రివ్యూ

ఓ మంచి గ్యాంగ్‌స్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** రారుూస్
**
తారాగణం: షారుఖ్ ఖాన్, మహిరా ఖాన్, అతుల్ కులకర్ణి, నవాజ్ సిద్దిఖి సంగీతం: రామ్ సంపత్
సినిమాటోగ్రఫీ: కెయు మోహనన్
ఎడిటింగ్: దీపా భాటియా
రచన: రాహుల్ ధోలాకియా
నిర్మాతలు: రితేష్ సిద్వానీ,
ఫర్హాన్ అఖ్తర్, గౌరీఖాన్
దర్శకత్వం: రాహుల్ ధోలాకియా
**
డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిపోదాం. ఇతడొక మత ప్రతినిధి. అంతకుమించి గ్యాంగ్‌స్టర్. ఇంకోవైపు రాబిన్‌హుడ్. ఉన్నవాళ్లని దోచుకొని -లేని వాళ్లకి పెట్టడం ఇతని ప్రవృత్తి. తన ‘ప్రజ’ అంటే వల్లమాలిన ప్రేమ. పిల్లలకి నోట్‌బుక్స్ కొనివ్వటమంటే ఎక్కడలేని అభిమానం. తన వాళ్ల కోసం హౌసింగ్ కాంప్లెక్స్ కట్టించేస్తాడు. హాస్పిటల్ కూడా. ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి పునాది వేస్తాడు. అప్పుడప్పుడు- సెక్యులరిజం గురించి లెక్చర్ ఇస్తాడు. మతాన్ని అడ్డుపెట్టుకొని ‘దందా’ చేయటం ఇష్టం ఉండదు. అక్రమ మార్గంలో ఎన్ని దౌర్జన్యాలూ లూఠీలూ గొడవలూ చేసినా తన వాళ్ల చేత ‘మంచి’ అనిపించుకోవాలంటాడు. ఈ నేపథ్యంలో -ఏసిపి మజుందార్ (నవాజుద్దీన్ సిద్దిఖి)ని ఆ ఏరియాకి పోస్ట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. ఒకవైపు రాజకీయ నాయకుల గూండాగిరీ.. మరోవైపు ‘రారుూస్’ దౌర్జన్యం.. ఇలా అన్ని కోణాల్నించి అతగాడికి హెచ్చరికలు అందుతాయి. ఏసిపి ఏం తక్కువ తిన్నవాడు కాదు. పోలీస్ పవర్ ఏమిటో చూపిస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
ఇదొక మాస్ మసాలా సినిమా. కథలో అనుకోని మలుపులేం ఉండవు. ఓ గ్యాంగ్‌స్టర్ -ఏవిధంగా నేరమయ ప్రపంచంలో ఎదిగాడో? కొన్నాళ్లకి పతనమై.. మళ్లీ పుంజుకొని తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడో? ఇప్పటికి కొన్ని సినిమాల్లో చూసేశాం. ఈ సినిమా చూస్తున్నంతసేపూ - ప్రేక్షకుడు ’80-90 కాలానికి వెళ్లి వస్తూన్నట్టుగా అనిపిస్తుంది. ‘మాస్’ ఏయే అంశాలను ఇష్టపడతారో అంచనా వేసి.. దర్శకుడు అదే రీతిన కథని నడిపించాడు. మొహర్రం సందర్భంగా.. షారుఖ్ బ్లేడ్స్‌తో తన శరీరాన్ని గాయపరచుకోవటం.. మాంసం దుకాణం వద్ద ‘పొట్టేలు తల’తో ఫైట్ చేయటం.. తమ ‘ఆల్కహాల్ దందా’ని అడ్డుకున్నారని పోలీసులతో గొడవ పడటం.. ఇదంతా ‘మామూలు’గానే అనిపించినా.. దర్శకుడు తనదైన శైలితో సినిమాకి ఓ విధమైన ‘ఫ్రెష్‌నెస్’ తెచ్చాడు. ‘కోరుూ దందా చోటా యా బడా నహీ హోతా హై, ఔర్ కోరుూ ధరమ్ దందా సే బడ్‌కర్ నహీ హా’ -అన్న అమ్మ మాటల స్ఫూర్తితో రారుూస్ -ఈ లిక్కర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం... లాంటి సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గుజరాత్‌లోని ఫతేపూర్‌ని కథ బేస్ చేసుకొన్నప్పటికీ.. ఒకానొక గ్యాంగ్‌స్టర్ జీవిత చరిత్ర అన్న వార్తలొచ్చాయి. మొదట్నుంచీ ఈ కథ వివాదాస్పదంగా నడుస్తూనే ఉంది. నాయికస్థానంలో ముందుగా అంకితా షోరేని సెలెక్ట్ చేసి.. తర్వాత -మహిరా ఖాన్ అనే పాకిస్తానీ నటిని తీసుకున్నారు. పాకిస్తాన్ నటీనటులను భారతీయ సినిమాల్లోకి తీసుకోకూడదన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్నది మరో ఆరోపణ. కథకీ -తెరవెనుక కథకీ సంబంధం లేదు కాబట్టి.. ‘రారుూస్’ మాస్‌కి ఒక మసాలా మూవీ. షారుఖ్ ఖాన్ డిఫరెంట్ రోల్‌ని ప్లే చేశాడు. ఏసిపిగా నవాజుద్దీన్ సిద్దిఖి చక్కటి నటనను ప్రదర్శించాడు. మహిరాఖాన్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. షారుఖ్ అన్నీ తానై సమర్థవంతంగా నడపటంవల్ల కథ సాఫీగా సాగిపోయింది. మిగతా అన్ని శాఖలు ఓకే.

-బిఎనే్క