రివ్యూ

మర్డర్ మిస్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** వీడెవడు
**
తారాగణం:
సచిన్ జోషి, ఇషాగుప్తా,
ప్రభు, కిశోర్, శ్రీనివాసరెడ్డి,
హర్షవర్థన్, వెనె్నల కిషోర్,
ప్రతాప్ పోతన్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఎడిటింగ్:ప్రవీణ్ పూడి
మాటలు:వేణు మండేపూడి
నిర్మాత: రైనా జోఊ
రచన, దర్శకత్వం: తాతినేని సత్య
**
సాధారణంగా మర్డర్ మిస్టరీ సినిమాలంటే కాస్త ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువ. దాని సస్పెన్స్‌ను చివరిదాకా తీసుకెళ్లే విషయం కత్తిమీద సాములాంటిది. ఆ తరహా సినిమాలకు స్క్రీన్‌ప్లే కీలకం. అలాగే టెక్నికల్ అంశాలు కూడా. ఇలాంటి విషయాలను దర్శకుడు తెలివిగా డీల్ చేయాల్సి వుంటుంది. ఏ మాత్రం తేడా కొట్టిందా.. ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక కబడ్డీ నేపథ్యంలో సినిమాలు తీసి దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న తాతినేని సత్య తాజాగా క్రైం నేపథ్యంలో ఎంచుకున్న కథను కూడా కబడ్డీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. అప్పట్లో ‘వౌనమేలనోయి’ చిత్రంతో హీరోగా పరిచయమైన సచిన్ జోషి, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. కొంత గ్యాప్ తరువాత తన సొంత బ్యానర్‌లో తాతినేని సత్య దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడెవడు’తో మనముందుకొచ్చాడు. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఏమిటి? ఎవరు ఎవరిని చంపారు? ఇంతకీ ఆ వీడెవడు? అన్నది తెలయాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
సత్య (సచిన్)ని ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేస్తారు. పెళ్లయిన రెండో రోజే భార్య శృతి (ఇషాగుప్తా)ని హత్య చేయడం అందర్నీ షాక్‌కి గురిచేస్తుంది. సత్యని 14 రోజులపాటు రిమాండ్‌కి పంపిస్తుంది కోర్టు. ఈ కేసును ఓ స్పెషల్ ఆఫీసర్ (కిషోర్)కి అప్పగిస్తారు. సత్య నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తారు. కానీ తన చిత్రమైన ప్రవర్తనతో పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతూ వుంటాడు సత్య. అదే సమయంలో ఒక పోలీసు అతన్ని చంపాలని కూడా ప్రయత్తిస్తుంటాడు. అసలు సత్య అతని భార్యను ఎందుకు చంపాడు? దాని వెనుకున్న కారణాన్ని పోలీసులు ఎలా కనుగొన్నారు? సత్యని పోలీసులు ఎందుకు చంపాలనుకుంటారు? పోలీసుల విచారణలో తెలిసిన నిజాలేమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
హీరో తన భార్యను పెళ్లయిన రెండో రోజే.. ఎందుకు చంపాడు అనే సస్పెన్స్‌తో కథ మొత్తం సాగుతుంది. సెకెండాఫ్ మధ్య వరకు ఈ ట్విస్టును రివీల్ చేయకుండా కథను నడపడం ద్వారా మంచి ఉత్కంఠ క్రియేట్ అయింది. హీరోగా సచిన్ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్ ఇది. నటనాపరంగా ఇందులో సరైన న్యాయం చేయలేకపోయాడు. ఇది కేవలం డైరెక్టర్ సినిమా అనిపిస్తుంది. కథానాయిక ఇషాగుప్తాకు తొలి సినిమా.. అయినా కూడా తన గ్లామర్‌తో, పెర్‌ఫార్మెన్స్‌తో మంచి మార్కులే పొందింది. స్పెషల్ ఆఫీసర్‌గా నటించిన కిశోర్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. మొదట నెగటివ్‌గా అనిపించినా అతని క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ని బాగా చూపించాడు. శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్, హర్షవర్థన్ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు గానీ అంతగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ తండ్రి క్యారెక్టర్‌లో నటించిన ప్రభు జస్ట్ ఓకె అనిపించాడు. పగతో రగిలిపోయే జైలర్‌గా సుప్రీ త్, చాలాకాలం తరువాత తెరపై కనిపించిన ప్రతాప్ పోతన్ సైకియాట్రిస్ట్ పాత్రల్లో చక్కగా రాణించారు.
సాంకేతికపరంగా ఫొటోగ్రఫీ సినిమాకి చాలా ప్ల్‌స్. బినేంద్ర మీనన్ ప్రతి సీన్‌ని చక్కగా చిత్రీకరించాడు. ఫారిన్ లొకేషన్‌లో తీసిన సీన్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. తమన్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. మూడు పాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణ మామూలుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సిట్యుయేషన్‌కు తగ్గట్టుగా తన మ్యూజిక్‌తో సీన్స్‌ని బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక కథ, కథనాల గురించి చెప్పుకోవాలంటే ఇది పాత కథే అయినా దాన్ని కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో మంచి ప్రయత్నం చేశాడు సత్య. హీరో తన భార్యని ఎందుకు హత్య చేశాడు? అనేది రివీల్ చేయకుండా ఫస్ట్‌హాఫ్ వరకు సస్పెన్స్ బాగానే మెయిన్‌టెయిన్ చేశాడు. అయితే మధ్యలో వచ్చే సీన్స్ కొన్ని బోర్ కొట్టించేవిగా ఉన్నాయి. సెకండాఫ్‌లో ఏం జరగబోతోందనే ఆసక్తి క్రియేట్ చేయడంతో సత్య సక్సెస్ అయ్యాడు. సినిమా ఆరంభం నుండి సెకెండాఫ్ మధ్యవరకు సస్పెన్స్‌ను కావాలనే దాచిపెట్టిన దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో సినిమాను నడిపి బోర్ కొట్టించాడు. గోవా జైలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలైతే విసుగుతెప్పించాయి. హీరోకి బాడీలైన్ పర్సనాలిటీ డిజార్డర్ వుందని చెప్పి ఏదేదో చేయిస్తుంటాడు. ఆ సీన్లన్నీ కృత్రిమంగానే అనిపించాయి. హీరోని నెగెటివ్ షేడ్‌లో చూపిస్తూ సినిమాని సైకిక్‌గా, సస్పెన్స్‌గా ముందుకు తీసుకెళ్లాలనే దర్శకుడి ఉద్దేశ్యం బాగున్నా అందుకు కావాల్సిన బలమైన కథనాన్ని రాసుకోలేదు. లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
కథలో కీలకమైన నిజం, కొంత కామెడీ మినహా ఆకట్టుకొని కథనం, అనవసరమైన విసిగించే సన్నివేశాలు కొన్ని చికాకు పెడతాయి.

-త్రివేది