రివ్యూ

ఆకట్టుకోని సావిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*బాగోలేదు
సావిత్రి

తారాగణం:
నారా రోహిత్, నందిత రాజ్,
మురళిశర్మ, అజయ్, ధన్య, బాలకృష్ణ
సంగీతం: శ్రవణ్
సినిమాటోగ్రఫీ: ఎ వసంత్
ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
నిర్మాత: బి.రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: పవన్ సాధినేని
--

నిజానికి ప్రాజెక్టుల వేగం పెంచాడు -నారా రోహిత్. తన కెరీర్‌లో ఒక్క సోలో తప్ప పెద్దగా కమర్షియల్ సక్సెస్ లేని ఈ హీరో కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈసారి సావిత్రితో మంచి విజయం అందుకోవాలనే ప్రయత్నం చేసాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన సావిత్రి ఎలా ఉందో చూద్దాం.
కథ: మెడిసిన్ చదివిన రిషి (నారా రోహిత్) హ్యాపీలైఫ్ గడుపుతుంటాడు. ఫ్యామిలీపరంగా బాగా ఉన్న కుటుంబమే. తను ఎక్కడుంటే అక్కడ అల్లరి చిల్లరి సంతోషాన్ని వెతుక్కునే నైజం రిషిది. సినిమా ఓ పెళ్లితో మొదలవుతుంది. అదే టైంలో సావిత్రి జన్మిస్తుంది. మొదట పుట్టిన అమ్మాయకి తన భార్య పుట్టింటి తరపు పేరు పెట్టారని, ఈసారి బిడ్డకు తన తల్లిపేరు పెట్టాలనుకుంటాడు దొరబాబు (మురళిశర్మ). అందుకే సావిత్రి అని నామకరణం చేస్తాడు. ఇక అదే సమయంలో దొరబాబు చెల్లిని చేసుకోవాలని భీష్మారావు (రవిబాబు) ప్రయత్నిస్తాడు. కాని కృష్ణ (అజయ్) తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత కథ 20 ఏళ్ల తరువాత మొదలవుతుంది. సావిత్రి (నందిత) చలాకీగల పిల్ల. పెళ్లిలో పుట్టిన ఆమెకు పెళ్లిమీద మోజు. తనను పెళ్లికూతురిగా ఎప్పుడు చేస్తారా? అని చూస్తుంటుంది. ఇక తన అక్క గాయత్రి (్ధన్య బాలకృష్ణ) నిశ్చితార్థాన్ని కాదనుకుని వెళ్లిపోవడంతో, బాబాయ్ కృష్ణకు ఫోన్‌చేసి ఆమెను ఇంటికి రప్పించి పరువు కాపాడేలా చేస్తుంది. అయితే రిషి అసలు సావిత్రి జీవితంలోకి ఎలా వచ్చాడు..? పెళ్లి పెళ్లి అని కలవరించే సావిత్రికి పెళ్లి జరిగిందా..? లేదా..? రిషికి దొరబాబు ఫ్యామిలీకి ఉన్న సంబంధమేంటి..? తమ్ముడు కృష్ణ గురించి దొరబాబు తెలుసుకున్న నిజమేంటి..? అన్నది అసలు కథ..
ప్రేక్షకులకు కావల్సింది కొత్తదనం. నువ్వు పాత కథ చెప్పినా ఫర్వాలేదు. కానీ, దాన్ని కొత్తగా చెప్తే చూస్తాం అని ఘంటాపథంగా చెప్తున్న ఆడియన్స్ మాటల్ని మన దర్శక నిర్మాతలు, హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యడంలో, నిర్మించడంలో ఫెయిలవుతున్నారు. పవన్ సాదినేని రాసుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కథగా చెప్పుకోవడానికి బలమైన పాయింట్ లేదు. పెళ్ళంటే విపరీతమైన పిచ్చి వున్న అమ్మాయి సావిత్రి. అంతవరకు బాగానే అనిపిస్తుంది. ఆమె పెళ్ళి ఓ డాక్టర్‌తో ఫిక్స్ అయిందనుకున్న టైమ్‌లో హీరో ఆమెను కలవడం, ప్రేమించమని వెంటపడడం వంటి సన్నివేశాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కామెడీ పేరుతో అనవసరమైన సీన్లు ఇరికించటంతో అంతా కలగా పులగమైంది. ట్రైన్‌లో కామెడీ సీన్స్, హీరోయిన్ ఇంట్లో హీరో, విలన్ గ్యాంగ్ చేసే కామెడీ చిరాకు తెప్పిస్తాయి. