రివ్యూ

ఘాటులేని గుంటూరోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* గుంటూరోడు
*
తారాగణం: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్, సంపత్‌రాజ్, రాజేంద్రప్రసాద్, ప్రవీణ్, కోట, కాశీవిశ్వనాథ్, రావ్మ్రేష్, సత్య, పృథ్వీ తదితరులు
సంగీతం: డిజె వసంత్
నిర్మాత: శ్రీవరుణ్ అట్లూరి
దర్శకత్వం: ఎస్‌కె సత్య

*
సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు మంచు మనోజ్. ఇప్పటి వరకూ వైవిధ్యమైన కథలనే ఎంచుకున్న మనోజ్ -ఈసారి పక్కా కమర్షియల్ ఫార్ములా పట్టుకుని వచ్చాడు. శ్రీవరుణ్ నిర్మించిన గుంటూరోడు చిత్రానికి దర్శకుడు ఎస్‌కె సత్య. మాస్ టైటిల్ కనుక విడుదలకు ముందు ప్రమోటింగ్ హైప్ క్రియేటైంది.
గుంటూరు కుర్రాడు కన్నా (మంచు మనోజ్). ఫ్రెండ్స్‌తో జాలీ లైఫ్ లాగించేస్తుంటాడు. అల్లరి కుర్రాడు కనుక -అనుకోకుండా క్రిమినల్ లాయర్ శేషు (సంపత్)తో గొడవపడాల్సి వస్తుంది. శేషుని తీవ్రంగా గాయపరుస్తాడు కన్నా. అనివార్యంగా కన్నామీద కక్ష పెంచుకున్న శేషు, తండ్రి (రాజేంద్రప్రసాద్)ని టార్గెట్ చేస్తాడు. ఇదే సమయంలో శేషు చెల్లెలు అమృత (ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కన్నా. శత్రువు చెల్లిని ప్రేమించిన హీరో, అమృతను దక్కించుకున్నాడా? కన్నాతో చెల్లి పెళ్లికి శేషు అంగీకరించాడా? ఇలాంటి రొటీన్ ప్రశ్నలకు సమాధానం సినిమాలో వెతుక్కోవాలి.
అసలే మాస్ సినిమా. అందులోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కథ. వెరసి పక్కా కమర్షియల్ ఫార్మాట్‌ను మనోజ్ జాగ్రత్తగానే మానేజ్ చేశాడు. ‘గుంటూరోడు’ టైటిల్‌కి బాగా సెట్టయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో బాడీ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఎక్స్‌ప్రెషన్స్ మనోజ్‌కి వర్కవుటయ్యాయి. సంపత్‌తో పోటీపడే సన్నివేశాల్లో మనోజ్ హైలెవెల్ ఎనర్జీ చూపించాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి విలనీని దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఓకే. సంపత్ తన నటనతో మరింత గ్రాఫ్‌కి తీసుకెళ్లాడు. ఇగోని టచ్ చేస్తే విలనిజం ఎలా ఉంటుందో చూపిన తీరు మాస్ సినిమా స్టామినాకు సరిపోయింది. చాలాకాలం తర్వాత నెగిటివ్ రోల్‌లో కనిపించిన కోట శ్రీనివాసరావు పెర్ఫార్మెన్స్ బాగుంది. గ్లామర్ పరంగా తప్ప ప్రగ్యాది చెప్పుకోదగ్గ పాత్ర కాదు కనక -అందంతో ఓకే అనిపించింది. రొటీన్ కథే అయినా ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడుల్లోని యాక్షన్ పార్ట్ మాస్ ఆడియన్స్‌ని మెప్పించేదే.
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం పెద్ద మైనస్. హీరో హీరోయిన్ల మధ్య చెప్పుకోదగ్గ రొమాంటిక్ ట్రాక్‌గాని, సరైన కెమిస్ట్రీగాని లేకపోయింది. సినిమా చివర్లో రావు రమేశ్ మినిస్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించడం సినిమా ముగించడానికి పెట్టుకున్న ఫుల్‌స్టాప్ సీన్ మాత్రమే.
హీరో విలన్ల మధ్య సాగే ఘర్షణ సీన్లు రిపీటెడ్ అనిపిస్తాయి. యాక్షన్ ఎడిసోడ్ డిజైన్‌లో స్టామినా కరవై, నిస్సారం అనిపిస్తాయి. పెద్దగా అట్రాక్ట్ చేయని హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, మిగిలిన కొన్ని అనవసరపు సన్నివేశాలు కథనానికి అడ్డుతగలడంతో బోరింగ్ పార్టే ఎక్కువనిపిస్తుంది. ఎంతకష్టపడినా మనోజ్ ఫిజికల్ అప్పియరెన్స్ అటు లవర్‌బోయ్‌కి, ఇటు ఊరమాస్ హీరోయిజానికి సూట్‌కాకపోవడంతో -హీరోతో ఆడియన్స్ ట్రావెల్ కావడం కష్టమైంది.
సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ బాగుంది. గుంటూరు పరిసరాలను బాగా చూపించారు. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను అందిపుచ్చుకోవడంలో కెమెరా పనితనం కనిపిస్తుంది. కమెడియన్ పృధ్వీ కామెడీ ట్రాక్ బోర్. డిజె వసంత్ సంగీతం ఫర్వాలేదనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోదు. దర్శకుడు సత్య పనితనం -మిగిలిన మైనస్‌ల కారణంగా సంపూర్ణత సాధించలేకపోయింది. యాక్షన్‌తో సమానమైన ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో -మాస్ మూవీలో వెలితి కనిపించింది. సరైన హిట్ కోసం మనోజ్ పడిన కష్టం, తాపత్రయం సినిమాలో కనిపించినా, అసలు సరుకు లేక ఆడియన్స్ ఉసూరుమన్నారు. మెప్పించే గొప్ప ప్రయత్నమేగానీ, ఫలితం డౌటే.

-త్రివేది