రివ్యూ

రాజకీయంపై యమపాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు**యమన్
**
తారాగణం: విజయ్ ఆంటోనీ, మియా జార్జి, త్యాగరాజన్, చార్లీ, మారిముత్తు, జయకుమార్, ఫ్రింజ్ నితిక్, సిగిలి మురుగన్, స్వామినాథన్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: రవీందర్‌రెడ్డి మిర్యాల
కెమెరా, దర్శకత్వం: జీవ శంకర్
**

రాజకీయాలు లేకపోతే మనిషి లేడు. అతని చుట్టూ అల్లుకున్న ఓ విష వలయం అది. ఒక్కోసారి సాలీడు దాడి చేసినట్టుగా మన స్నేహితులే విషం చిమ్ముతారు. అది గ్రహించేలోగా రాజకీయం రంగులు మారిపోతుంది. మిత్రులు శత్రువులవుతారు. శత్రువులు బంధువులకన్నా ఎక్కువవుతారు. మనకు అన్యాయం చేసినవాడు ఎవరో కనుక్కోవడం ఒక్కోసారి చాలా కష్టం. మనం నష్టపోయామంటే దాని వెనుక ఎన్ని రాజకీయ లెక్కలు ఉన్నాయో ఊహించలేం. ఎవరి లెక్కలు వారివి. లెక్క తప్పిందో గన్ పేలి తూటా దిగిందన్న మాటే! అసలు రాజకీయాలు జోలికి వెళ్లొద్దు అనుకుంటే, ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. ఎప్పుడో ఒకప్పుడు ఓటు వేయాల్సిందే! లేదంటే జనారణ్యాన్ని వదిలి అరణ్యంలో బతకాల్సి వస్తుంది. రాజకీయం అడవిని కూడా కవ్విస్తుంది. అందుకే వెంటాడే రాజకీయాలను వేటాడాలి అని చెబుతాడు యమన్. ప్రకృతిని మనిషి వశపర్చుకున్నట్టు, రాజకీయాలను శాశించాలనుకుంటాడు. కానీ, ప్రకృతిని మన చెప్పుచేతల్లోకి తెచ్చేకోవడం అంటే ఆటంబాంబును గుప్పిట్లో పెట్టుకున్నట్టే! అది ఎప్పుడైనా పేలవచ్చు.
ఇదీ సినిమాలో ఉన్న విషయం. తన తాత ఆపరేషన్ కోసం ఓ మధ్యవర్తి వద్ద డబ్బులు తీసుకుని చెయ్యని నేరంపై జైలుకు వెళ్తాడు అశోక్ చక్రవర్తి (విజయ్ ఆంటోనీ). ఆ నేరం వెనుక రెండు హత్యారాజకీయ వర్గాలు మోహరించి ఉంటాయి. నిజమైన నేరస్తుడిని కనిపెట్టడానికి ఓ వర్గం ప్రయత్నిస్తుంది. మరోవర్గం జైల్లోవున్న అశోక్‌ను వెంటాడుతుంది. ఇవేమీ తెలియని అశోక్ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో చూపిన తెగువ ఇరు వర్గాలకు నచ్చుతుంది. తనకు అనుకూలంగా ఉన్న వర్గంతో చేతులు కలిపి జైలునుంచి విడుదలవుతాడు అశోక్. ఆ నేపథ్యంలో కలిసిన మరో రాజకీయ పెద్ద కరుణాకరన్ (త్యాగరాజన్). సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అతను అనుయాయులైన రెండు వర్గాలను పిలిచి రాజీ కుదురుస్తాడు. రాజీలో భాగంగా అశోక్‌ను హత్య చేయడానికి ఇరు వర్గాలు ఒప్పుకుంటాయి. అది తెలుసుకున్న అశోక్ యముడిలా ఆలోచించి రెండు వర్గాల్లోని ఓ అధిపతిని అంతం చేస్తాడు. మరో అధిపతిని రక్షించే మంత్రి పాండురంగం ప్రాపకం సంపాదిస్తాడు. బార్ షాపు లైసెన్స్‌ను అశోక్‌కు ఇచ్చినట్టే ఇచ్చిన మంత్రి, అతని హత్యకు సన్నాహం చేస్తాడు. మరోవర్గం నాయకుడిని మంత్రే చంపేలా పథకం వేసి విజయం సాధిస్తాడు అశోక్. చోటా నాయకులు అంతమయ్యాక, బడా లీడర్లు పాండరంగం, కరుణాకరన్ మిగులుతారు. వైకుంఠపాళీలో ఏ పాము ఎక్కడొస్తుందో అడుగులు వేసినట్టుగా అశోక్ నిచ్చెనలెక్కి ఎమ్మెల్యే కరుణాకరన్ స్థానాన్ని కోరుకుంటాడు. తన చిన్ననాడే తండ్రి దేవరకొండ గాంధీని (విజయ్ ఆంటోనీ) మరణానికి కారణమైన పాండురంగం అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేలా చేసి అతనిపై పగ తీర్చుకుంటాడు. మిగిలిన మరో టార్గెట్ కరుణాకరన్. తన స్థానానికి అడ్డుతగులుతున్న అశోక్‌ను తెలివిగా యమపురికి పంపే ఏర్పాటు కరుణాకరన్ చేయగా, మాయోపాయంతో యమునిలా కథనాయకుడు ఎలా పడగొట్టాడన్నది మిగతా కథ.
