రివ్యూ

చివరి వరుసలో.. ప్రేక్షకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
**
తారాగణం:
హెబా పటేల్, రావు రమేష్, అశ్విన్, నోయల్ షాన్, పార్వతీశం, సన, కృష్ణ్భగవాన్, రాజ్ తరుణ్ (అతిథి పాత్రలో) తదితరులు
సంగీతం: శేఖర్‌చంద్ర
కథ: సాయికృష్ణ బి
స్క్రీన్‌ప్లే, మాటలు:
ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
**
చెట్టెక్కబోయే ముందు భేతాళుడు ఒక ప్రశ్న తప్పనిసరిగా వేస్తాడన్నది చిన్ననాట చదువుకున్న రూల్. ఆ ప్రశ్నకి జవాబు తెలిసీ చెప్పకపోతే- తల వెయ్యి వొక్కలవుతుంది. చెప్తే భేతాళుడు చెట్టెక్కేస్తాడు. ఇదీ రొటీన్‌గా జరిగే ‘చందమామ’ సన్నివేశం. రాజు కత్తి ఝళిపించి.. భేతాళుణ్ణి భుజాన వేసుకొని.. వెనక్కి తిరిగి చూస్తూంటే- పేజీల తిప్పటం ఆనవాయితీ. ‘నాన్న నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’ కూడా అలాంటి చిక్కుప్రశ్న వేసి -సమాధానం తెలిసీ చెప్పలేదో- ఇక ముగింపు తరువాయి అన్నట్టుగా ఉంటుంది. టైటిల్‌లోనే కథంతా చెప్పేశారు కాబట్టి -ఆ ముగ్గురు లవర్స్‌లో ఎవర్ని ‘సెట్’ (?) చేసుకొంటుంది అన్న వేదన కథానాయికనే కాదు- ప్రేక్షకుల్ని పట్టి పీడిస్తుంది. ‘ఫైవ్ హార్ట్స్ వన్ లవ్’ టాగ్‌తో వేసిన భేతాళుడి ప్రశ్న ఇది. కథలోకి వెళ్లే ముందు -ఆయా కేరెక్టర్స్ స్థితిగతులేమిటో? మనస్తత్వ సారాంశం ఏమిటో చూద్దాం. ‘నేనింతే’ అని గిరి గీసుకొని సినిమా మొత్తం నడిచేస్తూంటారు. దాంతో ‘నేనింతే’కి లాజిక్ ఏముంటుంది? అని వెతకటం మానేసి.. ఎక్కడికక్కడ అడ్జెస్ట్ అయిపోతూంటాడు ప్రేక్షకుడు. మొదట నాన్న. కూతురంటే అమితమైన ప్రేమ. ఎంతగా అంటే- కూతురు ఏం చేసినా ఎదురు చెప్పని మనస్తత్వం. తప్పుతోవన వెళ్తున్నా చూసీచూడనట్లు వెళ్తూ- మధ్యమధ్యలో కూతురు ప్రవర్తనకి సంబంధించిన ‘లాజిక్’ని లెక్చర్‌తో లాగించేస్తూంటాడు. ఎందుకూ అంటే? దానికీ రీజనింగ్ ఉంది. జాతకం చూసిన జ్యోతిష్కుడు -రాబోయే కాలంలో నీకూ నీ కూతురికీ అస్సలు పడదు. కన్నకూతురే నీకు శత్రువు.. అని చెప్పటంతో- కూతుర్ని శత్రువుగా చూట్టం ఇష్టంలేని ‘నాన్న’ ఆమె ఇష్టాన్ని ఏదీ కాదనకూడదని నిర్ణయించుకుంటాడు. కాబట్టి- ఆమె ఎలా ప్రవర్తించినా? మందలించడు. నాన్న తర్వాత నేను. అమ్మాయిగారి లక్కీ నెం.3. కాబట్టి -ముగ్గురు లవర్స్‌తో ప్రేమాయణానికి ఫిక్స్ అయిపోతుంది. అన్ని విషయాల్లోనూ ‘3’ అంకెతో మొదలెట్టే అమ్మడు- అబ్బాయిల విషయంలోనూ అదే నియమాన్ని పాటిస్తూంటుంది. అంటే టైటిల్‌లో ‘నాన్న’ ‘నేను’ పట్ల ఒక క్లారిటీ వచ్చేసినట్టే. ఇక ‘బాయ్‌ఫ్రెండ్స్’ కూడా. వీళ్లకి ఏ క్లారిటీ ఉండదు. అబ్బాయిలను ‘బకరా’ చేయటానికి -సింపుల్ టెక్నిక్స్‌ని ప్రయోగిస్తూంటుంది. లోకంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో.. ఇదేం చోద్యం? అనేట్టుగా. ఒకడిని పడేయటానికి తన మీద ‘రేప్’ సీన్ సృష్టిస్తుంది. మరొకడేమో- అమ్మాయిల పిచ్చిగాడు ప్లస్ ఫ్లర్ట్. ఇతగాడి కోసం ఏకంగా బెడ్‌రూమ్‌కి వెళ్లిపోతుంది. ఇక మిగిలింది పూజారి క్యారెక్టర్. పాపం! ఇతడికి మాత్రం ఏ ‘గిరి’ లేదు. వీళ్లంతా సీన్‌లోకి వచ్చేసింత్తర్వాత -కూతురు ఇష్టాన్ని కాదనలేని ‘బోల్డ్’ తండ్రి.. ఈ ‘బాయ్‌ఫ్రెండ్స్’కి ఉద్యోగాలు గట్రా వేయించేసి.. కూతురి మార్గాన్ని సుగమం చేస్తాడు. కూతురి లక్కీ నెం.3 కాబట్టి ‘ముగ్గుర్ని’ ప్రేమించటం సబబే అనేశాడు. కూతురి లక్కీ నెం.9 అయితే పరిస్థితి ఏమిటో? ఇంతమందికి ఉద్యోగాలు వేసేసి.. జీవితంలో స్థిరత్వం కల్పించటానికి ఆ ‘బోల్డ్’ ఫాదర్‌కి ఎన్ని శతాబ్దాలు పడుతుందో? ఇలాంటి కండిషన్స్ అప్లైతో సినిమా రన్ అవుతుంది. ఇలాంటి తండ్రి ఉంటాడా? అని ప్రేక్షకుడు భేతాళ ప్రశ్న వేసేలోగానే- జవాబు రెడీగా పెట్టుకొని కూర్చుంటాడతగాడు. ‘ప్రేమించటం’ అన్నది విశ్వమానవాళి నైజం. అది పొరపాటు ఎలా అవుతుంది? అంటాడు. కరెక్ట్ రీజనింగ్‌ని ఫాలో అవుతున్నాడు. కూతురు కూడా అదే ఫాలో అయిపోతూంటుంది. మధ్యలోనే ప్రేక్షకుడు ‘లాజిక్’ మిస్సయిపోతుంటాడు.
