రివ్యూ

మెప్పించే ‘కార్తీక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్టర్ కార్తీక్ ** ఫర్వాలేదు

** ** ** ** **

తారాగణం:

ధనుష్, రిచా గంగోపాధ్యాయ్
సుందర్‌రాము, పూజాదేవరామ్ రవిప్రసాద్ తదితరులు
సంగీతం: జి.వి ప్రకాష్‌కుమార్
నిర్మాతలు: కాడబోయిన బాబురావు, కె.మల్లికార్జున
కథ, దర్శకత్వం: శ్రీరాఘవ

ప్రతిభ ఒకరిది, ప్రయోజనం మరొకరిది అన్న కథా ప్రాతిపదిక మీద గతంలో అడపా దడపా సినిమాలొచ్చాయి. అదే కథా సూత్రంతో తీవ్రమైన భావోద్వేగాలు కూడా కలిపి ఇప్పుడు శ్రీరాఘవ ‘మిస్టర్ కార్తీక్’ తెలుగులోకొచ్చింది. అదెలాగంటే..
పెళ్లిళ్లు, పేరంటాలప్పుడు ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్ కార్తీక్ స్వామినాథన్ (్ధనుష్)కి ఛాయాగ్రహణంలో పేరెన్నికగన్న మాధే కృష్ణస్వామి (రవిప్రసాద్) వద్ద శిష్యునిగా చేరి రాణించాలనుకుంటాడు. కానీ అతను ఇతడిని ఏ మాత్రం దగ్గరకు రానివ్వడు సరికదా, నువ్వేం ఫొటోలు తీస్తావ్? అని అపహాస్యం చేస్తుంటాడు. కానీ పట్టువదలని ‘్ఫటో’ మార్కుడులా వెంటపడ్డ కార్తీక్‌కి కృష్ణస్వామి అడవిలోకి వెళ్లి ఫొటోలు తీసే ప్రాజెక్టునిస్తాడు. దాన్ని కార్తీక్ ఎంతో ఏకాగ్రతతో ఫొటోలిస్తాడు. అయితే ‘అవేం బావోలేవు’ అని తిప్పికొట్టిన కృష్ణస్వామి వాటినే తాను తీసినట్టు ఫొటోగ్రఫీ పోటీలకు, ప్రచురణలకు పంపి పేరు పొందుతాడు. ఇది చూసి తట్టుకోలేని కార్తీక్ మానసిక అసమగ్రతకు లోనై బాధపడుతూ భార్య యామిని (రిచా గంగోపాధ్యాయ), మిత్ర బృందాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడు. మరి ఇలాంటి డిప్రెషన్‌కు గురైన కార్తీక్‌ని తిరిగి మనిషిగా మార్చి అతను కలగన్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరేలా వెన్నుదన్నై నిలిచిన యామిని ఏం చేసిందన్నది ఎన్ని అవాంతరాల్ని అధిగమించిందన్నది మిగిలిన కథ.
కథగా ఇది బాగున్నా కథా విస్తరణలో అవలంభించిన కొన్ని అసంగతల వల్ల చిత్రం నిడివి (చిత్రం నిడివి రెండు గంటల ఇరవై అయిదు నిముషాలు) ఎక్కువ ఉండడం వల్ల మధ్య మధ్యలో ప్రేక్షకులు కొంత అసహనానికి గురవుతారు. వాస్తవానికి ఒకరి సృజన మరొకరు వాడుకున్న సందర్భాలలో అడ్డుకోవడానికి బాధితుడికి అనేక సంబంధిత చట్టాలు ఆసరాగా వున్నాయి. వాటిని ఆశ్రయించకుండా నిరాశకు లోనై మానసిక అస్వస్థతకు గురవడం వగైరా కేవలం భావోద్వేగాలు పెంచడానికే తప్ప సహజంగా అనిపించలేదు. ఎందుకంటే కార్తీక్ వెనక ఉక్కు వనితగా చిత్రంలో వర్ణించిన యామిని వంటి విద్యావంతురాలు ఉన్నట్టు చూపారు. మరి అంతటి విద్యా సంపన్నురాలూ పైన మనం చెప్పుకున్న చట్టాలను ఎందుకు ఆశ్రయించలేదో