ఈ సినిమా మొదటినుంచీ ఎత్తుకున్న కథనానికి పక్కకు జరగకుండా సీరియస్‌గా సాగిపోతుంది. మధ్యలో హీరోయిన్ అహల్య (మియా జార్జి) కథ పిట్ట కధే! లవ్ ట్రాక్ ఉండాలి కనుక ఉంది అంతే. ప్రతి పాత్రకు ఓ గుర్తింపు ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ రాసుకోవడం బావుంది. ఏ పాత్రను మర్చిపోలేం. సాంబశివ, నరసింహల వైరుధ్యం, జైలు ఫైట్‌లో నాయుకుడు త్యాగరాజు (చార్లీ), మంత్రి పాండురంగం, కరుణాకర్, ప్రిన్జి నితిక్ పోషించిన పాత్రలు స్క్రిప్ట్‌ను వెంటాడతాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన పోరాటంలో ప్రేక్షకుడిని సినిమాలో ఓ భాగంగా చేయడంలో స్క్రీన్‌ప్లేలో మెరుపులు కనిపిస్తాయి. ప్రతి విషయాన్ని చాలా డీప్‌గా ఆలోచిస్తూ, ఎదుటి వ్యక్తులకు పైయెత్తులు వేసేలా కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారు. అందువల్లే సినిమా స్లోగా సాగినట్టు ఉంటుంది. అయితే సన్నివేశాల్లో ఉచ్చుకత ఉండటంతో ఆ ఇబ్బంది తెలీదు. ఫైట్ అంటే ఫటాఫట్ తన్నుకోవడం కాదు, పెట్రోలు సీసా విసిరితే అది శత్రువు కళ్లలో పెద్దదిగా మారుతూ కనిపించే సమయాన్ని ప్రేక్షకుడికి ఇచ్చాడు దర్శకుడు. ఇలాంటివే చిత్రంలో ఆకట్టుకుంటాయి. డబ్బులు తీసుకుని ఓటు వేయడం, అమాయకుల బలహీనత ఉపయోగించుకుని రాజకీయాల్లో ఎదగడం, శకుని -చాణక్య కలిసి ఆడే ఆటలుగా రాజకీయాన్ని వర్ణించటం లాంటివి ఆకట్టుకుంటాయి. కులమతాలను అడ్డంపెట్టుకుని రాజకీయ నాయకులు ఆడే నాటకాలు కూడా ఎద్దేవా చేశాయి. సినీతారల వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలను దర్శకుడు వివరించాడు. నలుగురు ప్రత్యర్థుల ఏకాంత ఆలోచనల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు డ్రై సబ్జెక్టు అయినా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. తప్పు చేయడానికి, తప్పు చేసిన వాడిని శిక్షించటం ఒకటి కాదని చెప్పే యముడు చివరిలో ఆ తప్పులో తాను కూడా ఒక భాగమని, శత్రువుని చూసి భయపటడం అనేది స్క్రీన్‌ప్లేలో ఓ మెరుపులాంటిది. ఇక్కడ అందరూ ఏదో ఆశించి వస్తుంటారు, ఎదుటోడికి వచ్చిన కష్టం మనకు రాదు అనుకోవద్దు. రాజకీయాల్లో బాగా బతికిన వాళ్లకంటే, బాగా కోల్పోయిన వాళ్లే ఎక్కువ. రాజకీయం ఓ మురికి కాల్వ, కానీ అది మనిషి రక్తం నుంచి వచ్చిన మురికి. ఇప్పుడు చంపు, లేదా నేను చంపేస్తా, జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నాక, దానితోనే ఉండాలి లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. పాటలపరంగా ‘నీ మనసే ఓ రణం’ బావుంది. నటీనటుల్లో విజయ్ ఆంటోనీ సినిమానంతా తన భుజస్కందాలపై నడిపించాడు. అతను లేని సన్నివేశం ఉండదు. మిగతావాళ్లంతా పాత్ర పరిధిమేరకు చేశారు. చివరిలో పాండురంగం కొడుకు పాత్ర ఎక్కడా కనిపించక పోవడం విడ్డూరం. దర్శకత్వపరంగా కెమెరాను, స్క్రిప్ట్‌ను సన్నివేశానికి అనుగుణంగా తీర్చిదిద్దాడు.

-సరయు