రివ్యూ

ఫలితం లేని ప్రయోగం ... ( * బ్లాక్ మనీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
మోహన్‌లాల్, అమలాపాల్, బిజూమీనన్ తదితరులు
సంగీతం: రతీష్ వేఘ
నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్
దర్శకత్వం: జోషి

మలయాళంలో సూపర్‌స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటుడు మోహన్‌లాల్ ఈమధ్య భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మన్యంపులి, కనుపాప వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆయన, తాజాగా నటించిన చిత్రం బ్లాక్‌మనీ. మోహన్‌లాల్ సినిమాలు తెలుగులోకి అనువాదమై మంచి విజయాలు అందుకుంటుండటంతో, బ్లాక్‌మనీ చిత్రాన్నీ అదే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎవరి దగ్గర బ్లాక్‌మనీ ఉంది.. అసలు కథేమిటి? అన్న విషయాన్ని తేటతెల్లం చేయటమే అసలు పాయంట్.
జర్నలిస్ట్ వేణు (మోహన్‌లాల్)కు పాలిటిక్స్ అన్నా, పొలిటికల్ లీడర్స్ అన్నా భయం. అలాంటి అతన్ని మరొక జర్నలిస్ట్ రేణు (అమలాపాల్)తో కలిసి ఒక లంచం తాలూకు కేసులో ఆధారాలు సేకరించమంటారు చానల్ సీఈవో. దాంతో వేణు రేణుతో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆధారాలు సేకరిస్తాడు. అంతా బాగానే జరుగుతోంది అనుకునే సమయానికి రేణు ఉన్నట్టుండి సేకరించిన ఆధారాలను వేరొక చానెల్‌కు ఇచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వేణు షాక్ అవుతాడు. అదే సమయంలో కథలోకి ఒక మినిస్టర్ ఎంటరై వేణు, రేణులను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు వేణు, రేణులకు ఆ పొలిటీషియన్‌కు సంబంధం ఏమిటి? అలా చిక్కుల్లోపడ్డ వేణు వాటినుండి ఎలా తప్పించుకున్నాడు? కేసులోని అసలు నేరస్థులన్ని పట్టుకున్నాడా? అనేది మిగతా కథ.
సినిమాకి ప్రధాన అస్సెట్ మోహన్‌లాల్. జర్నలిస్ట్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. సెకెండాఫ్ మొత్తాన్ని తన నటనతోనే ఆకట్టుకున్నాడు. అమలాపాల్ కూడా పాత్ర మేరకు బాగానే నటించింది. తన పాత్రలోని నెగెటివ్ షేడ్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. కానీ ఆన్‌స్క్రీన్‌మీద మోహన్‌లాల్‌తో ఆమె జోడీ మాత్రం అస్సలు బాగాలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ఫస్ట్ఫా చివరి 30 నిమిషాల సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. అసలు మీడియా సర్కిల్ ఎలా పనిచేస్తుంది. ఒక చానెల్ టాప్ ప్లేస్‌లో నిలవడానికి ఇతర చానల్స్‌తో ఎలా పోటీపడుతుంది అనే వాటిని స్పష్టంగా, ఆసక్తికరమైన కథనంలో చూపించారు. ఇక చివరగా సెకెండాఫ్‌లో మోహన్‌లాల్, అమలాపాల్ మధ్య వచ్చే సంఘర్షణపూరిత సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయ. సెకెండాఫ్ ఆరంభం 15 నిముషాలు గడిచాక సినిమాలో గ్రిప్ తప్పడంతో ఒకింత బోరింగ్ అనిపించింది. మోహన్‌లాల్, అమలాపాల్ ఇద్దరూ పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు అసలు కథను పక్కదారి పట్టించాయి. దీంతో అప్పటివరకు ఒక మూడ్‌లో వున్న సినిమా ఉన్నట్టుండి ఇంకొక మూడ్‌లోకి వెళ్లిపోయింది.
టెక్నికల్‌గా... సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైనస్. సన్నివేశాన్ని ఎలివేట్ చేయగల బిజీ లేకపోవడంతో, అసలు కథనే ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోలేకపోయాడు. సినిమాలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కారణం లేకుండానే వస్తూ కాస్త తికమక పెట్టాయి. కథనం మొత్తం సీరియస్‌గా నడిచేది కావడంతో కామెడీని కోరుకునేవారికి నిరుత్సాహం తప్పదు. సినిమాలో చాలా భాగం మలయాళం నేటివిటీ కనిపించడంవలన తెలుగు ఆడియన్స్ డిస్సప్పాయింట్ అయ్యే ఛాన్సుంది. పాత్రల తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. సహజత్వానికి దగ్గరగా కెమెరా వర్క్ సాగింది. దర్శకుడు జోషి పనితనం జస్ట్ ఓకె. అతను ఎంచుకున్న కథ, కొన్నిచోట్ల కథనం బాగానే ఉన్నా సెకెండాఫ్‌లో మాత్రం అనవసరంగా దాన్ని సాగదీసి సినిమాను పక్కదారి పట్టించారు. ‘బ్లాక్‌మనీ’ చిత్రం మంచి కథే. టీవీ చానళ్ల మధ్య జరిగే పోటీ, సరదాగా సాగిపోయే ఫస్ట్ఫా సినిమాకు ప్లస్ పాయింట్స్. కానీ సెకెండాఫ్‌ను సాగదీయడం వలన సినిమా పక్కదారి పట్టి ఆసక్తిని కాస్త సన్నగిల్లేలా చేసింది. సాధారణ ప్రేక్షకుడికి అర్థంకాని రీతిలో చానళ్ల మధ్య సాగే పోటీ, స్టింగ్ ఆపరేషన్స్ అనే విషయాలు అర్థంకాక చిరాకు తెప్పిస్తాయి. కమర్షియల్ పాయింట్ లేని సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేకపోవడం అన్నింటికీ మించిన పెద్ద మైనస్.

-త్రివేది