రివ్యూ

ఇదో.. జంబలకిడిపంబ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు
కి అండ్ క

తారాగణం: కరీనా కపూర్, అర్జున్ కపూర్, అమితాబ్, జయబాధురి, రజత్ కపూర్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
సంగీతం: ఇళయరాజా
నిర్మాత, దర్శకత్వం: ఆర్.బల్కి

రోజులు మారాయి. ఏ అమ్మాయినైనా పలకరించి- పురుషాధిక్య ప్రపంచం గురించి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పమంటే -చెంప ఛెళ్లుమనటం ఖాయం. ఆకాశంలో సగమై.. ఆకాశమంత ఎత్తుకి ఎదిగినా... ఆయా రంగాల్లో మగాళ్లతో పోటీపడుతూ.. తమ శక్తి సామర్థ్యాలనూ కృషినీ పట్టుదలనూ చాటుతూన్న మహిళ ఇంకా మగాడి ‘చెప్పు’చేతల్లో ఉండమంటే ససేమిరా అనటమే కాదు- కావాలంటే తాళి తెంచి మగాడి మెళ్లోనే వేసేస్తోంది. ఇంత ఉపోద్ఘాతానికి కారణం ఏమిటంటే- ‘కి అండ్ కా’ కథ. ఆ మాటకొస్తే -ఆడాళ్లు ఏ విషయంలో తక్కువ. జెట్ విమానాల్ని తోలేస్తున్నారు. అంతరిక్షంలోకి ఎగిరేస్తున్నారు. సముద్ర గర్భంలోని లోతుల్ని వెతికేస్తున్నారు. ఇవన్నీ -చేయగలుగుతున్నప్పుడు.. ఇన్ని ప్రగల్భాలు పలికే మగాళ్లు అంతే సమర్థవంతంగా (?) ఇంటిని నడిపించలేరా? కొన్ని యుగాలుగా వేధిస్తున్న ప్రశ్న. ఏ మగాడినైనా ప్రశ్నిస్తే -ఆఫ్టరాల్. అదేమన్నా బ్రహ్మ విద్య అంటాడే తప్ప -చేద్దామని ఆలోచించడు -్ఢల్లీ వాసి కబీర్ బన్సాల్‌కి మల్లే.
‘బల్కి’ బల్క్‌గా అనుకొన్నది ఇదే. ‘జంబలి‘కి’డి పంబలా. ఓ అబ్బాయి వంటింటి కుందేలుగా మారిపోతే? అమ్మాయి ‘కార్పొరేట్’ రంగాన్ని ఏలేస్తూంటే? చూట్టానికి మనసు చాలదు. ఇక్కడే -బోలెడన్ని తిరకాసులూ.. సందేహాలూ.. భిన్నాభిప్రాయాలూ ప్రేక్షకుల్ని వెంటాడతాయి. అసలు‘కి’ -కానె్సప్టే తప్పు. ఎవరూ ఊహించని ఎవరూ అంగీకరించని సబ్జెక్ట్. భర్త ఆఫీస్‌లో ఫైళ్లతో కుస్తీ పట్టాలి. భార్య వంటింట్లో గినె్నల్తో పోటీ పడాలి... అంతే. అయితే ఈ కానె్సప్ట్‌ని ‘బల్కి’ సమర్థవంతంగా నెట్టుకొచ్చాడని అనలేం గానీ.. కొన్ని రీళ్లకొద్దీ ‘ముద్దు-ముచ్చట్ల’ తర్వాత ఒరిజినల్ కానె్సప్ట్ మరుగున పడిందని చెప్పొచ్చు. ఇక కథలోకి వెళ్దాం.
కబీర్ బన్సాల్ (అర్జున్ కపూర్).. ఓ మల్టీ మిలియనీర్.. వ్యాపారవేత్త పుత్రరత్నం. చూట్టానికి ఆరడుగుల అందగాడే కాదు.. ఆలోచనల్లోనూ అంతే. కబీర్‌కి అమ్మంటే ప్రాణం. హౌస్‌వైఫ్ అని తేలిగ్గా తీసిపారేయటం కాదు.. అమ్మ గొప్ప ఆర్టిస్ట్. ఇంటిని సమర్థవంతంగా నడిపించే చుక్కాని అంటాడు. అమ్మపట్ల తనకున్న అభిప్రాయాన్ని తరచూ వెల్లడిస్తూనే ఉంటాడు. ఒకానొక సందర్భంలో కార్పొరేట్ స్టార్ ‘కియా’ (కరీనాకపూర్)ని కలుస్తాడు. కియాకి పెళ్లంటే ఏవగింపు. తనకి కెరీర్ ముఖ్యం. కెరీర్‌కి పెళ్లి అవరోధం కాబట్టి.. చేసుకోకూడదు అన్నది నిశ్చితాభిప్రాయం. కియా తల్లి ఎన్జీవో. సింగిల్ పేరెంట్. పెళ్లి పట్ల ఆమెకీ అసహ్య భావం. పెళ్లితో కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేయాల్సి వస్తుందంటుంది. ఈ నేపథ్యంలో ఈ లడ‘కి’ లడ‘కా’కీ ‘కి’యాకీ ‘క’బీర్‌కీ పెళ్లి ఫిక్స్ చేసేస్తారు. ఇన్ని విరుద్ధ భావాలతో ఆ జంట ఇంటినీ ఆఫీస్‌నీ నెగ్గుకు రాగలిగిందా? అన్నది క్లైమాక్స్.
సినిమాలో భార్యాభర్తల అనుబంధాన్నీ ప్రేమల్ని.. ఆప్యాయతల్నీ మరో కోణంలో చూపారు. ఆధునికత విస్తరిస్తూ పాశ్చాత్య సంస్కృతి బలంగా వేళ్లూనుకొని ‘పెళ్ళి’ పట్ల విముఖతని పెంచుకొంటున్న తాజా పరిణామంలో.. ఈ కథ అనేకానేక అంశాల్ని ప్రస్తావించింది. ‘ఆడాళ్లు ఒఠ్ఠి ఏడుపుగొట్టు వెధవలు’ ‘మగాళ్లు ఇంట్లో వంట చేయటం ఏమిటి?’ ‘కెరీర్‌కి ముగింపు ప్రెగ్నెన్సీ’... ఇలాంటి సంగతులతో పాటు.. ‘ఇన్ సైడ్ ఎ ఫ్యామిలీ’ లాంటి సీరియస్ క్వొశ్చన్స్‌ని తెర మీదికి తెచ్చారు. అమితాబ్ -జయల ద్వారా అనేకానేక ప్రశ్నలతో ప్రేక్షకుల్ని ముంచెత్తారు.
‘చీని కమ్’ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించి... ఓ అరవై ఏళ్ల వృద్ధుడికీ... పదహారేళ్ల పడుచుపిల్లకీ మధ్య ‘ప్రేమ’ పుట్టించి సక్సెస్ అయిన ‘బల్కి’ తన కానె్సప్ట్స్‌తో జిమ్మిక్కులు చేస్తూ ప్రేక్షక లోకాన్ని ఉర్రూత లూగిస్తూనే ఉన్నాడు. ‘పా’ చిత్రంతో ‘పీక్’ స్టేజ్‌కి వెళ్లిన ‘బల్కి’ కథల్లో ఏదో ఒక సందేశం ఉంటుంది. లేదా -సామాజిక రుగ్మత తాలూకు చేదు అనుభవం ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఈ సినిమాని కూడా అనేక ప్రశ్నలతో నడిపించాడు. కాలం మారినా... తరాలు మారినా... ‘పురుషాధిక్య’ కానె్సప్ట్‌ని టచ్ చేయటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ -ఓ మగాడి మెళ్లో తాళి కట్టించి.. హైహీల్స్ వేయించి డాన్స్ చేయించటం అంటే మాటలు కాదు. ఒప్పుకొని తీరాలి -అన్నట్టు బల్లగుద్ది మరీ ‘సబ్జెక్ట్’ని టచ్ చేశాడు. నటనాపరంగా -అర్జున్ చక్కటి పెర్‌ఫార్మెన్స్ చూపగలిగాడు గతంలో కంటే. కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ డాల్‌గా... కార్పొరేట్ ఐకాన్‌గా చక్కగా నటించింది. ‘బోల్డ్’గా ముద్దు సీన్లు కూడా ఉన్నాయి కాబట్టి -యువతని ఈ పరంగా ఆకర్షించవచ్చు. సంగీతం బాగుంది. ఫొటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ పాయింట్.

-ప్రనీల్