రివ్యూ

శె‘బాస్’ అనిపించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** ఖైదీ నెంబర్ 150
***

తారాగణం: చిరంజీవి (ద్విపాత్రాభినయం), కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా,
నాజర్, ఆలీ, బ్రహ్మానందం,
రఘుబాబు తదితరులు
సంగీతం: దేవీశ్రీప్రసాద్
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: గౌతంరాజు
నిర్మాత: రామ్‌చరణ్
దర్శకత్వం: వివి వినాయక్
మెగాస్టార్ చిరంజీవి.
డ్యాన్స్, ఫైట్లు.. స్క్రీన్‌పై ఇదే అతని ఎనర్జీ. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత -మెగా హీరో రీ ఎంట్రీ ఇస్తున్నపుడు అటు ఫ్యాన్స్‌కు, ఇటు సినీ అభిమానులకు కలిగిన డౌట్లూ ఇవే. సిక్స్‌టీస్‌కు చేరుకున్న చిరు -తన ప్రధాన బలాలు ప్రదర్శించగలడా? ‘బాస్ ఈజ్ బ్యాక్’ నినాదానికి న్యాయం చేయగలడా? అని. డౌట్లు క్లియర్ అయిపోయాయి. తొమ్మిదేళ్ల గ్యాప్‌తో వచ్చినా -మరో పదేళ్లు కెరీర్‌ని కొనసాగించే స్టామినా చూపించేశాడు చిరంజీవి. రికార్డు ఇన్నింగ్స్‌లో బిగ్ షో చేసేశాడు. వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నెం 150’లో చిరు తన మునుపటి ఫామ్‌ని చూపించాడు.
**
చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ అల్లరి చిల్లరిగా తిరిగే ‘కుర్రాడు’ కత్తి శీను. తెలివైనవాడు కావడంతో లైఫ్ సులువుగా సాగిపోతుంటుంది. ఒకసారి జైలునుంచి పరారయ్యే క్రమంలో -తనలాగే ఉన్న శంకర్ (చిరంజీవి).. శీనుకి తారసపడతాడు. శంకర్ స్థానంలోకి వెళ్ళి దర్జాగా జీవితం గడపేయాలని అనుకుంటాడు. అయితే కత్తి శీను అనుకున్నట్టుగా శంకర్ జీవితం ఉండదు. అతడ్ని నమ్ముకొని ఒక ఊరే ఉంటుంది. తమ కష్టాలు తీర్చే వ్యక్తిగా చూస్తుంటుంది. అలాంటి వ్యక్తి స్థానంలోకి వెళ్ళిన కత్తి శీనుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శంకర్ జీవితం గురించి తెలుసుకున్న శీను ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాడు? ఏం చేశాడు? అసలు శంకర్ గతమేమిటి? శంకర్‌ని నమ్ముకున్న రైతుల సమస్యలు ఏమయ్యాయి? శీను వలన జైలుకెళ్లిన శంకర్ పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అసలు సినిమా.
తొమ్మిదేళ్ల తరువాత రీ ఎంట్రీ, 150 రికార్డు చిత్రం కావడంతో ఫోకస్ అంతా చిరంజీవి మీదే ఉంటుంది. అభిమానుల కోసం తయారైన సినిమా కనుక ఫుల్‌లెంగ్త్ హీరోగా చిరు పండగ చేసేశాడు. సినిమా మొత్తం చిరంజీవి మార్కే కనిపిస్తుంది. యంగ్ హీరోలతో పోటీ పడటానికి -చిరు చేసిన వర్కవుట్స్‌కు ఫలితం దక్కినట్టే. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని సీనియారిటీ, డైలాగుల్లో టైమింగ్, కట్టిపడేసే ఫైటింగ్ మోడ్.. ఇప్పటి హీరోలకు ఏమాత్రం తీసిపోని వేల్‌లెంగ్త్ డ్యాన్స్‌లు... ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడలేదన్న విషయాన్ని స్క్రీన్స్‌పై చూపించాడు. రీమేక్ కథే అయినా చిరంజీవికి తగ్గట్టుగా మలచడంలో టీం మొత్తం సక్సెస్ అయ్యింది. ఒరిజినల్ ‘కత్తి’తో ‘..150’ని పోల్చలేమనడానికి చిరంజీవి ప్రజెనే్స కారణం. చిరు తన స్టయిల్ టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాడు. కథపరంగా తన పాత్రకు ప్రాథాన్యత లేకున్నా, కాజల్ ఎప్పటిలాగే అందం, నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ఫాలో చిరు ఎనర్జిటిక్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సరదాగా నడిపిస్తూనే, ఫ్లాట్‌లో కీలకమైన రైతుల సమస్యను ఎలివేట్ చేయడానికి దర్శకుడు వినాయక్ తీసుకున్న జాగ్రత్తలు ఫలితాన్నిచ్చాయి. చిరంజీవి సినిమా అనగానే ఊపునిచ్చే పాటలు మామూలేకనుక, ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన బాణీలూ సినిమాకు బలామయ్యాయ. అందమైన లొకేషన్లు, చిరు మార్క్ డ్యాన్సులు -అభిమానులకు కనువిందే. ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటలో తండ్రి చిరంజీవితో కలిసి రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కు ఫెస్టివల్ ఫీస్ట్. దర్శకుడు వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధంగా పోషించాడు. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఆశించే అంశాలను వండి వడ్డించాడు. కథలోని ఎమోషనల్ లైన్‌కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో వినాయక్ సీనియరిటీ కనిపించింది. దర్శకుడిగా పర్ఫెక్ట్ కమర్షియల్ ప్రాడెక్ట్ అందించడంలో వినాయక్ సక్సెస్. డ్యాన్స్‌పరంగా చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఆశించేది ఎక్కువే ఉంటుంది కనుక -కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీలు చాలెంజింగ్ కంపోజిషనే్స ఇవ్వగలిగారు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాల్లో దేవిశ్రీ పనితనం కనిపించింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్‌నెస్ తెచ్చింది. పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు చిరు సినిమాను సగం మోసేశాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘...150’వ చిత్రం అభిమానులను మెప్పించినట్టే. ఫస్ట్ఫాను సరదాగా తీసుకెళ్తూనే రైతు సమస్యను ఎలివేట్ చేసిన విధానం, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, తన మార్క్ స్టెప్పులు, పరిణితి చూపించే నటన, టైమింగ్ కామెడీ.. ప్లస్ పాయింట్లు. చిరంజీవి ఎనర్జీని ఎలివేట్ చేయడానికైనా, ఫేస్ చేయడానికైనా పవర్‌ఫుల్ విలనీ అవసరం. కానీ, బలహీనమైన ప్రతి నాయకుడి పాత్ర -మంచి చిత్రానికి మైనస్ పాయింట్ అయ్యింది. విలన్ తరుణ్ అరోరా -చిరంజీవి ముందు తేలిపోయాడు. నటన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సెకండాఫ్‌లో కాస్త సాగదీసిన డ్రామా, రైతుల సమస్యకు బలమైన పరిష్కారం చూపకుండా అసంతృప్తిగా వదిలేయడం ఇంకొన్ని మైనస్ పాయింట్లు. ఏదేమైనా ‘బాస్ ఈజ్ బ్యాక్’ నినాదానికి న్యాయం చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

-త్రివేది