రివ్యూ

మెప్పించలేకపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* జానకి రాముడు
*
తారాగణం: నవీన్ సంజయ్, వౌర్యాని, ప్రియాంక, కిరణ్ కామత్, సదర్శన్,
సంగీతం: గిఫ్టన్ ఎలియాస్
సినిమాటోగ్రఫీ: అనిల్
నిర్మాత: ఎంపి నాయుడు
దర్శకత్వం: తమ్మినీడు సతీష్‌బాబు
*
ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్న విషయం చాలా సినిమాలే నిరూపించాయి, రుజువు చేశాయి కూడా. అందుకే -లవ్ ఫీల్ ఎప్పటికే ప్రెష్‌గానే అనిపిస్తుంది. అలాంటి ఎవర్‌గ్రీన్ ప్రేమకథను తీసుకుని కొత్త దర్శకుడు సతీష్‌బాబు చేసిన ప్రయత్నమే ‘జానకి రాముడు’. నవీన్ సంజయ్, వౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రంతో ఎలాంటి ప్రేమకథ చూపించారు.. ఆ కథ ప్రేక్షకులకు నచ్చిందో లేదో చూద్దాం.
కథ:
పల్లెటూళ్లో చదువుకునే కుర్రాడు రాముడు (నవీన్ సంజయ్). తనతోపాటు చదువుకుంటున్న జానకి (వౌర్యాని)ని ప్రాణపదంగా ప్రేమిస్తాడు. జానకి కూడా రాముని ఇష్టపడుతుంది. అలా నడుస్తున్న ప్రేమకథలో.. హీరోకి తన లక్ష్యం గుర్తుకొస్తుంది. ప్రయోజకుడై పేరు తెచ్చుకున్న తరువాత జానకిని పెళ్లి చేసుకోవాలని అనుకుని హైదరాబాద్ వస్తాడు. రాము తిరిగి ఊరెళ్లేసరికి జానకి అతనికి దూరమవుతుంది. అసలు రాము ఏ లక్ష్యం కోసం హైదరాబాద్ వెళ్లాడు? లక్ష్యాన్ని సాధించాడా? రాముకి జానికి ఎందుకు దూరమైంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన సినిమా. అందమైన పల్లెటూరి లొకేషన్లు బాగా వాడుకున్నారు. గ్రామీణ వాతావరణంలో పల్లె అందాలను కలబోసి లవ్ మూడ్ తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ అనిల్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ఫాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలు బావున్నాయి. రెండు పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఫస్ట్ఫాలో సుదర్శన్ చేత చేయించిన కామెడీ పెద్దగా ఆకుట్టకోలేదు. సెకండాఫ్‌లో కీలకమైన ట్విస్టే సినిమాకు ముఖ్యం. ఊహించని మలుపే అయినా డీల్ చేయడంలో ఆసక్తి పెంచలేకపోయారు. హీరో హీరోయన్ల నవీన్ సంజయ్, వౌర్యాని తమ పాత్రల మేరకు చేశారు. ముడి సరుకును వడ్డించటంలో కనిపించే విఫలం కారణంగా -రొటీన్ లవ్ స్టోరీని దాటి వెళ్లలేకపోయింది. కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. కొన్ని సన్నివేశాలను మరీ కృతకంగా చుట్టేశారు. కథ పాతదే కనుక, కథనంలోనూ బలం లేకపోవడంతో బోర్ ఫీలవుతాం. ఫస్ట్ఫాలో హీరో, అతని ఫ్రెండ్స్‌మీద నడిచే సన్నివేశాలే పెద్ద మైనస్.
సెకండాఫ్‌లో హీరో లక్ష్యసాధనా ప్రయత్నం కూడా ఆసక్తికరంగా లేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఇంటెన్సిటీని చూపించలేకపోయారు. సన్నివేశాలు పేర్చుకుంటూ పోయిన అనుభూతికి గురవుతాం. స్టోరీకి ప్రాణంలాంటి ట్విస్ట్ నుంచైనా స్క్రీన్‌ప్లే గ్రాఫ్ పెరుగుతుందని ఆశించిన ఆడియన్స్‌కు అదీ అందలేదు. బలహీనమైన ఎడిటింగ్‌తో గ్రాఫ్ మరింత తగ్గింది. ఇక దర్శకుడు, రచయిత అయిన తమ్మినీడు సతీష్‌బాబు ఎక్కడా కొత్తదనం చూపలేకపోయాడు. శ్రీమణి, అనంతశ్రీరామ్‌ల పాటల సాహిత్యం బావుంది. గిఫ్టన్ ఎలియాస్ సంగీతం ఫరవాలేదు. నిర్మాణ విలువలు ఓకే. సినిమా నిడివి తక్కువ కావడం ఆడియన్స్‌కి బోనస్. టైటిల్ చూసి అదిరిపోయే ప్రేమకథ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మొత్తానికి జానకిరాముడు వీకైపోయాడు.

-త్రివేది