రివ్యూ

బచ్చన్‌తో బతికేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * సర్కార్-3
*
తారాగణం: అమితాబ్ బచ్చన్, జాకీష్రాఫ్, మనోజ్ బాజ్‌పేయి, అమిత్ సాద్, యామినీ గౌతమ్ తదితరులు
సంగీతం: రవిశంకర్ -రోహన్ వినాయక్
నిర్మాతలు: రాహుల్ మిత్రా, ఆనంద్ పండిట్, గోపాల్ శివరామ్ దాల్వీ
కథ: నీలేష్ గిర్కార్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
*
అతగాడి ఆలోచనల్ని అతడే అడ్డుకోలేడు. కథేమీ లేకుండా రీళ్లు చుట్టేయగలడు. కథానాయిక కాళ్లకి కెమెరాని కట్టేసి.. సన్నివేశాల్ని షూట్ చేసేయగలడు. టీపాయ్ కిందనో... డోర్ హోల్‌లోనో కెమెరా ఫిక్స్ చేసి -అదో సరికొత్త ప్రయోగమని ప్రేక్షకుల్ని విసిగించనూ గలడు. ‘శివ’ తర్వాతకీ.. ‘రంగీలా’ చిత్రం తర్వాత -వచ్చిన ‘వర్మ’ సినిమాలన్నీ -దౌడ్ కావొచ్చు.. సత్య.. కౌన్.. మస్త్ -జంగిల్ కావొచ్చు.. కంపెనీ - బూత్, నాచ్- ఇలా ఏదైనా కావొచ్చు. రక్తచరిత్ర సృష్టించవచ్చు. ఆయా సినిమా కథలన్నీ జనాల్ని వెర్రెత్తించి చికాకు పుట్టించి.. ‘వర్మ’ అంటే ద్వేషం పుట్టేట్టు చేయటం వెనుక అతగాడు ఆలోచనల సుడిగుండాలు ఉంటాయి. ప్రేక్షకులు అతగాడి ‘టార్చర్’ భరించలేక ‘వర్మ’ ఫ్యాక్టరీ వైపు దృష్టి నిలపకపోవటంతో.. ‘ప్రేక్షకుల కోసం సినిమాలు తీయటం లేదు.. నా కోసం నేను సినిమాలు తీసుకొంటున్నానం’టూ స్టేట్‌మెంట్ ఇచ్చేయటంతో కాస్తంత ఊపిరి పీల్చుకొన్న జనం అతగాడి సినిమాల్ని చూడకుండా ఉండటానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఆ ‘తిక్క’లోనూ ఏదో కొత్తదనాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రేక్షకుడు. ’90 ప్రాంతం నుంచీ మిలీనియం వరకూ సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనాన్ని రంగరించిన వర్మ, ఆ తర్వాత్తర్వాత రీమేక్స్‌ల వెంట, సీక్వెల్స్ వెంట పరుగులు పెట్టడం మొదలెట్టాడు. అలా ‘సర్కార్’ సీక్వెల్స్ వచ్చాయి. 2005లో మొట్టమొదటి ‘సర్కార్’ సినిమా వచ్చింది. ముంబై నేపథ్యంలో ‘సర్కార్’ సామ్రాజ్యం తాలూకు నీలినీడల్ని స్పష్టంగా చూపెట్టి.. వివాదం సృష్టించింది. ఆ తర్వాత మూడేళ్లకి ‘సర్కార్-2’తో ప్రేక్షకుల్ని అలరించిన ‘వర్మ’ మళ్లీ దశాబ్దానికి ‘సర్కార్-3’ని అందించాడు.
మహారాష్ట్ర రాజకీయాలను తన కనుసన్నల్లో ఉంచుకొంటూ మనవడు శివాజీని జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తూంటాడు సర్కార్. ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవటంతో శివాజీ కూడా అలా కాకూడదని తగు జాగ్రత్తలు తీసుకొంటాడు. అయితే శివాజీకి కోపమెక్కువ. ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతూంటాడు. మరోవైపు సర్కార్‌పై పగ తీర్చుకోడానికి అనుక్షణం ప్రయత్నిస్తూంటుంది అన్నూ. 20వేల కోట్ల ప్రాజెక్ట్.. 15వేల మంది ఇళ్లు లేని వారిని ఆదుకోవటం అన్న మరో కానె్సప్ట్‌తో కథ నడుస్తుంది.
సింపుల్‌గా కథని నడిపించాడు అనటం కంటె లాక్కొచ్చాడు అంటే బాగుంటుందేమో?! ‘న కరూఁగా..న కర్నె దూంగా’ అన్న డైలాగ్‌తో సర్కార్ సాసర్‌లో టీ తాగుతూ.. న్యూస్‌ని తిలకిస్తూంటే కెమెరా ఆ రూమంతా తిరిగేస్తూంటుంది. ‘వర్మ’ సినిమాల్లో కెమెరా ఒకచోట స్థిరంగా ఉంటే ఆశ్చర్యపోవాలి గానీ.. ఇలా రూమంతా తెగ తిరిగేస్తూంటే చూడముచ్చటగా ఉండదేవిటి? పనిలో పనిగా.. ఓ ఇత్తడి లోటాలోని నీళ్లతో అక్కడి మొక్కల్ని తడుపుతూంటాడు. అది ‘తులసి’ మొక్కగా ప్రేక్షకులు భావించాలేమో?! ఇలాంటి సింపుల్ ‘సర్కార్’ దిన చర్యలతోపాటు అనేకానేక వాదోపవాదాల్నీ.. ప్రత్యర్థుల సవాళ్లనీ వ్యాపారవేత్తల ఎత్తుగడల్నీ తిప్పికొడుతూ సర్కార్ తన మనవడు శివాజీని ఎలా కాపాడుకొన్నాడన్నది క్లైమాక్స్.
ఇక మరో ట్విస్ట్. సర్కార్ మనవడు శివాజీ పూర్తిగా మారిపోయి.. ప్రజాసేవకి అంకితమవుతున్నట్టుగా చూపించటం వెనుక.. మరో సీక్వెల్‌కి తెరతీసినట్టు అనిపిస్తుంది. ఏమో?! ‘సర్కార్-4’ కూడా చూడాల్సి వస్తుందేమో?!
ఈ సినిమాకి అమితాబ్ నటన ప్లస్ పాయింట్. డైలాగ్స్ కూడా అక్కడక్కడ బలంగా ఉండటంతో ప్రేక్షకులు ‘్థయేటర్‌కి ఎందుకొచ్చాం రా బాబూ! అనుకోకుండా.. ఒక ‘ప్లస్’ దొరికినందుకు సంతోషిస్తారు. నటనాపరంగా అందరూ ఓకే. సంగీతం ఫర్వాలేదు.

-బిఎనే్క