రివ్యూ

..కమామీషు ఎక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** అమీ తుమీ
**
తారాగణం: అడవి శేషు, శ్రీనివాస్ అవసరాల, ఇషారెబ్బా, ‘వెనె్నల’కిషోర్, తనికెళ్ల భరణి, అదితి మాయకల్, వేణుగోపాల్, తనికెళ్ల భార్గవ్, శ్యామల తదితరులు.
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె.సి.నరసింహారావు
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మోహన్‌కృష్ణ ఇంద్రగంటి
**
ఏదైనా ఒక విషయం అంతు తేల్చేయాలన్న ఉద్దేశ్యంతో మనిషి ఊగిపోయేటప్పుడు తెలుగునాట సాధారణంగా ఉపయోగించే మాట ‘అమీ తుమీ’ తేల్చాయ్యాలనేది. అలాంటి ‘తీవ్రత’ నేపథ్యంగల పదాన్ని చిత్రం పేరుగాపెట్టి అందుకు విరుద్ధమైన వినోదాన్ని పంచడమనే ఎజెండాతో తీసిన చిత్రం ‘అమీ తుమీ’. వినోదాన్ని పోషించడం, పంచడం వరకూ బాగానే ఉన్నా అది రక్తికట్టాలంటే కావలసిన బలమైన కథావేదిక ఇందులో కొరవడడంవల్ల టైటిల్‌కున్నంత ధాటి సినిమాకు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అమీతుమీ’లో ‘కథ’ తక్కువ ‘కమామీషు’ ఎక్కువ.
జనార్ధన్ (తనికెళ్ల భరణి) కుమార్తె దీపిక (ఇషారెబ్బా) అనంత్ (అడవి శేషు)ని ప్రేమిస్తుంది. కొడుకు విజయ్ (శ్రీనివాస్) తనను మోసం చేసిన ఒకప్పటి వ్యాపార భాగస్వామి గంగాధర్ (కేదార్ శంకర్) కూతురు మాయ (అదితి మాయకల్)ను ప్రేమిస్తాడు. పెళ్లిళ్లూ చేసుకోవాలనుకుంటారు. ఈ విషయాన్ని జనార్ధన్ ఇష్టపడడు. దీపికకు వైజాగ్‌లోని శ్రీ చిలిపి (వెనె్నల కిషోర్)తో పెళ్లిచేయాలనుకుంటాడు. మరి ఎవరు, ఎవర్ని పెళ్లిచేసుకున్నారు? ఎలాచేసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలతో సినిమాకు శుభంకార్డు పడుతుంది. ఈమధ్యలో కావలసినంత మోహన్‌కృష్ణ తరహా హంగామా నడుస్తుంది. మామూలు చిత్రాల్లోనే లాజిక్ చూడడం కష్టంగా ఉంటే, ఇలాంటి సంపూర్ణ కామెడీ చిత్రాల్లో అదస్సలు కుదరదు. ఆ రూట్‌లోనే అమీ.... కూడా ప్రయాణించింది. సినిమాలో ప్రధానంగా ఒకర్నిచూసి ఒకరనుకోడం (మిస్టేకన్ ఐడింటిటీ) చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కథా కేంద్రంతో తెలుగులో అనేక సినిమాలు వచ్చేశాయి. మరి దానికోసం దర్శకుడు రిచర్డ్ షెరిడాన్ ఆంగ్ల నాటకాన్ని ఆశ్రయించడమెందుకో అర్ధంకాదు. అలాగే ఓ పక్క జనార్ధన్ కొడుకు విజయ్‌ని బయటకి పొమ్మని తన కారు, ఫారమ్‌హౌస్‌నీ ఉపయోగించుకోడాన్ని ఒప్పుకోడమూ సమజ్ కాలేదు. అయితే ఇదంతా దీనికి దానికి ఓ పెద్ద కామెడీ స్కిట్ చేస్తున్నట్లు అనిపించింది కానీ ఓ సినిమా చూస్తున్న భావన ప్రేక్షకుడికి అంతగా కలగలేదు. కానీ మొత్తం ప్రక్రియలో నటీనటులందర్నించీ ‘ది బెస్ట్’ పెరఫార్మెన్సు రాబట్టడంలో మోహన్‌కృష్ణ వంద శాతం విజయవంతమయ్యారు. అందరిలోనూ ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీ చిలిపి పాత్ర పోషించిన ‘వెనె్నల’కిషోర్‌నే. ఓ రకంగా చెప్పాలంటే కావడానికి చిత్ర నాయకులు అడవి శేషు, శ్రీనివాస్ అవసరాల అయినా వాళ్లందర్నీ అధిగమించేసారు తన ఉనికితో కిషోర్ కొన్నిచోట్ల బ్రహ్మానందం ప్రభావం వారి నటనలో కనపడ్డా సహజత్వానికేం భంగం కలగలేదు. తర్వాత చెప్పుకోవాల్సింది కుమారి పాత్రధారిణి శ్యామల నటనని. ఎక్కడా నటిస్తోందన్న భావన లేకుండా అందులో ఒదిగిపోయారామె. ఇక తనికెళ్ల భరణి (జనార్దన్ పాత్రధారి) సంగతి సరేసరి. భరణి దాదాపు డాక్టరీ చేసేసిన తెలంగాణా యాసతో ఆ పాత్రను మరోసారి చెరిగేశారు. ముఖ్యంగా తన అభీష్టం నెరవేరుతోందన్న పట్టరాని సంతోషంతో ఆనంద తాండవంచేస్తూ ఒక పాటకు అనుగుణంగా నాట్యం చేసిన తీరు చూస్తే ముచ్చటేసింది. అదే రకంగా భరణితో దీటుగా, వారి కుమార్తె దీపిక పాత్ర పోషించిన ఇఫారెబ్బా కూడా రాణించింది. ముఖ్యంగా ఆ రోల్‌కి కావాల్సిన సంభాషణోచ్ఛారణని లోప రహితంగా చేశారామె. కొత్త నటైనా అదితి మాయకల్ కూడా తన పరిధి మేరకు నటించింది. సినిమాకు డైలాగ్ రైటర్ కూడా దర్శకుడు మోహన్‌కృష్ణే. ఆ విభాగంలోనూ వారు చేసిన విశేష కృషి ముఖ్యంగా సమకాలీన సంగతుల్ని (సర్జికల్ స్ట్రైక్‌తో పెళ్లిచూపుల్ని పోల్చడం, నోట్ల రద్దు విషయాన్ని పేర్కొంటూ ‘ఎప్పుడు ఏ నోట్లు రద్దవుతాయో తెలియవనడం’లాంటివి) సంభాషణల్లో పొదగడం విషయంలో ప్రస్ఫుటమైంది. అలాగే ‘త్రివిక్రమ్’ పేరుకు చిలిపి పేరడీగా ‘్ఫర్ విక్రమ్’అన్న మాటను కాయిన్ చేయడం బాగుంది. ఐ లవ్ యు చెప్పడం కన్నా, ఆశీర్వాదం తీసుకోడం బెస్ట్’ చేప ఏదైతేనేం చేవ ఉందా లేదా అన్నది కావాలి. ‘ఇలా ఇంటికొచ్చిన వారందరికీ ఉండమ్మ ‘బొట్టు పెడతా’లా ఉండమ్మా ‘గన్ పెడతా’నంటే బావోదేమో! ‘బి.ఎం.డబ్ల్యూ’ కారుకాదు కదా బియ్యం కొనడానికి కూడా డబ్బులుండవు’లాంటి సరదా డైలాగులు ఆడిటోరియంలో బాగా పేలాయి. వీటన్నిటికీ మించి ‘నల్’ అన్న చిన్న పదం చుట్టూ అల్లిన సంభాషణలు బాగా అలరించాయి. దాంతోపాటు ‘మహేష్’పేరులోని వైబ్రేషన్ డైలాగుని ఇందులోనూ మోహన్‌కృష్ణ తిరిగి వినిపించారు. అయితే సర్వమంగళశాస్ర్తీ (ఎం.ఎస్.ఎస్) విజయ్, అనంత్ పాత్రల మధ్య నడిపిన స్వలింగ వివాహాల సుదీర్ఘ సంభాషణలు దర్శకుని అభిరుచికి తగనివిగా అనిపించాయి. మణిశర్మ అందించిన బాణీలు ఇందులో రెండే(అవీ చిత్రం ద్వితీయార్ధంలోనే వస్తాయి) అయినా అవీ ఓకే... ఒక పాటైతే గతంలో చిరంజీవి నటించిన చిత్రంలో ఒక పాట (రండి రండి దయచేయండి)ను పోలి ఉన్నా బానే ఉంది. చిత్రపరంగా చూపిన లొకేషన్స్ చాలా పరిమితం, అవీ చాలా సాధారణమైనవి కనుక పి.సి.విందా(్ఛయాగ్రాహకుడు)కు పెద్ద పనేం లేకుండాపోయింది. మొత్తానికి సినిమా అన్నది అన్ని వర్గాలకు చెందినది కనుక దర్శకుని దృష్టికోణం మల్టీప్లెక్స్ ఆడియన్స్ పైనే కాకుండా అందరి మీదా పెట్టి అమీతుమీ తేల్చుకుంటే బావుండేది.

- అనే్వషి