రివ్యూ

కంగాళీ వల్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* శ్రీవల్లీ
*
తారాగణం
రజత్, నేహాహింగీ, రాజీవ్ కనకాల, హేమ, సత్యకృష్ణ, సూఫీ సయ్య
ఝాన్సీ, అర్హన్‌ఖాన్, రే
మాస్టర్ సాత్విక్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
నిర్మాత: రాజ్‌కుమార్ బృందావనం
రచన, దర్శకత్వం: వి.విజయేంద్ర ప్రసాద్
*
మామూలుగా అయితే ఇటీవలకాలంలో సర్వోన్నత ప్రాచుర్యం పొందిన ‘బాహుబలి’ చిత్రానికీ ‘శ్రీవల్లీ’కి ఎవరూ పోలిక తేరు కానీ చిత్ర ప్రచారంలో ‘బాహుబలి’ రచయిత నుంచి వచ్చిన చిత్రంగా ఈ చిత్రాన్ని పేర్కోవటంతో ప్రేక్షకులు ఆ అంచనా ఊహలతో సినిమాను చూడడానికి ఉత్సాహపడ్డారు. కానీ ఆ ఊహలన్నింటినీ పటాపంచలు చేసేసిందీ చిత్రం. అంటే చిత్ర కథలో వైవిధ్యం లేదని కాదు. ఉన్న వైవిధ్యాన్ని తెరపై ఆవిష్కరించడంలో అనుసరించిన గందరగోళ విధానాలు, మలుపులు (ట్విస్టులు)వల్ల దర్శకుడు అనుకున్న ఫలితాలు రాలేదు. వివరాల్లోకి వెళితే...
ప్రతిభ వుండి పరిశోధన చేయడానికి ఆర్థిక, ఇతర పరిస్థితులు అనుకూలించకపోవడంవల్ల ప్రతిభ పైకి రావడం లేదన్న ఉద్దేశ్యంతో అలాంటివారికి ఉచితంగా అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఓ ట్రస్టు నెలకొల్పుతాడు శాస్తవ్రేత్త రామచంద్ర (రాజీవ్ కనకాల). దాన్ని నిర్విఘ్నంగా నడపాలని కుమార్తె శ్రీవల్లీ (నేహా హింగీ)కి చెప్తాడు. దాంతోపాటు సోదరుని బాధ్యతనూ శ్రీవల్లీ తీసుకుంటుంది. ‘మనసు భావ తరంగాలను కొలవగలిగితే అవతలి వ్యక్తిలోకి తొంగి చూడవచ్చు. నియంత్రించవచ్చు’ అన్న అంశంపై పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్ అశోక్ మల్హోత్రాకు నేను సాయపడతానంటూ శ్రీవల్లీ ముందుకొస్తుంది. అలా రాడానికి కారణం అవతలి వ్యక్తి నియంత్రణలు తెలుసుకోవడం, చేయడంవల్ల తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన తమ్ముడిలో చలనం తీసుకురావచ్చు అన్న ఆశ కూడా శ్రీవల్లీలో ఉంది. దానికితోడు ‘గత జన్మ స్మృతులు’ కూడా ఆమెను బాల్యంనుంచి వేధిస్తూ వుంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకెదురైన సంగతులూ, అంటే ఎవరో తనని కలలో కలిసి లైంగిక వేధింపు చేస్తున్నట్టు, యు.ఎస్‌లో తన స్వలింగ సంపర్కం అలవాటున్న స్నేహితురాలు తరచు కలుస్తున్నట్లు భావనలు రావడం, అవి భావనలా? నిజాలా? అన్న తీవ్ర మధన అనుభవించడం, దాన్నుంచి వేరుపడడానికి చిన్నప్పటినుంచి స్నేహితుడుగా ఉన్న గౌతమ్ (రజత్) సహాయం పొందడం, మరి అలా సహాయంచేసిన గౌతమ్ చేసిన పని ఏమిటి? అన్నవాటితో సినిమా ఈజన్మలో పూర్తవుతుంది. అవతలివాడి మనసులోని భావనలు ఏమిటో తెలుసుకుని వారిని పురికొల్పడం, నియంత్రించడం అనేవి మంచికోసం ఉద్దేశించినా, దాన్ని సినిమాటిక్‌గా వాడుకోవడం, దానికోసం నమ్మిన స్నేహితుడు (గౌతమ్)నే దుష్టుడ్ని చేయడం తదితరాలవల్ల అసలు సినిమాకిచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ అన్న మకుటం మసకబారిపోయింది. దాంతోపాటు దర్శకునికిష్టమైన ‘పునర్జన్మ’ (విజయేంద్ర ప్రసాద్ విశిష్ట రచన ‘మగధీర’ చిత్రమూ పునర్జన్మ మూలాలతోనే ఉండడం గమనార్హం) కార్డునీ ఇందులో కలపడంతో కన్‌ఫ్యూజన్ మరింత విస్తృతమైంది. ఓ పక్క శాస్ర్తియత హేతుబద్ధత అంటూ పద్ధతిగా పరిశోధనలు నిర్వహించే మల్హోత్రాయే ఓ సందర్భంలో వచ్చిన సమస్య నివారణకోసం నాకు తెలిసిన ఓ మంత్రగత్తె (ఏంకర్ ఝాన్సీ)ను కలు అని చెప్పడంతోనే, వెనకాల ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న అనుమానం వీక్షకుడికి వచ్చేస్తుంది. దాంతో దర్శకుడాశించిన సస్పెన్సు ఎలిమెంటూ సాగలేదు. వీటన్నిటినీ మించి సినిమా కథా విధానాన్ని కృంగదీసిన విషయం మరొకటుంది. అది ట్విస్టుల పేరిట ప్రధాన పాత్రలన్నింటికీ తలో ఉపకథ పెట్టాడు. రామచంద్ర, గౌతమ్ తల్లి, ప్రొఫెసర్ అశోక్ మల్హోత్రా వెనుక వారి వారి ప్రవర్తనలకు సపోర్టుగా ఉపకథలు పెట్టారు. ప్రధాన పాత్ర శ్రీవల్లీ చెప్పినవన్నీ ఇమడక, ప్రేక్షకుల్ని తెగ ఇబ్బంది పెట్టాయి. దీంతో వాస్తవానికి చిత్ర నిడివి కేవలం గంటా యాభైఒక్క నిమిషాలైనా, మూడు గంటల చిత్రం చూస్తున్నామా అన్న భావన ఆడియెన్స్‌కి కలిగింది. భావనల పేరిట నాయికతో మజ్ను పేరుతో పురుషునితో చేయించిన శృంగార సన్నివేశాలూ వగైరా సినిమాకు కావాల్సినంత ఎలిమెంట్‌ను సప్లై చేశాయి తప్ప, దర్శకుడనుకున్న ‘్భవ తరంగాల’ భాషలోకి తీసుకెళ్లలేకపోయాయి. ఇవన్నీ కష్టంతో జీర్ణం చేసుకుని చూస్తే పెర్‌ఫార్మెన్స్ ప్రకారంగా గౌతమ్, శ్రీవల్లీ పాత్రధారుల్లో శ్రీవల్లీ పాత్రధారిణీ నేహా హింగీ బాగా నటించింది. పాత్రకిచ్చిన (అది అసంబంధమనిపించినా) స్వభావాన్ని అర్థం చేసుకుని నటించింది. గౌతమ్‌గా రజత్ భావప్రకటనలో ఇంకా బాగా సాధన చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ప్రొఫెసర్ అశోక్ మల్హోత్రాది. పరిధి మేరకు ఆయన నటించారు. మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవే. కథా విస్తృతిలో రాజీవ్ కనకాల (రామచంద్ర) పాత్రకు మరికాస్త నిడివి కల్పించి వుంటే సన్నివేశాలకు ఇంకాస్త బలం కలిగేది. శ్రీలేఖ స్వరాల్లో ‘ఓం నమశ్శివాయ..’ పాటొక్కటే బాగుంది. ‘సావరియా..’ పాట గతంలో ఉన్న పాపులర్ పాటనే తలపించింది. శ్రీచరణ్ నేపథ్య సంగీతం కొన్నిచోట్ల మూడ్‌ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. ఆండ్రియా లోకంగా చూపించిన గంటల సెట్ బాగుంది. విజయేంద్రప్రసాద్ బాపతు డైలాగ్స్ చమక్కు ‘వల్లిని సూదితో గుచ్చితే గౌతమ్‌ను గునపంతో గుచ్చినట్లు’ వంటి కొన్ని చోట్లే కనపడింది. మొత్తానికి బ్రెయిన్ మ్యాపింగ్, బ్రైన్ వేవ్స్ వంటి అంతగా పరిచయం లేని అంశాల వివరణకు శ్రీవల్లీలో పూనుకోవడం అభినందనీయమైనా, దానికోసం అనుసరించిన, కలిపేసిన అనవసర విషయాలవల్ల చిత్ర సారం ప్రేక్షకులకు అందలేదనే చెప్పచ్చు.

-అనే్వషి