రివ్యూ

యుద్ధం -ప్రేమ -కంగన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** రంగూన్
**

తారాగణం: సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ తదితరులు
సంగీతం: విశాల్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్
కథ: మాథ్యూ రాబిన్స్
నిర్మాత: సాజిద్ నాడియావాలా
దర్శకత్వం: విశాల్ భరద్వాజ్

**
ఇటీవలి కాలంలో లవ్‌స్టోరీలకు చెల్లుచీటీ ఇచ్చేసి.. ఆత్మకథల వెంట, చరిత్ర శిలాక్షరాల్లోకి బాలీవుడ్ కథ పరుగులు పెడుతోంది. చరిత్ర లోతుల్ని అనే్వషిస్తోంది. ‘ఆత్మకథ’ల నీలినీడల్ని వెంటాడుతోంది. ఎవరికీ తెలీని చరిత్రని స్పృశించటం ఒక ఎత్తయితే, ఆటోబయోగ్రఫీల్ని మనసుకి ‘హత్తుకునేట్టు’.. ‘ముద్దుల’ వర్షంలో మునిగేట్టు చేయటం మరో మంత్రం. 1944 ప్రాంతంలో బాలీవుడ్‌ని ఏలి తళుక్కున మెరసిన ఓ తార జీవితానికి.. భారత స్వాతంత్య్ర మునుపటి నేపథ్యం.. రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు బీభత్సాల మధ్య ‘ట్రయాంగిల్’ లవ్‌స్టోరీతో ‘రంగూన్’ వెళ్లేట్టు చేయగలిగిందీ సినిమా.
మహాత్మాగాంధీ అహింసా మార్గం ఓవైపు.. సుభాష్ చంద్రబోస్ పోరాటం మరోవైపు -ఏవిధంగానైనా బ్రిటీష్ సైన్యాన్ని వెళ్లగొట్టి స్వేచ్ఛా ఊపిరులు పీల్చాలని దేశంలోని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్న సందర్భం అది. గాంధీ అహింసకూ.. బోస్ మిలిటరీ తత్వానికీ మధ్య ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితులవి.
1940ల్లో జనావళి మనసుల్ని కొల్లగొట్టి, సాహసోపేత యువతిగా ఇండస్ట్రీని ఆకట్టుకొని -బాంబే సినిమా నేలిన జూలియా (కంగనా)కి డేర్ డెవిల్ అన్న పేరు స్థిరపడింది. వృత్తిరీత్యా ఎన్ని విజయాలు సాధించినా.. నిర్మాతగా ఇండస్ట్రీలో వెలుగొందినా.. ‘ఆడది’గానే చూడబడుతూంటుంది. అదీ రూసీ బిల్‌మోరియా (సైఫ్) అనే పార్శీ ప్రొడ్యూసర్ దృష్టిలో. ఆడవాళ్లంటే అతడికుండే ఆ అభిప్రాయం ఏనాటికీ మారదు. ఆడదంటే ‘అవసరం’ తీర్చేదే తప్ప ఆమెకంటూ ఏ ఆలోచనలూ ఉండకూడదంటాడు. బిల్‌మోరియా బిజినెస్ పనుల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో మిస్ జూలియా ఇండో-మయన్మార్ సరిహద్దులకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జమాదార్ నవాబ్ మాలిక్‌తో పరిచయం ఏర్పడుతుంది. కొందరు భారతీయుల మాదిరిగానే బ్రిటీష్ ఆర్మీ కోసం సైనికుడిగా పని చేస్తూంటాడతను. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మధ్య ‘యుద్ధం’ నడుస్తూంది.
దర్శకుడు ఈ కథని ఏ తీరుగా మలచాలనుకొన్నాడో అంతకు మించిన రిజల్ట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. కథని మూడు భాగాలుగా విడగొట్టాడు. మిస్ జూలియా లైఫ్.. ఇండస్ట్రీ గురించిన సన్నివేశాలు.. అహింసకీ.. మిలిటరీ మార్గానికీ మధ్య సాగిన పోరాటం -ట్రయాంగిల్ ప్రేమ కథ.. ఇలా దర్శకుడు అనుక్షణం ‘క్లారిటీ’తో వెళ్లాడు. సాంకేతిక పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకరితో ఒకరు పోటీపడినట్టు -కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో ఎవరి పనితనం వాళ్లు చూపించారు. అయితే- మరో క్షణం కథలో వచ్చే ‘ముద్దుల’ సన్నివేశాలు కథాబలాన్ని దెబ్బ తీయటమే కాకండా దృష్టిని మరోవైపు నిలిపేలా చేశాయి. యుద్ధ బీభత్సం తర్వాతి సంగతి.. ముద్దుల బీభత్సం కోసం ప్రేక్షకుడు ఎదురుచూస్తాడన్నట్టుగా మారింది సీన్.
స్టంట్ క్వీన్‌గా కంగన చక్కటి నటనను ప్రదర్శించింది. తన బాడీ లాంగ్వేజ్‌తో.. యాక్షన్ సన్నివేశాలను పండించింది. నెగెటివ్ రోల్‌లో రూసీ బిల్‌మోరియాగా సైఫ్ అలీఖాన్.. సైనికుడిగా.. మానసిక సంఘర్షణతో సతమతమయ్యే ప్రియుడిగా షాహిద్ కపూర్ తమతమ పాత్రల్లో వొదిగిపోయారు.
కానీ -కొన్ని సన్నివేశాల నిడివి మరీ ఎక్కువ కావటంవల్ల అక్కడక్కడ సినిమా బోర్ కొట్టేస్తుంది. పోనీ సెకండ్ హాఫ్‌లోనైనా కథని సాఫీగా నెట్టుకెళ్తాడేమో అనుకుంటే- అక్కడ్నుంచీ కథలో నాటకీయత ప్రవేశించింది. వీటన్నింటి ముందూ ‘కంగన’ హావభావాలూ.. ఘాటైన ముద్దులూ ప్రేక్షకులకు వేసవిలో కాస్తంత చల్లదనాన్ని ఇచ్చాయి.
సినిమా షూటింగ్ జరుపుకోబోతూండగా -కొన్ని వార్తలు ప్రేక్షకుల్ని తికమక పెట్టాయి. 1908-1996 ప్రాంతంలో ‘్ఫయర్‌లెస్’ లేడీగా ఇండస్ట్రీలో పేరుగాంచిన నాడియా కథ అన్నారు. కొన్నాళ్లపాటు ఈ రూమర్స్ రాజ్యమేలటానికి ఆజ్యం పోసినట్టుగా.. కంగన రంగూన్ వెళ్లి అక్కడ ‘నాడియా’ జీవితానికి సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించి ఆమె తాలూకు నటనను మనసులో నిలుపుకొన్నట్టు తెలిసింది. అయితే ఇది బయోపిక్ అనటానికి లేదు. నాడియా నిజ జీవితంలో ఏం జరిగిందన్న వాస్తవాలు ఎవరికీ అంతగా తెలీవు. కాబట్టి -సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘కంగన’ కోణంలోంచి చూస్తే ఓకే.

-బిఎనే్క