రివ్యూ

కుదిరిన కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా బాగుంది **** దంగల్
****
తారాగణం: అమీర్‌ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖురానా, వివన్ భటేనా, జైరా వసీం, సుహానీ భట్నాగర్
సంగీతం: ప్రీతం చక్రవర్తి
కెమెరా: సేతు శ్రీరామ్
ఎడిటింగ్: భల్లూ సలూజా
నిర్మాతలు: అమీర్‌ఖాన్, కిరణ్‌రావ్, సిద్దార్ద్ రాయ్ కఫూర్
దర్శకత్వం: నితీష్ తివారీ
****
బయోపిక్‌ల వెంట బాలీవుడ్ పరుగాపలేదు. విజయాలు సాధించినవాళ్ల జీవిత కథలను తెరకెక్కిస్తే -సినిమాకు మినిమం గ్యారంటీ అన్న భావనతోనే ముందుకెళ్తోంది. వరుసపెట్టి వదుల్తోన్న బయోపిక్‌ల్లో -ఒక‘ట్రెండు’ అటూ ఇటూ అయినా, ఆ అనుభవాలతో స్ట్రాటజీ మార్చుకుని కొత్త ప్రయోగాలకు ‘స్కీన్‌ప్లే’ అల్లుతోంది. ఆ ఒరవడిలో.. విలక్షణ నటుడు అమీర్‌ఖాన్ పట్టిన కుస్తీయే -దంగల్. మారుమూల పల్లెలో పుట్టి దేశంనుంచి జేజేలు అందుకునే స్థాయకి ఎదిగిన మల్లయోధుడి కథ.
ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్‌లోనైనా -అమీర్ విలక్షణతకు ఒక ఇమేజ్ ఉంది. కథను ఎంపిక చేసుకోవడం నుంచి పాత్రను పోషించడం వరకూ.. అమీర్ స్టయిల్ వేరు. లగాన్, మంగళ్‌పాండే, తారేజమీన్‌పర్, ధూమ్-3, త్రీ ఇడియట్స్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘పీకే’లాంటి చిత్రాలు ఆ వైవిధ్యాన్ని మనకు రుచి చూపించినవే. అందుకే -అమీర్ సినిమా అంటే ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. హాలీవుడ్ ఏలియన్స్‌నే చూడటానికే అలవాటుపడిన మనకు -దేశీయ ఏలియన్ ఎలా ఉంటాడో రెండేళ్ల క్రితమే రూచి చూపించి ‘పీకే’ అనిపించుకున్నాడు. తాజాగా -కుస్తీలో నెరవేరని కలను కూతుళ్లతో సాధించుకున్న తండ్రిగా కనిపించి ‘దంగల్’గా నిలబడ్డాడు. పాత్ర కోసం ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నం -మహా మల్లయోధుడు మహవీర్‌సింగ్ ఫొగట్‌ను తలపించిందా?
***
నిజానికి కుస్తీయోధుడు మహవీర్‌సింగ్ ఫొగట్ జీవిత కథ అని చెప్పినా -2010, 2014 కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు గీత ఫొగట్, బబితా కుమారీల విజయ ప్రస్థానమే ‘దంగల్’ బేస్ పాయింట్.
హర్యానా రాష్ట్రం భివానీ జిల్లాలోని ఓ పల్లెటూరి మల్లయోధుడు మహవీర్‌సింగ్ ఫొగట్ (అమీర్‌ఖాన్). భారత్‌కు బంగారు పతకం అందించాలన్న అతని ‘కుస్తీ’ ఫలించదు. ఆ అసంతృప్తితో ఉన్నపుడే శోభాకౌర్ (సాక్షి తన్వర్)తో పెళ్లి అవుతుంది. రెజ్లింగ్ కోచ్‌గా జీవితంతో ‘కుస్తీ’ పడుతుంటాడు. కానీ -పతకాన్ని సాధించలేకపోయాన్న అసంతృప్తి బలంగా నాటుకుపోతుంది. దీనికితోడు కలను సాకారం చేయగలిగే కొడుకులూ కలగరు. అతని నలుగురు సంతానం ఆడపిల్లలే. కుస్తీలో ఆడపిల్లల్ని ప్రోత్సహించలేని పల్లెటూరి వాతావరణం. అలాంటి పరిస్థితుల్లో -అనుకోకుండా ఓ రోజు తన కూతుళ్లు గీతా ఫొగట్ (్ఫతిమా), బబిత కుమారీ (సాన్యా మల్హోత్రా) ఇద్దరు అబ్బాయిల్ని చితకబాదడాన్ని చూస్తాడు మహవీర్. కళ్లారా చూసిన కూతుళ్ల శక్తిసామర్థ్యాలు అతనిలో ఆశలు రేకెత్తిస్తాయి. -తన కలను సాకారం చేసుకోవాలన్న సంకల్పం మొదలవుతుంది. మల్లయుద్ధంలో కూతుళ్లకు కఠోర శిక్షణనిస్తాడు. ప్రపంచ దిగ్గజాలతో తలపడగలిగే బలశాలులుగా తీర్చిదిద్దుతాడు. తరువాత ఫొగట్ కూతుళ్ల విజయ విహారం ఎలా సాగిందన్నది కథకు ముగింపు.
