రివ్యూ

పరమ రొటీన్ చంటిగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *రోగ్
*
తారాగణం: ఇషాన్, మన్నారాచోప్రా, అనూప్‌సింగ్, పోసాని, ఆజాద్, అలీ, సత్యదేవ్, సుబ్బరాజు, రాహుల్‌సింగ్ సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
నిర్మాతలు: సిఆర్ మనోహర్, సిఆర్ గోపి
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
*
సినిమాలు స్పీడ్‌గా తీయగల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఎన్నో కమర్షియల్ హిట్లు అందించిన పనిమంతుడు కూడా. కానీ, ఇటీవలి కాలంలో సరైన కమర్షియల్ హిట్టులేక అల్లాడుతున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో, కొత్త హీరోతో కొత్త సినిమా చేసి సక్సెస్ అందుకునేందుకు చేసిన ప్రయత్నమే రోగ్. నెగిటివ్ టైటిల్స్ పెట్టి (పోకిరి, లోఫర్, ఇడియట్) పాజిటివ్ విజయాలు అందుకున్న అనుభవంతో ఈసారీ అలాంటి ప్రయత్నమే చేశాడు. మునపటికంటే కాస్త గ్లామర్ డోస్‌ను పెంచి మన్నారచోప్రా, ఏంజిలాను హీరోయిన్లుగా చూపించిన పూరీ కథలో ఇషాన్‌ను రోగ్‌లా ఎలా చూపించాడో చూద్దాం.
రెండేళ్ళు జైలుశిక్ష పడిన ఖైదీ (చంటి). ఏం నేరంచేసి జైలుకొచ్చావు అని తోటి ఖైదీలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా తన స్టోరీ చెప్పడం మొదలెడతాడు. చంటి, పోలీస్ కమిషనర్ చెల్లెలు అంజలి (ఏంజెలా) ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. తనకు ఇష్టంలేకున్నా ఇంట్లోవాళ్లు వేరే సంబంధం చేస్తున్నారని అంజలి చంటికి చెప్తుంది. అంజలికి ఎంగేజ్‌మెంట్ జరుగుతుండగా చంటి అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని చితకబాదుతాడు. ఆ నేరం కింద రెండేళ్ళు జైలుశిక్ష వేస్తారు. తర్వాత జైలుకి వచ్చిన అంజలి ఓ బాంబు పేలుస్తుంది. తన ఇష్టప్రకారమే పెళ్ళి జరుగుతోందని, లైట్ తీసుకోమని చెప్తుంది. అప్పటినుంచి ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకుంటాడు చంటి. జైలునుంచి విడుదలై వచ్చాక తండ్రి ఇంటికి రానివ్వడు. చంటి కొట్టిన దెబ్బలవల్ల ఓ కానిస్టేబుల్ కాళ్ళు పోగొట్టుకున్నాడని, అతని కుటుంబం రోడ్డున పడిందని చెప్తాడు. ఇకపై ఆ కుటుంబాన్ని తనే పోషించాలని నిర్ణయం తీసుకున్న చంటికి, ఆ కానిస్టేబుల్ చెల్లెలు పరిచయమవుతుంది. ఆమె పేరు అంజలి (మన్నారా చోప్రా). అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగావుంటాడు. ఈ క్రమంలో చంటికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ అంజలిని చంటి ప్రేమించాడా? వీరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు వచ్చాయన్నది మిగతా సినిమా.
ముందుగా చెప్పుకోవాల్సింది హీరో ఇషాన్ గురించి. హీరోకు కావలసిన అన్ని ఫీచర్లు కలిగిన ఇషాన్, స్క్రీన్‌మీద కూడా బాగా కనిపించాడు. అతని లుక్, పెర్ఫార్మెన్స్‌తో హీరోయిట్ మెటీరియల్ అనిపించుకున్నాడు. కాకపోతే ఇషాన్‌ను మాస్ హీరోగా పరిచయం చేసేందుకు పూరి పడిన కష్టమే ఫలించినట్టు లేదు. హీరోయిన్లలో కాసేపే కనబడే ఏంజెలా, ఆ కాసేపట్లోనే అందాలన్నీ ఆరబోసింది. ఇక మన్నారాచోప్రా చేసిన క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. పెర్‌ఫార్మెన్స్‌పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా, గ్లామర్ విషయంలో ఆడియన్స్‌కి న్యాయం చేసింది. సైకో క్యారెక్టర్లు ఇంతకుముందు చాలా చూసేసినా, ఇందులో అనూప్ సింగ్ చేసిన సైకో పాత్ర కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన అనూప్‌సింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఫస్ట్ఫా మొత్తం మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ మీద వేసే సెటైర్లు, జోకులతో సాగిపోతుంది. అలీతో చేయించిన కామెడీ వర్కవుట్ కాలేదు.
కథగా చూస్తే రోగ్‌లో కొత్తదనం ఇసుమంతైనా కనిపించదు. కథనంలోనూ పాత ఫార్మాట్ వెంటాడుతుంది. రోగ్ టైటిల్‌కి జస్ట్ఫికేషన్ కూడా ఉండదు. అందరూ నన్ను రోగ్ అంటారని హీరో చెప్పుకోడవమే తప్ప, ప్రవర్తనలో అలాంటి పోకడలు కనిపించవు. ప్రేమకథ కంటే తనవల్ల నష్టపోయిన ఓ కుటుంబాన్ని ఆదుకునే మానవతామూర్తి కథే ఎక్కువైంది. కథ, కథనాల విషయం పక్కనపెట్టి కేవలం విజువల్‌గా గ్రాండ్‌గావుంటే సరిపోతుందని భావించాడు పూరీ. ఫోకస్ అంతా హీరోయిన్ల గ్లామర్‌పైనే పెట్టాడు. ముఖేష్ ఫొటోగ్రఫీ వండర్‌ఫుల్. ప్రతి షాట్‌ని, సీన్‌ని అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పాటల్ని చిత్రీకరించిన విధానం బావుంది. సునీల్ కశ్యప్ బాణీల్లో రెండే ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రం. డైలాగ్ సెటైర్లలో పూరీ మార్క్ మచ్చుకు కూడా కనిపించదు. సినిమాను గ్రాండియర్‌గా డిజైన్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కొత్తదనం లేని కథ కథనాలు, అర్థంలేని సన్నివేశాలు, బోరింగ్‌గా సాగే సెకండాఫ్, సాదాసీదా క్లైమాక్స్ సినిమాకి మైనస్ పాయింట్లు. సెకెండాఫ్‌లో అతి సన్నివేశాలు సినిమా గ్రాఫ్‌ను దించేశాయి. కేవలం ఇషాన్‌ను మాస్ హీరోగా పరిచయం చేయడం అనే అంశానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోగ్ రోటీన్ కూడా కాదు.
*

-త్రివేది