రివ్యూ

స్వారీ.. తిక్కరేపాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* విన్నర్
*
తారాగణం: సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, ముఖేష్‌రుషి, ఠాకూర్ అనూప్‌సింగ్, వెనె్నల కిషోర్, ఆలీ, సురేష్, పృథ్వీ, అనసూయ తదితరులు.
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
ఎడిటింగ్: గౌతంరాజు
కథ: వెలిగొండ శ్రీనివాస్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
*
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో ఊపుమీదున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌కి తిక్క ఒకింత బ్రేక్ వేసింది. మళ్లీ సక్సెస్ కోసం చేసిన ప్రయత్నమే -విన్నర్. డాన్ శీను, బలుపు సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రేస్ కోర్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్‌చేసి విన్నర్ డిజైన్ చేశారు. కెరీర్‌లో టాప్‌గేర్‌లోవున్న రకుల్‌తో జోడీకట్టిన సాయిధరమ్‌కు విన్నర్ ఎలాంటి రిజల్ట్ తీసుకొచ్చిందో చూద్దాం.
గుర్రపు పందేల మూలంగా చిన్నతనంలోనే తండ్రి మహేందర్‌రెడ్డి (జగపతిబాబు)కి దూరమవుతాడు సిద్ధార్థ్ (్ధరమ్‌తేజ్). అలా రేసింగ్ మీద ద్వేషం పెంచుకుంటాడు. తండ్రికి దూరంగా పెరిగిన సిద్ధార్థ్, సితార (రకుల్ ప్రీత్‌సింగ్)ను ప్రేమిస్తాడు. సితారను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసే యోచనలో ఉంటాడు ఆమె తండ్రి. ఆ పెళ్లి ఇష్టంలేని సితార, సిద్ధార్థ్‌ను ప్రేమిస్తున్నట్టు తండ్రితో అబద్ధం చెప్పి పందెం కడుతుంది. అలా సితార ప్రేమకోసం అనుకోకుండా పందెంలోకి దిగిన సిద్ధార్థ్‌ను ఓడించడానికి -ప్రపంచంలోనే నెంబర్ వన్ జాకీ ఆది (్ఠకూర్ అనూప్‌సింగ్) అడ్డుపడుతుంటాడు. అదే సమయంలో సిద్ధార్థ్ తను చిన్నతనంలో దూరమైన తండ్రి ప్రేమను గెలుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా సితార, తండ్రి ప్రేమ కోసం రేస్‌లోకి దిగిన సిద్ధార్థ్, ఆదిని ఎలా ఎదుర్కొంటాడు? అసలు ఆది ఎవరు? సిద్ధార్థ్ జీవితంలోకి ఎందుకు వచ్చాడు? దూరమైన తండ్రి ప్రేమను, పందెంగా పెట్టిన సితార ప్రేమను గెలిచి సిద్ధార్థ్ విన్నర్ ఎలా అయ్యాడు? అనేది మిగిలిన సినిమా.
మేకోవర్‌లో కొత్తగా కనిపించిన సాయిధరమ్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోలేకపోయాడు. పైగా అతని పెర్ఫార్మెన్స్‌కి తగిన పాత్ర కూడా కాకపోవడంతో తేలిపోయింది. డ్యాన్స్, ఫైట్లు, మ్యానరిజమ్స్‌లో ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు తేలిపోయాయి. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ను అందంగా చూపించేందుకు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు చేసిన ప్రయత్నం ఓకే. కాకపోతే పాటలు, కథను ముందుకు తీసుకెళ్లే టైమ్ పాస్ లింకు సన్నివేశాల కోసం తప్ప ఆమె పాత్రకు అర్థంలేకుండా పోయింది. జగపతిబాబు, ముఖేష్‌రుషి, సురేష్ తదితరుల పాత్రలు రౌటీన్‌గానే అనిపిస్తాయి తప్ప కొత్తదనం కనిపించలేదు.
కామెడీ డిజైన్‌లో సింగం సుజాతగా పృథ్వీ, పీటర్ హెయిన్స్‌గా ఆలీ నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేసి ఓకే అనిపించుకున్నారు.
దర్శకుడు మలినేని మంచి కథతో బలమైన ఆరంభం, ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ఫాని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించినా, సెకండాఫ్‌లో ఆసక్తికలిగించని సన్నివేశాల పేర్పుతో రొటీన్‌కు వచ్చేశాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించింది. బిజి స్కోర్ తప్ప, థమన్ బాణీలు మెప్పించలేదు. ఎడిటింగ్ తప్ప, కొరియోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకోలేదు. తేజ్ పాత్రకు రాసిన పంచ్ డైలాగులు ఎంజాయ్ చేయొచ్చు.
కమర్షియల్ కంటెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని, ఈ కథ ఎంపిక విషయంలో తడబడ్డాడు. యాక్షన్ స్టోరీయే అయినా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే రాయడంలో విఫలమయ్యాడు. సెకండాఫ్ స్టోరీమీద ఆడియన్స్‌కి ముందే క్లారిటీ వచ్చేయడంతో, ఫస్ట్ఫా ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాఫ్‌కూడా కిందకు దిగిపోయింది. అసంతృప్తిగా ముగిసిన క్లైమాక్స్, తేజ్‌నుండి ఆశించిన స్థాయిలో డ్యాన్సులు లేకపోవడం అభిమానులకు సైతం నచ్చని అంశాలే.

-త్రివేది