురేందర్‌రెడ్డి తమిళంలో విజయం సాధించిన కథను పెద్దగా మార్పులేవీ చేయకుండా తెలుగు ప్రేక్షకులు ఆశించే మేరకు అందించాడు. తమిళ వర్షన్ చూసిన వారికీ ధ్రువ నచ్చేలా చేయడానికి మేకింగ్ పరంగా సురేందర్‌రెడ్డికి ఉన్న అనుభవం ఉపకరించింది. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తనదైన మార్క్ చూపించాడు. ఫ్రేమింగ్, లైటింగ్‌తో సినిమాను హైట్స్‌కు తీసుకెళ్లి విజువల్ ఫీస్ట్ చూపించాడు. హిప్‌హాప్ తమిళ అందించిన పాటలు ఫర్వాలేదనేలానే ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకునానడు. యాక్షన్ కొరియోగ్రఫీ, వేమారెడ్డి సంభాషణలు, ఎడిటింగ్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్‌లో గీతా ఆర్ట్స్ మార్క్ కనిపించింది.
రెండు పరాజయాల తరువాత రామ్‌చరణ్ చేసిన ‘్ధృవ’ -ఊపిరి తీసుకునే అవకాశమే ఇచ్చింది.
మైండ్‌గేమ్‌గా సాగే కథ, షార్ప్ స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అరవిందస్వామి, రామ్‌చరణ్‌ల పెర్ఫార్మెన్స్, సురేందర్‌రెడ్డి స్టైలిష్ మేకింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్లు. సామాన్యుడికి అంతుబట్టని కథలోని కొన్ని లాజిక్స్ మైనస్ పాయింట్. రెండున్నర గంటల సినిమా కామెడీ దూరంగానే నడిచింది. కొత్తతరహా సినిమాలో చరణ్‌ని కొత్త యాంగిల్‌లో చూడాలనుకునే వాళ్లకు ‘ధ్రువ’ నచ్చుతుంది.

-శ్రీ