రివ్యూ

కాలక్షేపమూ కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ది జెంటిల్‌మేన్
*
..సుందర్, సుశీల్, రిస్కీ
తారాగణం: సిద్దార్థ్ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దర్శన్ కుమార్, సునీల్ శెట్టి తదితరులు
సంగీతం: సచిన్ - జిగర్
కథ: సీతా మీనన్, డి.కె - రాజ్
దర్శకత్వం: కృష్ణ డి.కె. - రాజ్ నిడిమోరు
*
మూడేళ్ల సుదీర్ఘ విరామం (‘హేపీ ఎండింగ్’) తర్వాత రాజ్ - డి.కె. దర్శకద్వయం ‘ది జెంటిల్‌మేన్’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్‌లో కొత్తకొత్త ప్రక్రియలు నడుస్తున్న నేపథ్యంలో.. కేవలం ఒకానొక చట్రంలో కథని బిగించి.. పడికట్టు సూత్రాల్తో -రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్‌ని కలగలిపి రాసుకొన్న ఈ కథ ‘్ఫక్స్‌డ్’ ఫార్మేట్‌లో కనిపిస్తుంది. కథ అంటే ఇలాగే ఉంటుందా? కొన్ని సన్నివేశాల్తో నాయకా నాయికల మనస్తత్వ విశే్లషణ, సంప్రదాయాల్ని పట్టుకొని వేలాడే సందర్భాలూ -అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చివురింత.. ఆ తర్వాత్తర్వాత -కథ మలుపు తిరిగి ‘క్రైం’ వైపు దారితీసి థ్రిల్లర్‌ని కలిగించటం. వెరసి -ఇటువంటివి బోలెడన్ని చూసేశాం. ఆ తర్వాతి సన్నివేశం ఏం జరగబోతోందో ముందస్తుగా చెప్పేసి ప్రేక్షకుల ఆలోచనల జోలికి రాజ్-డి.కె. వెళ్లకండా రెండున్నర గంటల రీళ్లని తిప్పేశారు. ‘హేపీ ఎండింగ్’లో ఉన్న కాస్తపాటి డెప్త్ కూడా కథలో లేదు. ఓ చేత్తో వేడివేడి కుక్కర్ మూత.. మరోచేత్తో పిస్తోలు పుచ్చుకొని హీరోయిజం వొలకబోసే హీరో పోస్టర్‌ని చూసి ఏదేదో ఊహించుకొంటే తప్పు ప్రేక్షకులదే అవుతుంది.
-మియామిలో ఓ పేద్ద ఇల్లు -అత్యధిక సంపాదనాపరుడు.. పేద్ద కారు. వంట అంటే ఇష్టం.. సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినవాడి లక్షణాలు కలిగిన వ్యక్తి గౌరవ్ (సిద్దార్థ్ మల్హోత్రా). అచ్చంగా ఎలా ఉంటాడూ అంటే.. ‘పెళ్లిపందిరి’ అడ్వర్టయిజ్‌మెంట్‌లో అబ్బాయిలకిచ్చే సలక్షణ గుణ సంపన్నుడు. ఇతగాడికి కావ్య (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఓ హర్డిల్. వీరిద్దరి మధ్యకీ రిషీ (సిద్దార్థ్ మల్హోత్రా) వచ్చి చేరతాడు. అప్పటి వరకూ ‘సుందర్ - సుశీల్’ పదాలతో మంచి బాలుడిగా పేరుగాంచిన గౌరవ్‌కి ‘రిస్కీ’ అన్న టాగ్ జోడవుతుంది. రిషీ ఓ రిస్కీ పర్సన్. ఈతడి ఎంటర్‌తో కథ ఉన్నట్టుండి మలుపు తిరుగుతుంది. ‘యూనిట్ ఎక్స్’తో గౌరవ్‌కి భేటీ ఏర్పడుతుంది. అనుకోని రిస్క్‌లో పడతాడు. ఆ రిస్క్ రిషీ రూపంలో వచ్చిందని తెలియటానికి సమయం పడుతుంది. ఆఖరికి కథ క్లైమాక్స్ చేరుతుంది.
ఇటువంటి కథల్లో ఆశించటానికి ఏమీ ఉండదు. మలుపులూ ఉండవు. సాఫీగా హైవే మీద వెళ్తున్నట్టు ఉంటుంది. గతుకులు వస్తేనే కదా అసలు విషయమేమిటో అర్థమయ్యేది. కాకపోతే -గతుకుల జోలికి వెళ్లటం ఎందుకు అనుకున్నారేమో? రాజ్-డి.కె.
పద్ధతి ప్రకారం వెళ్లారు. ముందుగా హీరోల (డ్యూయల్ రోల్) మనస్తత్వ విశే్లషణ.. మధ్యమధ్య కథానాయిక కవ్వింపు చర్యలు.. మరికాసిన్ని కామెడీ బిట్స్ - ఇంకాస్త రొమాన్స్.. అక్కడక్కడ ముప్పాతిక నగ్నత్వం.. ఇసుక తినె్నలు -సాగర తీరాలు.. వీటితోపాటు అందమైన ఫారిన్ లొకేషన్స్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధపరిచారు.
కథ గురించి ఆశిస్తే.. ఫలితం శూన్యం. కళ్లప్పగించి చూపెట్టింది చూసేసి.. బుర్రలో ఏ ఆలోచన పెట్టుకోకుండా థియేటర్‌లోంచి బయటికి రావటం ఒక్కటే తక్షణ కర్తవ్యం.
ఉబుసుపోకపోతే - వెళ్లొచ్చు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పిచ్చి’ నవ్వునీ.. ఆమె వేసుకొనే హాఫ్ నిక్కర్లని చూడాలంటే వెళ్లొచ్చు. అంతా ఐన తర్వాత ఫర్వాలేదులే అని తమకి తాము సంతృప్తిపరచుకోవాల్సిందే తప్ప ఈ కథలో ఏమీ లేదని తీర్మానించుకోవడమే?!

-నిరీక్షణ