రివ్యూ

నిజమే.. మహా మాలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ఇదో ప్రేమలోకం
*

తారాగణం: అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య, నరేష్, సుమన్, భగవాన్, దేవిశ్రీ, ప్రభావతి, మెల్కొటె తదితరులు.
కెమెరా: కె.శివ
సంగీతం: వందేమాతరం
నిర్మాత: ఎస్.పి.నాయుడు
దర్శకత్వం: టి.కరణ్‌కుమార్
*
పిల్లల్ని కంటేనే ప్రేమ ఉంటుందా? పెంచిన ప్రేమ కన్న ప్రేమకన్నా గొప్పది కదా? అటువంటి కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకొని కలలు కంటే ఆ కలలు కల్లలుగా మారిపోతే కారణం ప్రేమైతే ఏం చేయాలి? ప్రేమలోకంలో విహరించే యువతీ యువకులకు సరైన మార్గదర్శనం చేయాలంటే ఆ ప్రేమతోనే వీలవుతుందా? ఎవరి ప్రేమ ఎవరికి ఉపయోగకరంగా మారుతుంది? కొంతమంది ప్రేమలు ఎందుకు విఫలమవుతాయి? జీవితంలో రాజీపడి బ్రతకడానికి ఎవరో ఒకరిని ప్రేమించకపోయినా పెళ్లిచేసుకోక తప్పదా? కేవలం ప్రేమించిన పాపానికే జీవితమంతా త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలను వేసుకొని దానికొక మంచి కథను రాసుకొని, రూపొందించే ప్రయత్నం చేసిన ప్రేమలోకం వికటించి, మాలోకంగా మారింది.
అప్పారావు (నరేష్) సుపుత్రుడు రాజా (అశోక్‌చంద్ర) కాలేజీలో తొట్టిగ్యాంగ్‌తో కలిసి నానా అల్లరి చేస్తూ ఒక్కొక్కసారి మార్కులు వేయనందుకు లెక్చరర్స్‌ని ఆ కాలేజీ నుండి గెంటివేసే మొనగాడు. ఎవరో ఒకర్ని లవ్ చేద్దాం (?) అనుకున్న సమయంలో ఆ కాలేజీకి వచ్చిన లెక్చరర్ మేఘమాల (తేజారెడ్డి)ను ఇష్టపడతాడు. తనను ప్రేమించే మరదలు మహాలక్ష్మి (కారుణ్య)ను పట్టించుకోడు రాజా. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరిస్తే సరే ప్రేమిస్తానని మేఘమాల ఇంటికి తీసుకెళుతుంది. కొన్ని అనుకోని సంఘటనల నేపథ్యంలో తాను జీవితంలో ఓ స్థాయికి రావాలని నిర్ణయించుకుంటాడు రాజా. అందుకు మేఘమాల కూడా సహాయం చేస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో బంట్రోతుగా పనిచేసే అప్పారావు, తన కొడుకుని కలెక్టర్‌గా చూడాలనుకున్న కలను నిజం చేస్తాడు రాజా. అందుకు మేఘమాల ప్రోత్సాహం అతనికి తోడవుతుంది. మేఘమాలతో కలసి జీవితాన్ని పంచుకోవాలనుకున్న సమయంలో ఆమె ఓ విధవ అని, రాజాకు తెలుస్తుంది. అయినా సరే ఆమెను పెళ్ళిచేసుకోడానికే నిశ్చయించుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఓ ఛోటా విలన్ రాజాను హత్యచేసే ప్రయత్నం చేస్తుంటాడు. మేఘమాల చివరికి రాజానే ఇష్టపడి పెళ్లిచేసుకుందా? లేక విలన్ పథకం ప్రకారం రాజా హత్య చేయబడతాడా అనేదే మిగతా కథనం. అయితే ఇక్కడ మేఘమాల ప్రేమకథ కూడా ఓ ఉపకథగా సాగుతుంది. ఆమె తన క్లాస్‌మేట్ అయిన సురేష్ (రాజా సూర్యవంశీ)ని ప్రేమిస్తుంది. మేఘమాల తండ్రి ఎస్.పి.పరశురామ్ (సుమన్) సురేష్‌పై దాడిచేసి, హత్య చేస్తాడు. దాంతో సురేష్ కుటుంబం వీధినపడడంతో ఆ కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకొని, తల్లిదండ్రులను వదిలేసి ఉద్యోగానికి బయలుదేరింది మేఘమాల. ఇంత పెద్ద సంక్లిష్ట కథనాన్ని రాసుకోవటానికి బాగానేవుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో పూర్తి అసమర్ధత కనిపించింది. లెక్చరర్‌ను ప్రేమించే విద్యార్థి, తండ్రి ముందు అమాయకుడిలాగ నటించడం, సాయంత్రమైతే తొట్టి గ్యాంగ్‌తో మందు, మాకు తీసుకోవడం, లెక్చరర్ ఇంటికి వెళ్లి పరీక్షల్లో మార్కులు వేయనందుకు బెదిరించి, ఆ ఊరినుంచి వెళ్లగొట్టడం, తండ్రిని పిలుచుకు రమ్మని ప్రిన్సిపాల్ చెప్పగా దొంగ తండ్రిని తీసుకెళ్లి మభ్యపుచ్చడం లాంటి దరిద్రపుగొట్టు వేషాలన్నీ హీరో వేస్తాడు. ఇలా వేస్తేనే కదా ఇప్పుడు హీరోయిజం ఎలివేట్ అయ్యేది! అందులో తప్పేముంది? సినిమాలో ఏ సన్నివేశంలో కూడా సరైన గ్రిప్ ఉండదు. ఏదో అలా అలా తెరపై బొమ్మ సాగిపోతుంటుంది. నరేష్, సుమన్ లాంటి సీనియర్ నటులను కూడా సరిగా వాడుకోలేదు. ప్రతి సన్నివేశం ఏదో ఒక చిత్రంలో చూసినట్టుగా ఉంటుంది. నటీనటుల్లో సరైన అభినయం కనపడదు. ఉన్నంతలో మేఘమాలగా నటించిన తేజారెడ్డి ఓకే అనిపిస్తుంది. మీ జీవితం నిన్న ఓ వేస్ట్ పేపర్ లాంటిది. నేటికీ న్యూస్ పేపర్ లాంటిది. రేపటికి క్వశ్చన్ పేపర్ లాంటిది. అది సరిగా రాయకపోతే నీ లైఫ్ టిష్యూ పేపర్ అవుతుంది, ప్రేమ అనే రెండక్షరాలను చెప్పడానికి ఓ నిమిషం చాలు, దాన్ని నిరూపించుకోడానికి ఓ జన్మ కూడా చాలదు లాంటి మాటలు అక్కడక్కడ మెరుపులు మెరిపిస్తాయి. కెమెరా పనితనం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పేరుకి వందేమాతరం కానీ సంగీతంలో ఆ మార్కు ఎక్కడా వినిపించదు. నిర్మాణ విలువలు సోసోగా సాగాయి. దర్శకత్వ పరంగా ఓ మంచి కథను సరైన స్క్రీన్‌ప్లే లేకపోతే, సీన్ డివిజన్ రాసుకోలేకపోతే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమైనా ఈ చిత్రాన్ని ఓసారి చూడాలి.

-సరయు