రివ్యూ

మిస్టరీ.. మిస్‌ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *వెంకటాపురం
*
తారాగణం: రాహుల్, మహిమ మక్వానా, అజయ్, అజయ్‌ఘోష్, కాశీవిశ్వనాధ్ తదితరులు
సినిమాటోగ్రఫి: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
సంగీతం: అచ్చు
ఎడిటింగ్: మధు
సమర్పణ: బేబీ ఆద్యశ్రీ
నిర్మాతలు: తూము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్
రచన, దర్శకత్వం: వేణు మడికంటి
*
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో టైసన్‌గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు రాహుల్. తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. కొంత గ్యాప్ తరువాత కొత్త ప్రయత్నంతో చేసిన చిత్రం ‘వెంకటాపురం’. కొత్త దర్శకుడు వేణు మడికంటి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒక సహజ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథ. మర్డర్ మిస్టరీ అంటే ఎవరికైనా ఆసక్తి కలిగించే అంశమే. ఒక మర్డర్‌కు ముందు జరిగే సంఘటనలు, తర్వాత ఆ మిస్టరీని ఛేదించే దిశలో జరిగే ఇనె్వస్టిగేషన్ అంశాలతో తెరకెక్కిన చిత్రం వెంకటాపురం. మర్డర్ మిస్టరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అసలు వెంకటాపురంలో ఏం జరిగిందో చూద్దాం.
వైజాగ్‌లోని భీమలి బీచ్‌లో చోటుచేసుకున్న అమ్మాయి మర్డర్ కేసును అక్కడికి దగ్గర్లోవున్న వెంకటాపురం పోలీసులు టేకప్ చేసి విచారిస్తుంటారు. వాళ్ల విచారణలో అమ్మాయిని మర్డర్ చేసింది ఆనంద్ (రాహుల్) అని, ఆ అమ్మాయి పేరు చైత్ర (మహిమా మక్వానా) అని, ఆమె ఆనంద్ ప్రేమికురాలేనని పోలీసులు తేలుస్తారు. అసలు తాను ప్రేమించిన అమ్మాయిని ఆనంద్ ఎందుకు చంపాడు? ఇంతకి ఆనంద్ ఎవరు? ఇలా హంతకుడి ఆచూకీ కోసం వైజాగ్ మొత్తం జల్లెడపడతారు పోలీసులు. అంతకుముందే అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్టయిన ఆనంద్, వెంకటాపురం పోలీసు స్టేషన్‌లోనే ఉంటాడు. తాము వెతుకుతున్న ఆనంద్ ఇతనేనని పోలీసులకు తెలియదు. మరి చైత్రను హత్య చేసింది ఎవరు? ఆనంద్ ఎవరిమీద మర్డర్ అటెంప్ట్ చేశాడు? ఆనంద్‌కి, చైత్రకు సంబంధమేమిటి? భీమిలీ బీచ్‌కి కొడవలితో వచ్చింది ఎవరు? వంటి ఆసక్తికరమైన విషయాలతో సినిమా సాగుతుంది.
హ్యాపీడేస్ తర్వాత కొన్ని సినిమాలు చేసిన రాహుల్‌కి ఇది కొత్త పాత్రే. డైరెక్టర్ వేణు మడికంటి ఈ పాత్ర కోసం రాహుల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ, అతను పూర్తి న్యాయం చేయలేకపోయాడు. బాడీ లాంగ్వేజ్, హావభావాలు పాత్రకి తగినట్టు లేవు. ముఖ్యంగా హీరో పాత్ర ఇలా ఉంటుందన్న ఐడెంటిటీ కూడా కనిపించదు. సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అతని పెర్‌ఫార్మెన్స్ ఫరవాలేదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మహిమ మక్వానా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో ఎస్‌ఐగా అజయ్‌ఘోష్, ఇనె్వస్టిగేటివ్ ఆఫీసరుగా అజయ్ తన క్యారెక్టర్లకు న్యాయం చేశారు. చిత్రంలోని మిగతా ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతికంగానూ సినిమా నుంచి ఏమీ ఆశించలేం. మర్టర్ నేపథ్యంలో సాగే కథను మరింత ఎలివేట్ చేసేలా సాయిప్రకాష్ ఫొటోగ్రఫీ లేకపోయింది. మిస్టీరియస్‌తో సాగే కథకు ఫొటోగ్రఫీయే సగం ప్రాణం. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటే తప్ప కథ, కథనాలు ఆకట్టుకోవు. ఈ చిత్రంలో ఆ ఫీల్ ఆడియన్స్‌కు అందలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు చేసిన పాటల్లో రెండు బాగున్నాయి. సినిమా మొదలు నుంచి చివరి వరకూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానేవున్నా, కొన్ని సన్నివేశాల్లో శ్రుతిమించిన శబ్దం చికాకు పుట్టించింది. ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. మర్డర్ మిస్టరీ అనేది పాతదే అయినా సెకెండాఫ్‌లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చూపించగలిగాడు దర్శకుడు. నిర్మాణాత్మక విలువలు కథాస్థాయికి తగినట్టు లేదు. దర్శకుడు వేణుది మంచి ప్రయత్నమే అయినా, ఫస్ట్‌హాఫ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్ ఒకింత బోరింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ పదే పదే సిగరెట్ కాల్చుకోవడానికి కాలేజీ టెర్రస్‌పైకి వెళ్లడం, తర్వాత నిర్మానుష్యంగా ఉన్న బీచ్‌కివెళ్లి రౌడీల బారిన పడటంలాంటి సన్నివేశాలు అసహజంగా అనిపించాయి. పాయింట్ చిన్నది కావడంతో, ఫస్ట్ఫా అంతా టైమ్ లాగింగ్‌తో నడిపించేశారు. సెకెండాఫ్ మొదలైన కొంతసేపటి తర్వాతగానీ కథలో వేగం కనిపించదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కువ శాతం కథ వెంకటాపురం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది. సినిమాకు తమిళ వాసన తగిలింది. క్లైమాక్స్‌లో హీరో చేతికి గన్ ఇచ్చి బ్యాలెన్స్‌వున్న ఒక్కడిని లేపెయ్యమని ఇనె్వస్టిగేటివ్ ఆఫీసర్ హీరోకి స్వేచ్ఛనివ్వడం సహజంగా అనిపించదు. మర్డర్ మిస్టరీని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఎన్నో వీక్ పాయింట్లు. సాంకేతిక బలహీనత వల్ల ఆడియెన్స్‌కు ఏ సన్నివేశంలోనూ థ్రిల్ కలిగించలేకపోయారు.
చాలాకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాహుల్, తాజాగా చేసిన వెంకటాపురం సైతం అతని కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. భిన్నమైన కథ, అందులోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్, సెకండాఫ్ కథనం, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి విషయాలపై ఫోకస్ పెట్టడంలో దర్శకుడి అనుభవం ఏమాత్రం సరిపోలేదు. కీలకమైన వాస్తవాన్ని బలవంతంగా దాచిపెట్టడం, చెప్పినదాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం లాంటివి పూర్తిగా విసిగిస్తాయి.

-త్రివేది