కథ చెప్పటానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమా? అనకండి. ఆ ఉపోద్ఘాతంలోనే కథంతా వచ్చేసింది. ఒక అమ్మాయి -ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్ -మధ్యలో నాన్న. ఇంతే కథ. బాయ్‌ఫ్రెండ్స్‌ని పడేయటానికి అమ్మాయి ఎంచుకున్న వ్యూహం. ఆ వ్యూహాన్ని సమర్థించే తండ్రి. మధ్యమధ్యలో పవన్‌కళ్యాణ్ కొటేషన్స్.. వ్యూహాత్మకంగా నడిచినట్టు కనిపించే అంత్యాక్షరి.. బ్రహ్మాండంగా పేలేస్తున్నాయని అనుకొనే జోకుల ప్రహసనాలూ...
తండ్రికి తన ప్రవర్తన పట్ల రీజనింగ్ ఉన్నట్టే.. కథానాయికకీ ముగ్గుర్ని ఒకేసారి ప్రేమించటానికి రీజనింగ్ ఉంది. పెళ్లిచూపులు చూస్తాం. పెళ్లికొడుకు తెగ నచ్చేసి.. హృదయం అనే ఫ్రేమ్‌లో అర్జంట్‌గా ఫిక్స్ అయిపోతాం. ఐతే- కట్న కానుకల దగ్గర.. అత్త డిమాండ్లు.. ఆడపడుచుల లాంఛనాల దగ్గర బెడిసికొడితే.. ఫ్రేమ్‌లో ఫిక్స్ అయిన కుర్రాణ్ని ‘డిలిట్’ చేసేసి.. ఆ ఫ్రేమ్‌లోకి ఎవడొస్తాడా? అని ఎదురుచూస్తాం. ఒక్క పెళ్లిచూపుతోనే పెళ్లి ‘్ఫక్స్’ అవ్వాలన్న రూలేం లేదు కాబట్టి.. ఒకేసారి ముగ్గుర్ని ప్రేమించి.. వాడిలో ఒక్కణ్ణి ‘్ఫక్స్’ చేసుకొంటే తప్పేమిటని బోలెడంత లాజిక్‌తో మాట్లాడుతుంది. కరెక్టే కదా. కాబట్టి కథానాయిక నిర్ణయానికి ఓటేయాల్సిందే.
ఇక్కడ -కథానాయిక అభిప్రాయంతో ఏకీభవిద్దామా? తండ్రి క్యారెక్టర్‌తో ‘కనెక్ట్’ అవుదామా? అన్న సందిగ్ధంలో ఉన్న ప్రేక్షకుల్ని ‘బండి’ మీద నుంచి ఎత్తి కుదేస్తుంది హీరోయిన్. డ్రైవింగ్ ఆమెది. ఏం చేయలేం. కూతురు ఎలా డ్రైవ్ చేసినా.. తండ్రి పక్కనే ఉండి కూడా ఏమాత్రం కోపం తెచ్చుకోడు. ఇలాంటి ప్రయాణంలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేందుకు -‘జబర్దస్త్’ బృందం తంటాలు పడింది. పతాక సన్నివేశంలో - భేతాళుడు మళ్లీ చెట్టెక్కే ముందు.. మరో బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చి- హీరోయిన్ చేసిందాంట్లో తప్పేంలేదు అంటాడు. వాహ్. ఆ కొసమెరుపుతో -దిమ్మ తిరిగి ‘మైండ్’ బ్లాంక్ అయిపోతోందనుకుంటున్న తరుణంలో -రావు రమేష్ నటన, ఛోటా కె నాయుడు కెమెరా పనితనం.. హెబా పటేల్ గ్లామర్ లుక్ ప్రేక్షకుల్ని వెంటాడి.. ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’తోపాటు మేమూ ఉన్నాం అనుకునేలా -సిక్స్ హార్ట్స్ వన్ లవ్ తీరులో సినిమాని దర్శకుడు మలిచాడు. ఎవరి లాజిక్‌లూ రీజనింగ్‌లూ వాళ్లకి ఉన్నప్పుడు- ఎవరెట్టాపోతే నాకేం? అనేసి- సినిమాకి ఓటేయాలనిపిస్తుంది.

-‘ఎన్’