రివ్యూ

అడ్రస్ దొరకలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* c/o గోదావరి
*
తారాగణం: రోహిత్ ఎస్, శృతివర్మ, దీపునాయుడు, పోసాని కృష్ణమురళి, సుమన్, భరణీ శంకర్, మధుమణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ సంగీతం: రఘు కుంచే
నిర్మాతలు: తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు,
రంబాల రాజేష్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: రాజారామ్మోహన్ చల్లా
*
‘గోదావరి’ పేరు మనసులోకి వచ్చిందంటేనే ఏదో తెలియని అనుభూతి. అలాంటి పదాన్ని టైటిల్ చేసుకున్న సినిమా బృందం అభిరుచి ప్రశంసనీయమైనా, అంత గొప్పగా సినిమా తీయలేకపోయారు.
క్రికెట్ సాకుతో బాధ్యతారహితంగా తిరిగే సుబ్బు (రోహిత్) ఓ సందర్భంలో బాగా డబ్బున్న మృత్యుంజయనాయుడు (్భరణీశంకర్) చెల్లెలు సునంద (దీపునాయుడు)ను తన ప్రేమికురాలిగా చెప్తాడు. నిజమేననుకున్న అతని స్నేహితుడు ఆటోడ్రైవర్, సునందకొచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొడతాడు. సంబంధం చెడిపోవడానికి కారణం తెలుసుకున్న మృత్యుంజయనాయుడు ‘నువ్వెందుకూ పనికిరానివాడవు, నీకెవరైనా పిల్లనిస్తారా’ అంటూ ఊరిముందు సుబ్బుని అవమానిస్తాడు. ‘నీ ముందే పెద్దవాణ్ణవుతా, పేరు సంపాదిస్తా’నన్న చాలెంజ్‌తో సుబ్బు ఎలా ఎదిగాడన్నది మిగతా కథ. వందల సినిమాల్లో చూసిన రొటీన్ కథ.
ఫేసుబుక్కులు, ట్విట్టర్లూ తదితర ఆధునిక సదుపాయాలు అందిపుచ్చుకోడంలో ఆ గ్రామం బెస్టు అని చెప్పుకొచ్చిన దర్శకుడు, ఓ వ్యక్తిని ఊరందరి ముందు కొడుతూంటే కనీసం స్పందించినట్టు కూడా చూపకపోవడం, పోలీసు వ్యవస్థను పత్తాలేకుండా చేయడంలాంటి సన్నివేశాలు చాలు సినిమాను అంచనా వేయడానికి. గతంలో దెబ్బతిన్న నాయకుడు పట్నంవెళ్లి బాగుపడినట్టు చూపిస్తే, ఇందులో ఉన్న ఊళ్లోనే ఎదగడం కథాపరంగా బావుంది. ఆ క్రమంలో అసలు కథకు సంబంధంలేని సన్నివేశాలు జొప్పించటం ఒకింత బోర్. దీనికితోడు తెలుగు సినిమా వాడి వదిలేసిన ద్వంద్వార్థాల మాటలు ఈ చిత్రంలో కామెడీ. ‘మమకారం- కాస్తంత వెటకారం’ అన్న గోదావరి జిల్లాల సారాన్ని చిన్నమాటల్లో చెప్పడాన్ని హర్షించినా, ‘వెటకారం’ పేరిట ఫలానా వాడి ‘గూగుల్’ పగిలిపోయింది, ఈ శబ్దానికి ‘అవుట్‌పుట్’ రావడం లేదు అన్న మాటలు అభ్యంతరకరాలు. అలాగే సత్యం రాజేష్ పాత్రతోనూ తృతీయశ్రేణి కామెడీని చూపించారు. రాజా రామ్మోహన్ దర్శకత్వం కంటే సంభాషణలపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్టు అనిపించింది. ఆక్వా సైంటిస్ట్ (సుమన్) ద్వారా పరాజయాలకు కృంగిపోకుండా ఎదురీదాలి అన్న బోధన హీరోకి చేస్తూ, ‘టెన్త్ కూడా పాస్ కాని సచిన్, టెన్త్‌క్లాస్ పాఠ్యాంశంగా మారాడు’ అని చెప్పించడం బాగుంది. హీరో రోహిత్ డాన్స్‌ల్లో ప్రతిభ కనపర్చినా, డైలాగ్ డెలివరీ, ముఖ కవళికల్లో కనీసస్థాయికి చేరలేదు. అంతకంటే సుబ్బుని ప్రేమించిన అతని పక్కింటి అమ్మాయి జానకిగా శృతివర్మ చక్కటి నటన ప్రదర్శించింది. మృత్యుంజయనాయుడిగా టీవీ నటుడు భరణీశంకర్ సంభాషణోచ్ఛారణవరకూ ఓకే అయినా, విలనీకి తగిన ఆకారం లేకపోవడం వీక్ పాయింట్. హీరో తల్లిగా మధుమణి ఎన్నదగిన నటన ప్రదర్శించింది. రఘుకుంచే స్వరాల్లో ‘వెనె్నల్లో గోదావరల్లే’ పాట సులువుగా హమ్మింగ్ చేసుకోవచ్చు. ‘నువ్వేనా.. నువ్వేనా’ పాటలో రఘుకుంచే కనిపిస్తాడు. చిత్రం థీమ్‌సాంగ్‌గా ఉన్న ‘పదపదరా..’లో ‘ఎదురే లేదింకా మోగించేయి ఢంకా...’ ‘మరచిపోకు నీ లక్ష్యం, చేరుకోవాలి గమ్యం’ పదాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. గోదావరి అందాల్ని మురళీవర్మన్ కెమేరా ఇంకా బాకా క్యాప్చర్ చేసే అవకాశమున్నా సరిగ్గా ఉపయోగించలేదు. మొత్తానికి కేరాఫ్ గోదావరి చిత్రం ప్రచార నినాదంగా ఉన్నా (అరిటాకులో వడ్డించిన వేడి వేడి ఇడ్డెన్లులాంటి సినిమా) పదానికి న్యాయం చేకూర్చని చిత్రంగా మాత్రం నిక్షేపంగా చెప్పేయచ్చు.

-అనే్వషి