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే నారా రోహిత్ లుక్‌గానీ, బాడీ లాంగ్వేజిగానీ ఆకట్టుకునేలా లేదు. అతని పర్సనాలిటీకి, హీరోయిన్ వెంటపడుతూ ప్రేమకోసం తపించే క్యారెక్టర్‌కి ఎక్కడా సెట్ అవ్వలేదు. సావిత్రిగా నందిత తన లిమిట్స్‌లో బాగానే పెర్‌ఫార్మ్ చేసింది. సినిమా మొత్తం తన మీదే నడుస్తుంది కాబట్టి సినిమాకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడంలో బెటర్‌మెంట్ మాత్రం చూపించలేకపోయంది. ఇక పెళ్లంటే మోజుతో ఎలాంటి వాడినైనా చేసుకుంటానని చెప్పే తన క్యూట్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఇక దొరబాబు పాత్రలో మురళీశర్మ పాత్ర మామూలుగానే ఉంది. దొరబాబు తమ్ముడు కృష్ణగా అజయ్ మరోసారి తన యాక్టింగ్ పవర్ చూపించాడు. సినిమాలో చాలా తక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా సినిమాను నడిపించేది కృష్ణ పాత్రే. చివరగా వచ్చే మురళీశర్మ, అజయ్‌ల సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కమెడియన్స్‌గా నటించిన ప్రభాస్ శ్రీను, సావిత్రి ఇంట్లో పనిచేసే కమెడియన్ మంచి కామెడీ పండించారు. సావిత్రిని పెళ్లిచేసుకోబోయే ఎన్నారైగా వెనె్నల కిషోర్ కాసేపు నవ్వులు పండించారు. పెళ్లంటే బాగా ఇష్టపడే ఓ పాత్రను తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకొని ఫీల్‌గుడ్ మూవీగా చేయాలన్న దర్శకుడి ప్రయత్నం ఫలించలేదు. రిచ్‌గా తీసే ప్రయత్నంలో సినిమా అసలు విషయానే్న వదిలేశాడు. పెళ్లంటే ఇష్టం అన్న పాయింట్‌తో మొదలుపెట్టి పెళ్లిచేసుకోటానికి 20 ఏళ్లుగా ఓ విలన్‌ను రెడీగా చేసుకొని, ఆమెకు ఓ ప్రయాణంలో అనుకోకుండా హీరోను పరిచయం చేసి ఇలా రకరకాలుగా ప్రేక్షకుణ్ణి అయోమయానికి గురిచేసి, కథలో పట్టులేకుండా చేశాడు. రాసుకున్న లైన్‌కు బలమైన డైలాగుల రాసుకున్నారే తప్ప, ఆ సన్నివేశాన్ని బలంగా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారు. బ్యాగ్రౌండ్ స్కోర్ సోసో. వసంత్ కెమెరా ఫరవాలేదు. లొకేషన్స్ ఎక్కువ లేకపోవడంతో కలర్‌ఫుల్ అనిపించదు. ఎడిటింగ్‌లో మరిన్ని కత్తెర్లు వేయచ్చు. మరీ ఫ్లాట్‌గా అనిపించే స్క్రీన్‌ప్లే ఎబ్బెట్టుగా వుంది. నాసిరకం కామెడీని జొప్పించడంతో సినిమాలో పస తగ్గింది. క్లాస్‌కి మాస్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏమాత్రం రుచించని కథ -సావిత్రి.

-త్రివేది