రివ్యూ

కాలక్షేపమూ కష్టమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * రాధ
*
తారాగణం: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవికిషన్, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఆశీష్ విద్యార్థి, సప్తగిరి, షకలక శంకర్, కాశీవిశ్వనాధ్, కోట, ప్రగతి,
సుబ్బరాజు, బ్రహ్మాజీ.
సంగీతం:రధన్
నిర్మాత:్భగవల్లి బాపినీడు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: చంద్రమోహన్.
*
ఈమధ్య కాస్తంత కొత్తదనంతో, నవ్య ఆలోచనలతో చిత్రాలు అందిస్తున్నారని కొత్త దర్శకుల పనితనాన్ని గురించి సంతోషపడుతున్న సమయంలో తిరిగి ‘మూస’ ధోరణి చిత్రాల మసాలా మొత్తం దట్టించి మన ముందు నిలిపిన చిత్రం ‘రాధ’. చిత్రం కథాకేంద్రం ‘పోలీసుల గౌరవాన్ని పెంచేది’ అన్న ప్రచారం జరిగినా వాస్తవంగా సినిమాలో ఆ బాపతు కంటెంట్ తక్కువ. సగటు వాణిజ్య చిత్రాల అరిగిపోయిన అంశాలపై ఫోకస్ ఎక్కువ అయ్యి చూపరులకు నిరాశ కల్గించింది.
చిన్నతనం నుంచి భగవద్గీత ప్రేరణగా పెరిగిన రాధాకృష్ణ (శర్వానంద్) ఒక సందర్భంలో తనను కాపాడిన పోలీస్ అధికారిని చూసి, తాను కూడా అలాగే పోలీసై అందర్నీ కాపాడాలని అనుకుంటాడు. అలాగే ఎస్‌ఐ అయి వరంగల్ జిల్లా బరసానపల్లెలో తొలిసారి పనిచేస్తాడు. అక్కడ తను చేయడానికి పనేం లేకపోగా, నేరాల్ని అరికట్టే ప్రాంతానికి బదిలీ చేయమని అధికారుల్ని అడిగి హైదరాబాద్‌లోని ధూల్‌పేట స్టేషన్‌కి బదిలీ అవుతాడు. అక్కడ ఒక రాజకీయ నాయకుడు (రవికిషన్) తన పదవి కోసం చేసిన పన్నాగంలో పోలీసులు బలైపోవడం చూసి, ఆ నాయకుడి బండారం బయటపెట్టాలనే దృష్టి నిల్పి కార్యక్రమం పూర్తిచేయడంతో ‘రాధ’ మిషన్ పూర్తవుతుంది. కథని టూకీగా చెప్పడానికి పైన అలా పేర్కొన్నా, ఈ అంశం కంటే, రాధాకృష్ణ (ముద్దుగా అందరూ ‘రాధ’ అని పిలుస్తారు) బరసానిపల్లెలో చూసిన రాధ (లావణ్య త్రిపాఠి) వెంటపడడం, ఆమెకు పోటీగా వచ్చిన రుక్మిణి (అక్ష)తో కలిసి డ్యూయెట్లు పాడటం తదితర రొటీన్ సీన్స్‌పైనే సినిమా ఎక్కువభాగం నడిచింది. ఇంకా చెప్పాలంటే ప్రథమార్థం పూర్తయ్యేవరకు కథా కేంద్రంగా అన్న అంశంపై ఆనవాళ్లే అంతగా కనిపించవు. ఇక ద్వితీయార్థంలో కూడా రాజకీయ నాయకుడిపై పోలీసు అధికారి లక్ష్యంగా పనిచేసే దిశలో అనేకానేక అనవసర అంశాలు పెట్టడంవల్ల సినిమా అనాసక్తికరంగా సాగింది. అసలు దర్శకుడికి చిత్రాన్ని ఏవిధంగా రూపుదిద్దాలో.. అంటే కామెడీ ఓరియెంటెడా? రొమాంటిక్ జోనరా? రివెంజ్ డ్రామానా? అన్నదానిపై ‘క్లారిటీ’ (ఈ పదం కూడా సినిమాలో ఓ సందర్భంలో రుక్మిణి పాత్ర ద్వారా అనిపించినదే!) లేక గందరగోళం తలెత్తింది. ఓ పక్క పోలీసు గౌరవం పెంచే సినిమా అని చెప్తూనే పోలీసు శిక్షణా కేంద్రం అధిపతి (జయప్రకాష్‌రెడ్డి) పాత్రను ఓ విదూషకుడి రీతిలో చిత్రించడం దర్శకుడి పనితనానికి పరాకాష్ట. పోలీసు శిక్షణ తదితరాలు ఎంత సీరియస్‌గా నడుస్తాయో అందరికీ తెలుసు. అలాగే ఉండాలి కూడా! ఇక కథానాయకుడిని బాల్య దశలో చూపించిన ఓ సన్నివేశంలో ఎక్కడో దూరంగా ఉన్న తరగతి గది విషయాలు కూడా విన్పడతాయి అని చెప్తూ అలాంటి అసాధారణ లక్షణం కోట్లమంది పిల్లల్లో ఒక్కరికే వస్తుంది. అదే ఇది.. అన్నారు. దీనిపై కాస్తంత సశాస్ర్తియ ఆధారాలు చూపిస్తే సన్నివేశానికి నిండుదనం వచ్చేది. చెవిలో కాప్సిల్స్ పెట్టుకుంటే విన్పడిందా? విన్పడలేదా? అన్నదాని నిర్థారణపై అటు హీరో, ఇటు విలన్‌లపై సీన్స్ ఎక్కువ పెట్టడం చిత్రం నిడివి పెంచడానికే (2 గంటల 8 నిమిషాల సినిమా) అనిపించింది.
