రివ్యూ

రొటీన్ కథే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓయ్ నినే్న..* బాగోలేదు
*
తారాగణం:
భరత్, మార్గని
సృష్టి డాంగే తదితరులు.
సంగీతం: శేఖర్ చంద్ర
బ్యానర్: ఎస్.వి.కె సినిమాస్
నిర్మాత: సి.హెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్
దర్శకత్వం: సత్యం చల్లకోటి
*
కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా అత్యధిక శాతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంటాయి. అయితే చెప్పాల్సిన విషయాన్ని అందంగా, ఆహ్లాదకరంగా చెబితేనే వాటిని ఆదరిస్తారు. రొటీన్ కథతో ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నామంటూ హంగామా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తే అవి వాళ్ల నిరాదరణకు గురి కాక తప్పదు. అందుకే కథలో ఏమాత్రం కొత్తదనం వున్న సినిమాలకు జనం ఓటేస్తున్నారు. ఇక తాజాగా నూతన నటీనటులతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓయ్ నినే్న..’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అసలుకథ ఏమిటో తెలుసుకుందాం.
విషు (్భరత్), అమ్ములు (సృష్టి డాంగే)లు చిన్ననాటినుండే స్నేహితులు. కలిసి పెరిగిన వీరి మధ్య ప్రేమ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పకపోవడంతో వారి పెద్దలు అమ్ములుకు మరొకరితో పెళ్లి నిశ్చయం చేస్తారు. దాంతో ఇద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వీరి ప్రేమ విడిపోవడానికి కారణం ఏంటి? అమ్ములు ప్రేమను దక్కించుకునేందుకు విషు ఏం చేసాడు? ఈ ప్రేమ జంట తిరిగి కలిసిందా? అన్నది మిగిలిన కథ.
ఈ సినిమాలో కథ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఆకట్టుకోని కథ. ఇప్పటికే మనం ఎన్నో వందల సినిమాలు చూసివుంటాం. బావమరదళ్ల ప్రేమా, మొదట్లో ఇద్దరికీ పడకపోవడం లాంటి అంశాలు చాలా పాతవే. పైగా దర్శకుడు కూడా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడా అంటే అదీలేదు. రొటీన్ కథ, కథనంతో అల్లుకున్న కథ ఇది, అయితే ఈ ప్రేమజంట మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సరదాగా వుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక హీరో హీరోయిన్స్ నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇద్దరి పాత్రలు అవి మలిచిన విధానం అంతంత మాత్రమే. హీరో భరత్‌కు తొలి చిత్రమే అయినా జస్ట్ ఓకే అనిపించాడు. ఇక ఇతర పాత్రల నుంచి దర్శకుడు పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టాడు. కుటుంబ నేపథ్య సన్నివేశాలు, ముఖ్యంగా నాగినీడు పాత్ర బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కమెడియన్ సత్య నవ్వించాడు. హీరోయిన్ సృష్టి గ్లామరస్‌గా కనిపించింది కానీ నటనలో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. మంచి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్‌ని ఆసక్తికరంగా మలచిన దర్శకుడు సెకండ్ హాఫ్‌ని అదే స్థాయిలో తీసుకురావడానికి మరింత శ్రమించాల్సింది. చిత్రాన్ని సరైన ముంగింపునకు తీసుకురావడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. కొన్ని సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. విలన్ పాత్ర కూడా పెద్ద మైనస్‌గా మారింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తపడాల్సింది. వీరిద్దమధ్య వచ్చే సన్నిశాలు రొటీన్‌గానే అనిపిస్తాయి.
నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని పల్లెటూరి వాతావరణంలో కెమెరా పనితనం బాగుంది. సంగీతం సో..సోనే! నటీ, నటుల పాత్రలు అంతగా సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకె. సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని వుంటే బావుండేది. రొటీన్ కథే అయినప్పటికీ ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు సత్యం ఫరవాలేదనిపించినా, ద్వితీయార్ధంలో అనేక కమర్షియల్ అంశాలని జత చేయడం వలన సాగదీసినట్టయింది. ఏమాత్రం ఆసక్తికరంగా సాగని కథనం ప్రేక్షకుల్లో అసహనానికి గురి చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ‘ఓయ్ నినే్న’ ఫస్ట్ హాఫ్ వరకు ఆకట్టుకుని ఆ తరువాత కొంత నిరాశకు గురి చేస్తుంది. హీరో హీరోయిన్స్ మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం, సెకండ్ హాఫ్‌లో కథని సాగదీయడం కూడా కొంత మైనస్సే అనిపించింది.

-త్రివేది