తెలియదు దాంతోపాటు ఈ చిత్రానికి మూల చిత్రమైన తమిళ చిత్రం ‘మైకం ఎన్నన్’ అన్నది 2011లో విడుదలైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడీ అనువాద చిత్రం వచ్చింది. దాంతో సహజంగానే ఏర్పడే కాల వ్యవధికి చెందిన తేడాలు చిత్ర గమనంలో ఆటంకాలుగా అనిపించాయి. ఇలాంటి ప్రధాన ప్రతిబంధకాల్ని విస్మరించి నటనా, ఇతర ప్రమాణాల పరంగా ఎన్నదగిన రీతిలో మిస్టర్ కార్తీక్ సాగిందని మాత్రం తప్పక చెప్పచ్చు. ప్రత్యేకించి నాయకీ నాయకుల నటన. యామినిగా రిచా గంగోపాధ్యాయ బహుముఖ ప్రశసంనీయంగా నటించింది. బహుముఖం అని ఎందుకన్నామంటే ఆమెపాత్ర సినిమాలో ఎంటరైంది కార్తీక్ స్నేహితుడు సుందర్ గర్ల్‌ఫ్రెండుగా..కానీ తాను కార్తీక్‌పట్ల ఎలా ఆకర్షితురాలైందీ చక్కటి తర్కంతో చెప్పడంలో సఫలమైంది. అలాగే కార్తీక్ మనఃస్థితిని చూసి ‘పిచ్చివాడంటూ‘ సమాజం హేళన చేస్తే స్పందించిన తీరులోనూ, ప్రాణాధికంగా ప్రేమించిన కార్తీక్ తన గర్భస్రావానికి కారణమైతే అందుకు ప్రతిగా అతనితో మాటలు మానేసి అందుకు మనసులో కుమిలిపోయిన తీరులోనూ అద్భుతంగా నటించింది. అలాగే పాత్రకిచ్చిన షేడ్స్‌నన్నింటినీ పలికించడంలో కార్తీక్ పాత్రధారి ధనుష్ కృతకృత్యుడయ్యాడు. అన్నిటికన్నా ముఖ్య విషయమేమంటే కథా సూత్రం దృష్ట్యా తానేమి అనుకున్నాడో దానే్న తెరపై దర్శకుడు శ్రీరాఘవ ప్రతిబింబింప చేసాడు. ‘మసాలా’ దట్టింపు కోసం ఎలాంటి తృతీయశ్రేణి హాస్యాన్నికానీ, స్థాయిని దిగజార్చే శృంగార సన్నివేశాలు కానీ చొప్పించకుండా నిగ్రహంతో సినిమా అందించారు. అందుకు ఆయన అభినందనీయులు. అదేవిధంగా చిత్రానికి సంభాషణలందించిన మల్లూరి వెంకట్ కృషి కూడా ఎన్నదగినదే. పెద్ద పెద్ద సంభాషణలు లేకుండా చిన్న చిన్న వాటితోనే చాలా ఎఫెక్టివ్‌గా సన్నివేశాన్ని రక్తి కట్టించారు ఆయన. యామిని విషయంలో అవకాశాన్ని తీసుకుని కాస్త ‘ఎడ్వాన్స్’ అయిన మిత్రుడు శంకర్‌ని ఉద్దేశిస్తూ ఆమె ‘నీ భార్యను నువ్వే వెతుక్కో - ఇంకోడి భార్యపై ఆశపడకు’ అన్న మాట శంకర్‌తోపాటు అలాంటి వ్యవహారాలు చేసే అందరి గుండెల్లో గుచ్చుకునే రీతిలో వుంది. అలాగే చేస్తున్న పనిలో ఇన్వాల్వ్ అయి చేస్తే ఎంతటి విజయాలనైనా అందుకోవచ్చు అన్నది స్ఫూర్తిదాయకంగా వుంది. ప్రకాష్‌కుమార్ అందించిన బాణీలకంటే నేపథ్య సంగీతం ఆకట్టుకున్న రీతిలో సాగింది. ‘ప్రేమ ఓ ప్రేమా’ పాటలో ‘తొలగునురా మైకం ప్రొద్దున్న తాగే మజ్జిగతో’ అన్న గమ్మత్తు ప్రయోగం బాగుంది. మొత్తానికి ధనుష్ - రిచా గంగోపాధ్యాయ్‌ల నటనాపరంగా చక్కటి ప్రమాణాలు నెలకొల్పిన చిత్రంగా ‘మిస్టర్ కార్తీక్’ని పేర్కొనవచ్చు.

-అనే్వషి 7981327110