రివ్యూ

దెయ్యం.. వీర బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ఇంట్లో దెయ్యం నాకేం భయం
*
తారాగణం: నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక జయకుమార్, వౌర్యాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, ప్రభాకర్, చలపతిరావు, ప్రభాస్ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మానందం
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
*
హోరుగాలి.. చిమ్మచీకటి -కిర్రు చప్పుళ్లు.. దఢేల్‌మని కొట్టుకొనే కిటికీలూ.. ఠక్కున ఆరిపోయే లాంతరూ.. నక్కల ఊళలూ- చెట్లకొమ్మల గలగలలూ -గబ్బిలాల కిచకిచలూ.. ఇదీ దెయ్యం రొటీన్ స్క్రీన్‌ప్లే. ఇన్నాళ్లైనా ఎనే్నళ్లైనా ఈ కథనంలో మార్పు ఉండనట్టే- ఒకానొక గద్వాల కోటలాంటి భవనం. కొనే్నళ్లుగా పాడుబడిన ఆ బంగ్లాని మోజుపడి ఎవరో కొనుక్కున్న తర్వాత -ఆ ఇంట్లో ‘ఆత్మ’ తిరుగుతోందన్న విషయం తెలిసి భయంభయంగా బతికేస్తూంటే- మధ్యమధ్య వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ‘ఆత్మ’కథ చెప్పటం మరో యధార్థ దెయ్యం కత. తూచ్.. ఆఖరికి దెయ్యం లేదని కొన్ని కథనాలు చెప్తే.. మరికొన్ని దెయ్యాలు ప్రతీకారం తీర్చుకొని మరీ వెళ్లిపోతూంటాయి. ఇంతకుమించి వీసమెత్తు ‘ఆత్మ’ కదలదు. సగటు ప్రేక్షకుడు కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. ఇటువంటి కథల్ని వల్లె వేస్తూంటే.. ఏదో ‘వెరైటీ’ లేందే.. ఆ ‘ఇంట్లో’కి ఎందుకు ప్రవేశిస్తాడు?! ‘సీమ..’ సినిమాల్తో బోలెడంత హ్యూమర్‌ని పండించిన దర్శకుడు నాగేశ్వరరెడ్డి- ఈ చిత్రంలో ‘దెయ్యం’.. ఆ దెయ్యంతో దెబ్బలు తినే పాత్రలు.. మినహా ఎక్కువ కష్టపడలేదు. కాకపోతే- రొటీన్‌కి భిన్నంగా ‘పెళ్లి’ చేసుకొంటానంటూ వెంటపడే దెయ్యాన్ని ఎంచక్కా ఆహ్వానించాడు.
కథ -బ్యాండ్ మేళం ట్రూప్ ఓనర్ నరేష్ (నరేష్) -ఓ అనాధ పిల్ల ఆపరేషన్ నిమిత్తం అప్పు చేసి పీకల్లోతు మునిగిపోతాడు. అప్పు తీర్చే మార్గం కనిపించదు. ఒకానొక భవంతిలో.. అదీ కోట్ల విలువచేసే బంగ్లాలో దెయ్యాన్ని వెళ్లగొడితే తన కష్టాలు తీరుతాయని.. భూతవైద్యుడి అవతారం ఎత్తుతాడు -తన బృందంతో. అమ్మాయి పెళ్లి చేయటానికి ఆరాటపడే తండ్రి (రాజేంద్రప్రసాద్) కోరిక మేరకు ఆ ఇంట్లోకి ప్రవేశించిన నరేష్‌కి కష్టాలు మొదలవుతాయి. ఒకవైపు ప్రేమించిన అమ్మాయి.. మరోవైపు తననే పెళ్లి చేసుకోమని బలవంతపెట్టే ఆత్మ. వెరసి -నరేష్ జీవితం ‘దెయ్యాల’ ఘోష అవుతుంది.
ఈ కథలో కొత్తదనం ఏదైనా ఉందీ అంటే- అది ఒక్క ‘ఆత్మ పెళ్లి’ వ్యవహారం. పెళ్లి చేసుకొన్న తర్వాత దెయ్యంతో కాపురం ఎలా చేస్తాడన్న లాజిక్‌ని విడిచిపెడితే- నరేష్ ఏ భయం లేకుండా కథని సజావుగా నడిపించాడు. కాకపోతే- జనానికి ఎక్కటానికి ఇక్కడ మొదటి కారణం -పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటంతో- ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తగ్గటం. సినిమా అంతా రొటీన్‌గా స్టెప్ బై స్టెప్ నడిచిపోతూంటుంది. కథ కూడా రీల్ బై రీల్ తెలిసిపోతూంటుంది. ఈ దెయ్యం ఏం చేయదన్న సంగతి తెలిసింత్తర్వాత కథ మరీ సాగిపోతూన్నట్టు ‘ఆత్మ’లా తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ‘దెయ్యం’ ఇంట్రడక్షన్ సీన్లు బాగున్నప్పటికీ.. అదే పనిగా ‘బాదుడు’ని చూపించటంతో -సన్నివేశాలన్నీ ‘రిపీట్’ అవుతున్నట్టుగా ఉంటుంది. దీంతో జనం కూడా భయపడటం మానేశారు.
స్క్రీన్‌పై ఎంతమంది ఉండీ.. దెయ్యంతో ఎన్ని తన్నులు తిన్నప్పటికీ.. కామెడీ అంటే ‘బాదుడు’ అన్న సంగతి చెప్పకనే చెప్పినట్టై.. అపహాస్యం పాలైంది. ఐతే- ప్రతి ఒక్కరూ వీరోచితంగా నటించారు. ఏ ఒక్కరినీ దెయ్యం విడిచిపెట్టలేదు. అందరిపై ‘బాదుడు’ ప్రేమని వొలకబోసింది. ఆ ఒక్క విషయంలో కృతిక బతికిపోయింది. చూట్టానికి బాగున్నప్పటికీ.. ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు ఏ మాత్రం సానుభూతి లభించదు. వౌర్యానీ ‘దెయ్యం’ పరిస్థితీ అంతే. రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. భూతవైద్యుడిగా.. ప్రేమికుడిగా నరేష్ విభిన్నంగా కనిపించినా... ఎందుకో మెప్పించలేక పోయాడు. హాస్యాన్ని పండించలేక పోయాడు.
ఈ సినిమాకి పాటలు అక్కర్లేదు. ఎందుకో ఏమో తెలీదుగానీ -పాటల్ని ఫారిన్‌లో ప్లాన్ చేశారు. అదేదో ‘ఇంట్లో’ చేస్తే బాగుండేది. ఆ పాటలైనా సందర్భోచితంగా కాకండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశించే ‘ఆత్మ’లా ఉన్నాయి. వెరసి -ఇంట్లో దెయ్యం.. చచ్చి సాధించింది ఏమీ లేదు.

-బిఎనే్క