రివ్యూ

అదోరకం ప్రేమపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** నేనోరకం
**
తారాగణం: సాయిరామ్‌శంకర్, రేష్మి మీనన్, శరత్‌కుమార్, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాథ్, పృధ్వీ, ఎంఎస్ నారాయణ తదితరులు
సంగీతం: మహిత్ నారాయణ
కెమెరా: సిద్ధార్థ్
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర
**
ప్రస్తుత సమాజంలో సీనియర్ సిటిజెన్స్ ఎలా వున్నాగానీ యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతీ యువకులు మాత్రం నిరంతరం ప్రేమలోకంలో మునిగిపోతున్నారు. బాయ్‌ఫ్రెండ్ లేకపోతే అమ్మాయికి అవమానం. అబ్బాయి అమ్మాయితో కలిసి తిరక్కపోతే ఏంతోచదు. వీరి ప్రేమలు ఎంతవరకు నిజం? కేవలం అవసరార్థమే ప్రేమా దోమా అంటూ తిరుగుతున్నారా? లేకపోతే అమలిన శృంగార భావనలతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నారా? అని ఆలోచిస్తే సమాధానాలు మాత్రం దొరకవు. ఈరోజు ఒక వ్యక్తితో కనిపిస్తే, మరోరోజు ఇంకొకరితో కనిపిస్తారు. ఇలాంటివాళ్లకి ప్రేమ అన్న పదం ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని చెప్పే ప్రయత్నం ‘నేనోరకం’.
గౌతమ్ (సాయిరామ్‌శంకర్) ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. అతనికి స్వేచ్ఛ (రేష్మీ మీనన్) కనిపిస్తుంది. తొలిచూపులోనే ప్రేమిస్తాడు గౌతమ్. ఉన్నవీ లేనివీ అబద్ధాలు చెప్పి ఆమె ప్రేమపొందే ప్రయత్నం చేస్తాడు. గౌతమ్ చెబుతున్న అబద్ధాలన్నీ మొదట నిజమని నమ్మినా, తరువాత అతని సంగతి అర్థమై దూరంపెడుతుంది. కేవలం తన ప్రేమకోసమే ఇన్ని చేశాడని ఆలోచించి ఒక నిర్ణయానికి రావడానికి కలుద్దామని ఫోన్ చేస్తుంది. మరుసటిరోజు కలవాలనుకున్న చోట స్వేచ్ఛను కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. గౌతమ్‌కు నిరంతరం ఫోన్ చేసి వారి అసాంఘిక కార్యకలాపాలన్నీ అతని చేత చక్కబెట్టిస్తుంటారు. దొంగనోట్లు ఎంఎల్‌ఏకు అందించడం లాంటి పనులతో మొదట భయపడినా, గౌతమ్ మాత్రం స్వేచ్ఛ కోసం చావుకైనా తెగించి పరిగెడుతూనే ఉంటాడు. ఇంతకూ కిడ్నాప్ ఆలోచన ఏంటి? అతను స్వేచ్ఛను ఎందుకు కిడ్నాప్ చేశాడు? చివరికి స్వేచ్ఛను గౌతమ్ దక్కించుకున్నాడా లేదా? అనేది ముగింపు.
మొదటిభాగం అంతా గౌతమ్- స్వేచ్ఛల ప్రేమగోలతోనే సాగిపోతుంది. రెండో సగమే ఉత్కంఠభరితంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇదే ప్రయత్నాన్ని తొలి సగంలో కూడా చేసి ప్రేమకథను వైవిధ్యభరితంగా అందించివుంటే మొదటే ప్రేక్షకుడికి విసుగు ఉండేది కాదు. తొలిసగంలో వున్న ల్యాగ్‌ను మలిసగంలో పూర్తిచేయడంతో దర్శకుడు ఫర్వాలేదనిపిస్తాడు. రెండో సగంలోనే కథంతా సాగుతుంది. లెక్చరర్ (శరత్‌కుమార్) కూతురు గారాబంగా పెరిగి తండ్రికి తెలియకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంది. రెండు నెలల తరువాత శవమై తిరిగి వస్తుంది. అసలు ఆమె ఎవరిని ప్రేమించింది? ఎలా వెళ్లిపోయింది? ఆమె చావుకు కారణం ఎవరు? అనే అంశాలు ఏవీ తెలియని తండ్రి, ఇలా ప్రేమతో వంచించే యువకులను పరీక్షించి మరీ వారి ప్రేమను సఫలం చేయడానికి కంకణం కట్టుకుంటాడు. ఇందులో భాగంగా ప్రతి ప్రేమజంటను పరీక్షిస్తూనే ఉంటాడు. ఒక్కసారి అమ్మాయి మన వల్లో పడిందంటే, దాని బ్రతుకంతా మన చేతిలో ఉన్నట్లేరా అని అబ్బాయిలు అనుకుంటారు. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పామంటే వాడు మన చుట్టూ తిరుగుతూ జీవితమంతా మన సేవ చేస్తూ ఉంటాడని అమ్మాయిలు అనుకుంటారు. ఇద్దరూ అనుకునేది బాగానే వుంది. కానీ, ఎవరి అవసరం ఎంతవరకో అంతవరకే ఎదుటివాళ్ళు ప్రేమించినట్లు నటిస్తారు అనే తెలిసిన కథనే మరోసారి కిడ్నాప్ కథనంతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎంఎస్ నారాయణ, వైవా హర్ష కామెడీ తేలిపోయింది. నటుల్లో సాయిరామ్ శంకర్ మొదటిసగంకన్నా రెండో సగంలోనే మెచ్యూరిటీతో నటించాడు. రేష్మిమీనన్ సినిమా మొత్తానికి అందమైన బొమ్మలా కనిప్తి ప్లస్ పాయింట్‌గా మారింది. శరత్‌కుమార్ కథనం అతికినట్లు లేకపోవడంతో కృతకంగావున్నా అతని నటనతో ఇబ్బంది తలెత్తలేదు. నిర్మాత నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతంతో సెకెండ్ ఆఫ్ అకట్టుకుంటుంది. ‘బంగరు రంగుల చిలక’ పాట వినడానికి ఓకె. ‘అదిరే అందాలు..’ గాయకుడి గ్రాత్రం ఇబ్బంది పెట్టింది. దర్శకత్వపరంగా మొదటి సగాన్ని సోసోగా లాగించినా అతని దృష్టి అంతా వున్న సెకెండాఫ్‌తోనే ఓకె అన్పించాడు. కిడ్నాప్ కథనంతో ప్రేమికులకు ఓ హెచ్చరికలా కథను రాసుకున్న తీరు ఫర్వాలేదనిపిస్తుంది.

-శేఖర్