రివ్యూ

కృష్ణానంద కొంటె లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ద్వారక
**
తారాగణం: విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి, పృథ్వీ, రఘుబాబు, ప్రకాష్‌రాజ్, మురళీ శర్మ, సుదర్శన్, సురేఖావాణి సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు
మాటలు: లక్ష్మీ భూపాల్
నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి,
గణేష్ పెనుబోతు
రచన, దర్శకత్వం: శ్రీనివాస రవీంద్ర
**
సినీ కథలు జనానికి ఆలోచించేంత టైం ఇవ్వవు. 24 ఫ్రేమ్స్.. 14 రీళ్లూ ఏకబిగిన కొండచిలువలా చుట్టేసుకొంటూ ‘ఎంటర్‌టైన్‌మెంట్’ మా పరమావధి అనీ.. మారు మాట్లాడకుండా చూసి తరించండి అంటూ వెళ్లిపోతూంటాయి. యాదృచ్ఛికంగానో.. గ్రహచారం బాగోకనో -‘అయ్యారే’ ఇలాంటి సినిమా ఏదో గతంలో చూసేసినట్టుందే? అని మనల్ని మనం ప్రశ్నించుకొని- విశే్లషించుకొనేంత దీర్ఘాలోచనకి తావివ్వకుండా- ‘అదిగో ద్వారక’ ఆలమందలవిగో -అంటూ నిట్టూర్పో.. ఊరడింపో తెలీకుండా వౌనముద్రలో ముంచేట్టు చేస్తుందీ సినిమా. చెప్పింది విను -లాజిక్ ప్రశ్నలొద్దు అన్న నీతిసూత్రాన్ని కచ్చితంగా పాటించినట్లయితే ‘ద్వారక’లో ఆలమందలే కాదు -ఎంటర్‌టైన్ చేసే అంశాలూ బోలెడన్ని.
ఎర్ర శ్రీను (విజయ్) ఓ దొంగ. డబ్బంటే చెప్పలేనంత ఇష్టం. భూమండలం సూర్యుడి చుట్టూ కాదు -డబ్బు చుట్టూ పరిభ్రమణం చెందుతోందన్న పాత సామెతని పట్టుకొని వేలాడేస్తూంటాడు. జీవితంలో స్థిరత్వం ఉండాలనీ.. కొడితే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనీ.. ఓ ఖరీదైన విగ్రహాన్ని చోరీ చేయాలన్న నిర్ణయానికి వస్తాడు. అతడి స్నేహ బృందం దీనికి సహకరిస్తుంది. దొంగతనం చేస్తూండగా పోలీసులు ప్రవేశించటంతో -‘ద్వారక’ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకొంటాడు. అక్కడ శ్రీనుకి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దొంగ కాస్తా స్వామి కృష్ణానందగా మారాల్సి వస్తుంది. కొన్నాళ్లు పోలీసుల కంట పడకుండా దాక్కోవాల్సి రావటంతో శ్రీను ‘స్వామి’గా అవతారమెత్తి సెటిలైపోతాడు. అనుకోని రీతిలో అద్భుతాలు జరగటంతో ‘ద్వారక’లోని వారే కాకండా చుట్టుపక్కల జనం కూడా ‘స్వామి’ మాయలో పడతారు. దీన్ని అవకాశంగా తీసుకొని శ్రీను స్నేహితులు ఒక ట్రస్ట్ నెలకొల్పి భారీగా డొనేషన్లు వసూలు చేసేస్తూంటారు. కోట్లకొద్దీ ధనం ట్రస్ట్‌లోకి వచ్చేస్తూంటుంది. శ్రీను స్నేహితుల ‘దందా’ ఆ విధంగా ఉంటే.. చీకట్లో చూసిన (?) అమ్మాయి ప్రేమలో పడిపోతాడు శ్రీను. ఈ ప్రేమ కథా.. ఆ ట్రస్ట్ బాగోతం సజావుగా సాగిపోతూండగా.. హేతువాది అయిన రామకృష్ణ (మురళీ శర్మ) శ్రీనుని ‘దొంగబాబా’గా నిరూపించాలనుకొంటాడు. ఈ నేపథ్యంలోకి ముఖ్యమంత్రి ప్రవేశిస్తాడు. ‘స్వామి కృష్ణానంద’ అవతారమెత్తిన శ్రీను ఆ వేషం నుంచీ ఎలా బయటపడగలిగాడు? మధ్యలో ముఖ్యమంత్రి గొడవేటిమి? వసుధ ప్రేమని గెలుచుకున్నాడా? అన్నది క్లైమాక్స్. సినిమా అంతా విజయ్ దేవరకొండ మీదే ఆధారపడి నడుస్తుంది. దొంగగా, దొంగ బాబాగా, మంచివాడిగా.. ప్రేమికుడిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని విజయ్ చూపెట్టాడు. పృథ్వీ కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్. పూజారి పాత్రలో మెప్పించాడు. ప్రభాకర్, మురళీ శర్మ, రఘుబాబు, ప్రకాష్‌రాజ్ తమ పరిధి మేరకు నటించారు. పూజా ఝవేరి ఫర్వాలేదనిపిస్తుంది.
హీరోని ఎప్పుడూ ‘దొంగ బాబా’ యాంగిల్‌లో ఆలోచించరు. కాబట్టి కానె్సప్ట్‌ని ఏ తీరునైనా మలచుకోవచ్చు. కామెడీని పండించవచ్చు. కానీ- కథ మెల్లగా ఏదో సాదాసీదాగా నడిచిపోతూంటుంది -అడపాదడపా మలుపులున్నప్పటికీ. పోలీసు డైరీ దొంగల జాబితాలో ఉన్న ‘దొంగ’కి అంతమంది ఫాలోయర్స్ ఉండటం.. అదీ లక్షల సంఖ్యలో. ట్రస్ట్ పేరిట జమ అవుతున్న కోట్లాది రూపాయలు -ఇలా ఆయా సన్నివేశాలు కన్విన్సింగ్‌గా లేకపోవటంవల్ల కథాబలం తగ్గుతూ వచ్చింది. మొదట్నుంచీ లాజిక్ మిస్సవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు -తానేమీ దేవుడిని కాదని.. దొంగనని ప్రెస్‌మీట్‌లో చెప్పటంతో తర్వాత కథకి ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. కథని ఏ మలుపు తిప్పబోతున్నాడని ఆలోచించే లోపే ఎప్పటి మాదిరిగానే కథ ట్రాక్‌లో వెళ్లిపోవటం నిరాశను కలిగిస్తుంది.
డబ్బుతో పారిపోవాలనుకున్న వాడు -చీకట్లో అమ్మాయిని చూసి ప్రేమించేయటం.. ముక్కూ మొహం తెలీని వాడి ప్రేమలో ఆ అమ్మాయి ఎలా పడిపోయిందీ అన్న ఆలోచనకి అర్థం లేదు.
కాకపోతే- సినిమా అంతా హాస్య ప్రధానంగా నడవటంవల్ల.. పృథ్వీలాంటి క్యారెక్టర్స్ హీరోకి సపోర్టింగ్‌గా నిలవటంవల్ల -ఆయా లోపాలన్నీ తాత్కాలికంగా మరుగునపడ్డాయి. సాయి కార్తీక్ సంగీతం ఫర్వాలేదు.

-బిఎనే్క