రివ్యూ

మళ్లీ.. మిస్టేక్!............* మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బాపటేల్, నాజర్, చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, పృధ్వీ తదితరులు
సినిమాటోగ్రఫి: కె.వి.గుహన్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల

రెండు భారీ పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల కొంత గ్యాప్ తరువాత చేసిన చిత్రం మిస్టర్. కెరీర్ మొదటినుండి భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా హీరో వరుణ్‌తేజ్ మొదటిసారి చేసిన పక్కా కమర్షియల్ సినిమా కూడా ఇదే. లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ హీరోయిన్లు. స్టార్ హీరోలతో సూపర్‌హిట్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల ఒక్కోసారి ట్రాక్ తప్పేస్తాడన్న విషయాన్ని ఈమధ్య రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. తాను ఎంచుకున్న కథలో కనీస అంశాలు పట్టించుకోకుండా ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా నచ్చినదేదో ఇష్టమొచ్చినట్లుగా సినిమా తీస్తే ఎలాగుంటుందో తాజా సినిమాతోనూ ఇంకోసారి నిరూపించుకున్నాడు. అంటే, మిస్టర్‌లో మిస్టేక్ రిపీట్ చేశాడన్నమాట. ఎందుకలా జరిగింది? మిస్టర్ ఎవరు? ఏమా కథ? ప్రశ్నలు ఆసక్తిగావున్నా సమాధానాలు మాత్రం సినిమాలో రొటీన్.
జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేని కుర్రాడు చై (వరుణ్‌తేజ్). చై అసలు పేరు పిచ్చయ్య నాయుడు. ఒకరికి హెల్ప్ చెయ్యడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఫ్రాన్స్‌లో వుండే చై అనుకోకుండా పరిచయమైన మీరా (హెబ్బాపటేల్)ని ఫస్ట్‌లుక్‌లోనే ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేసేలోపే ఆల్రెడీ తనకు లవర్ ఉన్నాడని, అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇండియాకు వెళ్తుంది మీరా. తరువాత కొన్ని రోజులకు తన పెళ్లి విషయంలో సమస్య ఉందంటూ, ఈ విషయంలో హెల్ప్ కావాలని చైని కోరుతుంది మీరా. దాంతో తన ప్రేమను త్యాగం చేసి మీరా ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడతాతడు చై. సమస్య పరిష్కారం కాకుండానే మరో సమస్య మరో హీరోయిన్ చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) రూపంలో వచ్చిపడుతుంది. పెద్ద జమీందారీ వంశంలో పుట్టిన చంద్రముఖి ఇంటినుండి తప్పించుకొని పారిపోతూ, అనుకోకుండా హీరో దగ్గరకు చేరుతుంది. ఈ పరిస్థితుల్లో తన తాత దగ్గరికి చేరుకున్న చై.. అక్కడ ఆయనా ఓ సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుంటాడు. తనను వెంటాడుతున్న రెండు సమస్యలను ఎలా పరిష్కరించాడు, తన తాత సమస్యను ఎందుకు నెత్తిన వేసుకున్నాడు, అసలు ఆ సమస్య ఏమిటి? ఇలా రకరకాల మలుపులతో సాగిన సినిమా చివరికి ఏ మలుపుదాటి ఆగిందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ముకుంద, కంచె సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌తేజ్ లోఫర్‌తో ఆ ఇమేజ్‌కి బ్రేక్ వేశాడు. భిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ చేసిన ఫక్తు కమర్షియల్ సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో చైగా వరుణ్‌తేజ్ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు. నటన, డాన్సులు, ఫైట్స్ పరంగా వరుణ్‌లో ఎలాంటి మార్పు కనిపించదు. ఇక హీరోయిన్లు హెబ్బాపటేల్, లావణ్య త్రిపాఠీల నటన, గ్లామర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ల గ్లామర్ విషయంలో సరిగ్గా ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరినీ దారుణంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. రఘుబాబు, శ్రీనివాసరెడ్డిలతో చేసిన కామెడీ ట్రాక్ కాసేపు నవ్వించింది. పృధ్వీ, శేషులతో చేయించిన కామెడీ ఎపిసోడ్స్ చిరాకు పుట్టిస్తాయ. మిగిలిన పాత్రల్లో కనిపించిన నాగినీడు, మురళీశర్మ, షఫీ, భరత్‌ల ప్రాధాన్యత, పెర్ఫార్మెన్స్ మరీ విసుగు పుట్టించాయి. కామెడీకి ఎక్కవ, కథకు తక్కవ అన్నట్టు సాగిపోతాయ ఆ పాత్రలు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నాజర్, ఈశ్వరీరావు, ఆనంద్, తనికెళ్ల భరణి ఫెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
టెక్నికల్‌గా కెవిగుహన్ సినిమాటోగ్రఫీతో కాస్త రిలాక్స్ అవుతాం. పాటల్లో కన్పించే స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లకు విజువల్ ఫీస్ట్ చేయడంలో గుహన్ సక్సెస్ అయ్యాడు. తర్వాత ఇండియాలో తీసిన పార్ట్ మొత్తం నార్మల్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జె మేయర్ అందించిన పాటల్లో ఒక్కటీ ఆకట్టుకోదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ సన్నివేశానికీ బలాన్ని అందించలేకపోయంది. కథలో బలమైన అంశాలు లేకపోవడంతో, ఎడిటర్ ఎం.ఆర్.వర్మ చిత్రాన్ని సాదా సీదాగా లాగేసినట్టే అనిపిస్తుంది గోపీమోహన్ రాసుకున్న కథలోనూ గతంలో వచ్చేసిన కథల తాలూకు ఛాయలు తప్ప కొత్తదనం కనిపించదు. ఇక శ్రీ్ధర్ సీపాన రాసిన సంభాషణల్లో కొన్ని కామెడీ పంచ్‌లు తప్ప మరేమీ ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడిగా శ్రీను వైట్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫక్తు మాస్ కథలతో ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్వించానికి తనకంటూ ఒక ఫార్ములా సృష్టించుకున్న శీను వైట్ల, మిస్టర్‌లో మాత్రం ఆరంభం నుంచి చివరి వరకు సిల్లీ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. కథ, కథనాలు ఎలా వున్నా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో, టెక్నీషియన్స్ నుంచి తగిన ఔట్‌పుట్ తీసుకోవడంలో శీను వైట్ల మార్క్ ఎక్కడా కనిపించదు. ఆగడు, బ్రూస్‌లీ పరాజయాల తరువాత తెరకెక్కించిన మిస్టర్ చిత్రం హ్యాట్రిక్ వైఫల్యంగా మాత్రం దర్శకుడికి రికార్డు మిగిల్చింది.
పిచ్చయ్యనాయుడు (నాజర్), ఆయన ప్రత్యర్థులు గుండప్ప (తనికెళ్ల భరణి), రాహుల్ వడియర్ (నికితిన్ ధీర్) పగల నేపథ్యంలో కథ మొదలై.. వెంటనే స్పెయన్‌లోవున్న చై వద్దకు వెళ్లిపోవడం, తరువాత మీరా కథ, ఆ తరువాత చంద్రముఖి కథ.. ఇలా ఉప కథల బొంతలా నడిపించిన విధానం ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయంది. కథ, కథనాల్లో చెప్పుకోవడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏమీ లేకపోవడం, ఇద్దరు హీరోయన్లు ఉన్నా హీరోతో బలమైన, భావోద్వేగంతో కూడిన ప్రేమను సృష్టించలేకపోవడం బోర్ ఫీలవుతాం. శ్రీనువైట్ల సినిమా అని థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు మరోసారి విసుగుచెందేలా సినిమాని నడిపించారు. అనవసరమైన పాత్రలు ఎలాంటి రీజన్ లేకుండా కథనంలోకి ప్రవేశిస్తుండటంతో కథ లాజిక్ లేకుండా తయారైంది. సినిమాలో ప్రతి ప్రధాన పాత్రకి ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉండటం, కర్ణాటకలో బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీ, అందులో చూపించిన జమీందారీ ఘట్టాలు ప్రేక్షకులను మరీ ఇరిటేట్ చేశాయి. ఈ మిస్టర్‌తో మరోసారి శీను వైట్ల మిస్టేక్ రిపీట్ చేశాడంతే.

-త్రివేది