రివ్యూ

ప్చ్.. వీడూ అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ఆకతాయి
*

తారాగణం: ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్, ప్రదీప్ రావత్, అజయ్ ఘోష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి
సంగీతం: మరణిశర్మ
నిర్మాతలు: కౌశర్ కరణ్, విజయ్ కరణ్
దర్శకత్వం: రామ్ భీమన
*
కొత్త హీరో హీరోయిన్లు ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్‌భీమన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆకతాయి’. రివేంజ్ డ్రామా, ప్రేమకథ కలబోతగా తెరకెక్కిన ఆకతాయి ఆకట్టుకున్నాడా?
తన కుటుంబంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ చదువుకునే ఇంటెలిజెంట్ కుర్రాడు విక్రాంత్ (ఆశిష్‌రాజ్). కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుని, అందరి మెప్పు పొందుతుంటాడు. ఆ సమయంలోనే అతను అనగ (రుక్సార్‌మీర్)తో ప్రేమలో పడతాడు. అలా హాయిగా జీవితం సాగిపోతుందని అనుకున్న అతని జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రేయసి ద్వారా తన తల్లిదండ్రుల గురించిన ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే అతని జీవితంలోకి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ జహంగీర్ (ప్రదీప్ రావత్) ఎంటరవుతాడు. దాంతో విక్రాంత్ జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. అసలు తన తల్లిదండ్రుల గురించి విక్రాంత్ తెలుసుకున్న విషయం ఏమిటి? జహంగీర్ విక్రాంత్ జీవితంలోకి ఎందుకొచ్చాడు? రకరకాల మలుపులు తిరిగిన విక్రాంత్ జీవితం చివరికి ఏమైంది? అనేదే మిగతా కథ.
దర్శకుడు రామ్ భీమన సినిమా ప్రారంభించిన తీరు కాస్త ఆహ్లాదకరంగానే ఉంది. అందులో హీరోచుట్టూ జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హీరోయిన్ ఎంట్రీతో తెరమీద కాస్త గ్లామర్ టచ్ కనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య నడిచే రెండు రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. హీరో హీరోయిన్‌ను పరిచయం చేసుకోవడం, ఆమెకు వెరైటీగా తన ప్రేమను ప్రపోజ్ చేయడం వంటి సీన్లు ఓకే. ఇంటర్వెల్ సమయంలో హీరో జీవితంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనలు, రకరకాల పాత్రల ఒరిజినల్ బిహేవియర్ బయటపడటం, హీరో తాను తెలుసుకోవాలనుకున్న వివరాల కోసం చేసే ప్రయత్నాలు వంటివి ఆసక్తికరంగా ఉండటంతో సెకండాఫ్ మీద అంచనాలు పెరిగాయి. దానికితోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకమైన సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని నిలబెట్టి సినిమాకు హెల్ప్ అయింది. సుమన్, అజయ్‌ఘోష్, రాంకీ వంటి సీనియర్ నటుల నటన బాగుంది. హీరోగా మొదటి సినిమా చేసిన ‘ఆశిష్ రాజ్’ నటన జస్ట్ ఓకే. కామెడీ కూడా పెద్దగా నవ్వించలేక పోయింది.
ఇక ఆ సినిమా ఫస్ట్ఫా ఓపెనింగ్ బాగుందనిపించే లోపు దర్శకుడు కథనాన్ని యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ వంటి అన్ని అంశాలను ఎలివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో కథనాన్ని తయారు చేయడంవలన కన్ఫ్యూజన్ తలెత్తింది. ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యే సెకండాఫ్‌లో కూడా ఎక్కువ యాక్షన్ మీదే ఫోకస్ పెట్టడంవలన లవ్ ట్రాక్ మాయమైంది. హీరో గతాన్ని కొంచెం కూడా కొత్తగా కాకుండా రొటీన్‌గా డిజైన్ చేశాడు. ఎన్నో పాత సినిమాల్లో చూసినట్టే అదే విలన్, అదే పగ, అదే ప్రతీకారం. అనవసరమైన కొన్ని సన్నివేశాల్ని, పాత్రల్ని కథలోకి ఇరికించడంతో కథ ట్రాక్ తప్పేసింది. హీరోయిన్ రుక్సార్ మీర్‌కు ఫస్ట్ఫాలో మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. కానీ కథలో ఇంపార్టెన్స్ లేదు. దాంతో పెర్ఫార్మెన్స్ చూపించే స్కోప్ లేదు. పాటలైతే మధ్యలో అడ్డుతగులుతూ వాటి పని అవి చేసేశాయి. క్లైమాక్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రామ్‌భీమన రచయితగా పాత రొటీన్ ఫక్తు మాస్ కథనే రాసుకున్నాడు. ఒక్క ఇంటర్వెల్ వినా ఎక్కడా కొత్తదనమనేది చూపలేదు. ఫస్ట్ఫా, సెకండాఫ్‌లలో చాలావరకు బోరింగ్ స్క్రీన్‌ప్లే నడిపాడు. కాకపోతే దర్శకుడు సినిమా మేకింగ్‌లో పోలీస్ ఇనె్వస్టిగేషన్ వంటి సీన్లలో కొత్తతరహా బ్లాకులుపెట్టి ఆకట్టుకున్నాడు. వెంకట్ సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ ఎడిటింగ్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకి చాలావరకు దోహదపడుతూ కీలక సన్నివేశాలకు హైప్ తీసుకురావడంలో బాగా పనిచేసింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్రంలో ఆహ్లాదకరమైన ఓపెనింగ్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, కొందరు నటుల నటన ప్లస్ పాయింట్లు అయితే, రొటీన్, బోరింగ్ కథ, ఖచ్చితమైన గమ్యమంటూ లేకుండా సాగే కథనం, కథకు అవసరం లేని సన్నివేశాలు, పాత్రల హంగామా బలహీనతలు. మొత్తంమీద చాలాచోట్ల దారితప్పి ఆకతాయి కన్ఫ్యూజ్‌నే మిగిల్చాడు.

-త్రివేది