రివ్యూ

ఎక్కడినుంచి ఎక్కడికో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య
**
తారాగణం: ఆర్ నారాయణమూర్తి, జయసుధ, సునీల్‌శర్మ, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, వెనె్నల కిషోర్, సమీర్, విజయభాస్కర్, విజయ్, మేల్కోటే, పార్వతి, సురేఖావాణి, రఘుబాబు, సుధ, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్
నిర్మాత: చదలవాడ పద్మావతి,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు
**
‘సినిమా’ అంటే ప్రధానంగా వినోద సాధనమే అయినా అంతకుమించిన పరమార్ధం, ప్రయోజనం ఉందన్న ఉద్దేశ్యంతో నటనా ప్రయాణాన్ని విజయవంతంగా నెట్టుకొస్తున్న అతి కొద్దిమంది నటుల్లో నిశ్చయంగా ఆర్ నారాయణమూర్తి ఒకరు. ఆయన నాయకుడిగా తాజాగా వచ్చిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా అదే పంథాలో ప్రజా ప్రయోజన పూర్వక ఇతివృత్తంతోనే సాగింది. అయితే అది తెరపై అనువదితమైన తీరులో ఒకింత తడబాటు కనిపించింది.
హెడ్‌కానిస్టేబుల్.. విషయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే నారాయణమూర్తి చిత్రాలన్నీ దాదాపు ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చినవే. కానీ ఈ చిత్రంలో మాత్రం ఆయన కేవలం నాయక బాధ్యతతోనే ఉన్నారు. ఇక కథ విషయంలోకి వెళ్తే.. నీతి, నిజాయితీలే తన ఆయువుపట్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఆర్ నారాయణమూర్తి). అతని భార్య పద్మజ (జయసుధ) మాత్రం అందరిలా మనమూ ఉండాలి, అవసరాలు తీరాలంటే పై సంపాదన ఉండాలన్న సూత్రాల్ని భర్తకు వల్లిస్తూంటుంది. సహజంగానే వెంకట్రామయ్య నిజాయితీ వర్తనంపట్ల విముఖత వహించిన వర్గం, అతన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు పంపుతుంది. భర్త తీరు నచ్చని పద్మజ, అతన్నొదిలేసి పుట్టింటికి వెళ్లిపోతుంది. తర్వాత ఏమైంది? భార్యాభర్తలు తిరిగి కలుస్తారా? వంటి వాటికి సమాధానంతో సినిమా ముగుస్తుంది. వాస్తవ అంశాల్ని కథావస్తువుగా తీసుకుని చలనచిత్ర మాధ్యమాన్ని వినియోగించుకోవడం సర్వదా హర్షణీయమే. కానీ ఆ వాస్తవాన్ని చూపడంలో హాస్యాస్పద అంశాలకు చోటివ్వడమే వికటించింది. ఉదాహరణకు చిత్రంలో వ్యవస్థను మార్చుదామన్న తీరుతో ఎన్నికల బరిలోకి దిగిన వెంకట్రామయ్యకు పోటీగా మాజీ హోంమంత్రి వర్గం పద్మజ (వెంకట్రామయ్య భార్య)ను సిఎం అభ్యర్థి అంటూ నిలబెట్టి సీన్లు నడపడం కృతకమే. పైగా ‘నాది ధనక్షేత్రం’.. అంటూ ఆమెపై పాట చిత్రీకరించడం వగైరా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎంతగా అవినీతి పథంలో పయనించే రాజకీయ పార్టీ అయినా తనదే అసలైన ‘నీతి’ అంటూ గప్పాలు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటుంది తప్ప ఇందులోలా నాది ‘్ధనక్షేత్రం’.. అంటూ ప్రచారం చేయదు. ఒకవేళ అలా జరిగితే నియంత్రణ చేసే వ్యవస్థలున్నాయి. అలాగే దాదాపు ఓ ఇరవై ఏళ్ల వైవాహిక బంధం ఉన్న పద్మజ, భర్త వైఖరి నచ్చక ఇల్లొదిలి వెళ్లిపోవడం, అదీ పిల్లలు తనతో రానంటున్నా వెళ్లడం అన్నది పూర్తిగా అసహజమే. అలాంటి మనస్తత్వంగల ఆమెలో పరివర్తన అన్నదీ ఒక్కసారిగా వచ్చేసి ‘ఇప్పడొచ్చాడు చూడు నీ మొగుడు’ అంటూ అనడమూ బాగలేదు. ఇవన్నీ సినిమాకి ఏదో తీరుగా ముగింపు ఇవ్వాలన్న తతంగంలో చూపిన సన్నివేశాలుగా అనిపించాయి. సాధారణంగా నేరగాడు పారిపోతాడేమోనన్న తీవ్రమైన పరిస్థితుల్లో తప్ప ఎవరికీ ఏ సందర్భంలోనూ పోలీసులు చేతికి సంకెళ్లు వేయరు. కానీ ఇందులో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో అరెస్టయిన వెంకట్రామయ్య చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తారు. అలాంటి సందర్భంలోనే అరెస్టయిన మాజీ హోంమంత్రి (సునీల్‌శర్మ) విషయంలో మాత్రం సంకెళ్లు వేయరు. ఇదంతా సన్నివేశాల దృశ్యీకరణలో దర్శకునికి విషయ అవగాహన లోపించడమే. హోంమంత్రి ఇంట్లో జరిగిన ఎన్‌కౌంటర్ తదితరాలు కూడా చాలా కృత్రిమంగా తీసినట్టు అనిపించాయి. ముఖ్యంగా నారాయణమూర్తి పాత్రతో అనిపించిన ధీటైన సంభాషణలకు తగినట్టు చిత్రీకరణ సాగలేదు. అనుకున్న కథకు జతగా నవంబరు 8 తర్వాత దేశంలో వచ్చిన ‘పెద్దనోట్ల రద్దు’ వంటి ‘పెద్ద’ అంశాన్నీ స్పృశించడం బాగానే ఉన్నా, దానికేం చేయాలన్న దానిపై స్పష్టత లేదు. ఆర్ నారాయణమూర్తి తనదైన స్పష్టమైన శైలిని ఇందులో మరోసారి ప్రదర్శించారు. జయసుధ సైతం తన సహజ నటనతో ఎప్పటిలాగే ఆకట్టుకునే ప్రయత్నంచేసినా కథలో ఆ పాత్రకిచ్చిన అసహజ నెగిటివ్ షేడ్స్‌వల్ల రాణింపు దక్కలేదు. వెనె్నల కిషోర్, వై విజయ, చలపతిరావు తదితర పాత్రలకేం పెద్ద ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో జయప్రకాష్‌రెడ్డి తన ఉనికిని చాటుకున్నారు. ‘వందేమాతరం’ స్వరాల్లో ఉందా/ జ్ఞాపకముందా.. పాట ఆహ్లాదకరంగా ఉంది. నారాయణమూర్తి, జయసుధ ఇందులో అభినయకర్తలు కావడంతో బాగా ఆకట్టుకుంది. అయితే సుద్దాల అశోక్‌తేజ ఇందులో అందించిన పదాలు విడివిడిగా బాగున్నా, చూపిన సన్నివేశంలో సింక్ కాలేదు. కానీ పాట ఆఖరు చరణంలో ‘నువ్వు భార్యకిచ్చే స్థానం ఏమిటి’ అన్నదానికి వెంకట్రామయ్య ‘నాలో ఒక సగం దేశానికిస్తే, మరో సగం నువ్వు అనడం’ హృద్యంగా ఉంది. జేసుదాసు ఆలపించిన ‘ఎందుకురా జీవుడా’ పాట అటు స్వరపరంగానూ, ఇటు సాహిత్యపరంగానూ అగ్రస్థానం ఇవ్వవలసిన రీతిలో ఉంది. ముఖ్యంగా అంతా మిథ్య, అది తెలుసుకొనుట విద్య’ (రచన: సుద్దాల అశోక్‌తేజ) అన్న వాక్యం బాగుంది. మొత్తానికి ప్రథమార్థం కాస్తంత పట్టుగా సాగినా, ద్వితీయార్థం పట్టు కోల్పోయి చిత్రం ఎటెటో పోవడంవల్ల ఆసక్తికరంగా సాగలేదు.

-అనే్వషి