తండ్రిగా కూతుళ్లపై మమకారం. కోచ్‌గా వాళ్లను తీర్చిదిద్దాలన్న కాఠిన్యం. రెంటిమధ్య వత్యాసాన్ని మహవీర్ సింగ్ ఫొగట్‌గా అమీర్ పలికించిన నటనకు ఫిదా అయిపోతాం. ఒకదశలో తండ్రినన్న విషయాన్ని మర్చిపోయి ఆడపిల్లలతో చేయించే కఠోర కసరత్తుల సన్నివేశాల్లో భావోద్వేగాలు తన్నుకొస్తాయి. సంకల్పం బలమైనదేతై -రెజ్లింగ్‌లో రాణించడానికి లింగభేదాలతో పనిలేదని సూటిగా చెప్పిన తీరు ఆలోచింపచేస్తుంది. ఆశయ సాధనకు పరితపించే తండ్రీకూతుళ్ల పట్టుదల, పోరాటపటిను తెరపై ఆవిష్కరించటంలో దర్శకుడు, రచయిత మనీష్ తివారీ విజయం సాధించాడు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడని తీరు, సెకెండాఫ్‌లో తండ్రీకూతుళ్ల మధ్య కుస్తీ పోరు సినిమాకు ప్లస్ పాయింట్లు. 2010 కామనె్వల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకాన్ని సాధించిన తొలి మహిళ గీత ఫొగట్ ఆటకే దర్శకుడూ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. 2014లో చెల్లెలు బబితా కుమారి సైతం పతకాన్ని సాధించినా, పరిమిత పాత్రతోనే సరిపెట్టారు.
పాత్రకు తగినట్టు బలిష్టమైన దేహాన్ని చూపించేందుకు కఠోర కసరత్తులు చేయడం అమీర్‌కు కొత్తేం కాదు. గజని, ధూమ్-3లోనే కండల ప్రదర్శన, ప్యాక్‌ల పటాటోపాలు సాగాయి కనుక, దంగల్ తీరును కొత్తగానూ, ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కాకపోతే -ఐదుపదుల వయసులో చేసిన పాత్రోచిత సాహసాన్ని మెచ్చుకోవాలి. ఏ ఉదాత్త ఆశయంతో అమీర్ ఈ పాత్రను ఎంచుకున్నాడన్నది అతని నటనలో అణువణువునా కనిపించింది. లింగ వివక్షతో కునారిల్లుతున్న పల్లెలో ఆడపిల్లలతో కసరత్తు చేయస్తూ, కుస్తీలు పట్టించాల్సి వచ్చే సన్నివేశాల్లో మహవీర్‌సింగ్ ఎలాంటి వొత్తిడిని ఎదుర్కొని ఉంటాడన్నది అమీర్ కళ్లనుంచి రాబట్టేందుకు దర్శకుడు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. కూతుళ్లు గీతా ఫొగట్‌గా ఫాతిమా సనా షేక్, బబితాకుమారిగా సాన్యా మల్హోత్రా చక్కని ప్రతిభ కనబర్చారు. టీవీ తెరపై మురిపించిన సాక్షితన్వర్ తొలిసారి బిగ్ స్క్రీన్‌పై ఫొగట్ భార్య పాత్రలో సున్నితమైన నటన ప్రదర్శించింది. సాంకేతికంగా సేతు శ్రీరామ్ కెమెరా, భల్లూ సలూజా ఎడిటింగ్, ప్రీతమ్ చక్రవర్తి నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సంకల్పం బలమైనదేతే, ఆడపిల్లలే అయనా అనితర సాధ్యమైన విజయాలు అందుకోవచ్చన్న అంశాన్ని తెరకెక్కించిన వైనం అద్భుతం.

-మహాదేవ