అవార్డు చిత్రం ‘శతమానంభవతి’ తర్వాత శర్వానంద్ సినిమా ఇది అన్న అంచనాలను పక్కకు పెడితే నటుడిగా తన వంతు కష్టాన్ని శక్తివంచన లేకుండా రాధ పాత్రలో ఆయన వెచ్చించారు. కాకపోతే చూపించిన కథలో ‘మెటీరియల్’ (ఈ పదమూ సినిమాలో నాయిక పాత్రధారి ద్వారా పలుమార్లు అనిపించారు) అంతగా లేకపోవడంతో రాణింపు సమకూరలేదు. నాయిక రాధ పాత్రలో లావణ్య త్రిపాఠి తను పలుమార్లు అనేక సందర్భాలలో పరితపించిన మోడ్రన్ డెస్సుల ధారణ ఈ చిత్రంతో పాటల ద్వారా కొంత తీరినా, అందరూ అన్నట్లు ఆమె శరీరాకృతికి అవి అంతగా నప్పలేదనే అనిపించింది. రుక్కుగా అక్ష గ్లామర్ ఒలకబోతకే పనికొచ్చింది. రాజకీయ నాయకుడు సుజాత పాత్రలో రవికిషన్ బానే నటించినా, ఇదే తరహా ఛాయలుగల రోల్ లోగడ ‘రేసుగుర్రం’లో ఆయనే పోషించడంవల్ల రావాల్సిన కిక్ రాలేదు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి పాత్రల పరిధి తక్కువ. ఆశీష్ విద్యార్థి పాత్ర అసంపూర్తిగా అనిపించింది. సప్తగిరి అక్కడక్కడ తన మార్కు నటనని చూపించాడు. ఆ పాత్రకన్నా షకలక శంకర్ పోషించిన పార్థు/ అర్జున్ పాత్రే బాగా అలరించింది. డిఎన్‌ఏ డాక్టర్‌నంటూ గడబిడ చేసిన అలీ పాత్రను ద్వందార్థాలు గుప్పించడానికే సృష్టించినట్లు కన్పడింది. రధన్ స్వరాల్లో అన్నీ తమన్ మోడల్ బీట్ ఓరియెంటెడ్ లక్షణాలే వినిపించాయ. దానికితోడు పాటల రచయితలు కూడా అదే స్థాయి ప్రాస పదాల కోసం ప్రయాసపడ్డారు. ‘ఓయి మేరా క్రిస్సు, నీమదే నా క్రస్సూ..’, ‘వంటిమీదకొచ్చింది ఖాకీ..’, ‘రాబిట్.. రాబిట్..’ పాటల పదాల్లో ఈ తీరు స్పష్టంగా చూడచ్చు. ‘‘నూతిలో వున్నవీ నీళ్లే, నాగార్జునసాగర్‌లో ఉన్నవీ నీళ్లే..’, ‘‘ఇక్కడ దీపావళి పండక్కే బాంబులు పేల్చరు..’ అంటూ పేలిన డైలాగులు బాగున్నాయి. అలాగే ‘నల్లమల’ అంటే పార్కా? అని అడిగితే కాదు ‘్ఫరెస్టు’ అంటూ ఇచ్చిన కౌంటర్ డైలాగ్ థియేటర్‌లో బాగా రిసీవ్ అయ్యింది. ఖర్చుకు వెరవని నిర్మాత భారీతనం పాటల్లో కన్పడింది. అయితే ఈ మాదిరి భారీతనం కథలో కొత్తదైన అనే్వషణకై వినియోగించక పోవడంతో ‘రాధ’ ఆకట్టుకోలేకపోయాడు.

-అనే్వషి