రివ్యూ

వీడియో గేమ్‌కీ తక్కువే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ట్రాన్స్‌ఫార్మర్స్-5
‘ది లాస్ట్ నైట్’
*
తారాగణం: మార్క్ వాల్‌బెర్గ్, జోష్ దుహామెల్, ఆంథోనీ హోప్కిన్స్, స్టాన్లీ తదితరులు
సంగీతం: స్టీవ్ జాబ్లోన్‌స్కి
నిర్మాత: టామ్ డెశాంటో
దర్శకత్వం: మిఖాయిల్ బే
*

కథ ఏంటి? అని అడక్కండి. అస్సలు ఆలోచించకూడదు కూడా. గతంలోని సిరీస్ అన్నీ తిలకించి తరించిన అభిమానుల్లో ‘ట్రాన్స్‌ఫార్మర్-5’ బోలెడంత ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు మిఖాయిల్ మరింకేదో అద్భుత లోకాన్ని సృష్టిస్తాడని భ్రమ చెందిన మాట వాస్తవం. అయతే- అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. తాజా వీడియో గేమ్స్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా ఈ సినిమాలో ప్రత్యేకత ఏం కనిపించదు.
క్రీ.శ.484. కింగ్ ఆర్థర్ -సాక్సోన్స్.. మెర్లిన్‌లతో యుద్ధం తలపెట్టిన నేపథ్యంలో -ఆఖరి క్షణంలో కూల్ డ్రాగన్.. కూలర్ అలైన్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించుకో గలుగుతాడు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ట్రాన్స్‌ఫార్మర్స్ చట్ట వ్యతిరేకంగా భూమిపై దిగుతారు. తమని కనిపెట్టిన వారి కోసం అనే్వషిస్తూంటారు. ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ వివియన్ (లారా హేడాక్) వీటి తాలూకు అనేక రహస్యాలను కనుగొంటుంది. భూమి తాలూకు గత చరిత్రని అధ్యయనం చేసిన ఆమె ఈ భూగోళాన్ని ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ నుంచీ రక్షించాలని కంకణం కట్టుకొంటుంది. సర్ ఎడ్మండ్ (ఆంథోనీ హోప్కిన్స్) ఆమెకి సహకరిస్తాడు. టూకీగా ఇదీ కథ.
‘ట్రాన్స్‌ఫార్మర్స్-5’లో చెప్పుకోదగ్గ అంశం ఒక్కటీ లేదు. ఆసక్తి కలిగించే అంశాల్లేవు. కథ అంటూ ఏం లేదు. ఆటోబోట్స్‌కి అధినేత అయిన ఆప్టిమస్ ప్రైమ్ సొంత గ్రహం శిథిలమై పోవటాన్ని జీర్ణించుకోలేక.. ‘సైబర్‌ట్రాన్’కి జీవంపోసి తమ మనుగడను పునరుద్ధరించుకోవటం అన్న ప్రక్రియ ఇది. తమకు కావల్సిన ‘జీవం’ భూమిపై దొరుకుతుందని తెలిసిన ఆప్టిమస్.. చివరికి భూగోళానే్న నిర్వీర్యం చేయటానికి సంకల్పించటం అన్నది కథ.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ తప్ప మరే ‘జీవం’ లేదు. యాక్షన్, ఎక్స్‌ప్లోజన్, ఛేజింగ్ సన్నివేశాలకు తగ్గ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఫీల్ కలుగజేయాలని ప్రయత్నించినప్పటికీ.. అవేవీ థ్రిల్లింగ్‌ని కలిగించలేక పోయాయి. ఆటోబోట్స్‌కి.. డిసెప్టికాన్స్‌కి మధ్య జరిగే ఎక్స్‌ప్లోజన్స్ రసవత్తరంగా అనిపిస్తాయి గానీ.. ఇనుప రేకుల శబ్దాలతో హోరెత్తించటం భరించలేం. అదీగాక -సినిమా లెంగ్త్ జనం ప్రాణాల్ని తీస్తుంది. ఉన్న కాస్త ఓపిక నశిస్తుంది. క్లైమాక్స్‌లో ‘సైబర్‌ట్రాన్’ ‘ఆటోబోట్స్’ యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. జెయింట్ రోబోట్స్ విన్యాసాలూ.. కార్ల ఛేజింగ్‌లూ.. బీభత్స భయానక విస్ఫోటనాలనూ ఇష్టపడే అభిమానులకు కాస్తంత ఊరట కలిగిస్తుందేమో గానీ.. సామాన్యుడికి విసుగు పుట్టిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. అంతే! లేని కథ గురించి ఎంత చెప్పుకున్నా ఇంతే!

-బిఎనే్క