రివ్యూ

జస్ట్ నవ్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్ట్స్ నువ్వే ** ఫర్వాలేదు

*** **** ***

తారాగణం:
ఆది, వైభవి రష్మీ, బ్రహ్మజీ తదితరులు
సంగీతం: సాయ కార్తీక్
నిర్మాత: బన్నీవాసు
దర్శకత్వం: ప్రభాకర్

తరాలు మారినా తరగని ప్రేక్షకాదరణ హాస్య, హర్రర్ చిత్రాలకున్న అడ్వాంటేజ్! ఏవేవో కథలు కన్నా, హర్రర్ కథలు తక్కువ బడ్జెట్ నిర్మాతలతో పాటు కొత్త దర్శకులకి కూడా ‘సేఫ్ జోన్’. ప్రేక్షకుడిని కథలోకి కాస్త కనెక్ట్ చేసి ఆపై మరికాస్త భయపెట్టగలిగితే గట్టెక్కినట్లే! ఇక హాస్య చిత్రాల సంగతి సరేసరి! కాకపోతే హాస్యం కాస్త అపహాస్యం కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే ఈ రెండింటినీ మిక్స్‌చేసి సినిమా తీయడమంటే మాత్రం కత్తిమీద సాములాంటిదే! ఆ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’, ‘ఆనందోబ్రహ్మ’ రెండూ ఈ కోవకే చెందినప్పటికీ బ్యాలన్స్ విషయంలో తేడా రావడంతో వేర్వేరు ఫలితాల్ని రుచి చూసాయి.
మొన్న ఒకప్పటి టీవి యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది 2’ అనే హర్రర్ అస్త్రాన్ని ప్రేక్షకులపైకి వదిలిన సంగతి తెలిందే! ఇప్పుడు మరో టీవి ప్రముఖుడు ప్రభాకర్ ‘నెక్ట్స్ నువ్వే’ అంటూ ఇంకో హర్రర్ అస్త్రాన్ని సంధించాడు. అయితే ఈ అస్త్రానికి కావల్సినంత కామెడీని కూడా మిక్స్ చేసాడు. మరి ప్రేక్షకుల గుండెల్లో ఏ మేరకు గుచ్చుకుంటుందో? లెట్స్ వెయిట్ అండ్ సీ! ఏంటో ఈ మధ్య దెయ్యం సినిమాల ట్రెండ్ నడుస్తున్నట్లుంది. అగ్ర హీరో నాగార్జున కూడా ఈ జోనర్ సినిమాలో నటించడం గమనార్హం! కొరియా దర్శకుడు కిమ్ జీ ఊవ్ సారథ్యంలో 1998లో విడుదలైన కొరియన్ మూవీ ‘ది క్వయట్ ఫ్యామిలీ’ కానె్సప్ట్‌ని స్ఫూర్తిగా తీసుకొని మార్పులు, చేర్పులతో తమిళ దర్శకుడు డికే దర్శకత్వంలో 2014లో విడుదలై విజయం సాధించిన ‘యామిరుక్కే భయమే’ తమిళ చిత్రానికి మరిన్ని మార్పులతో వచ్చిన చిత్రమే ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ ‘నెక్ట్స్ నువ్వే’! ఈ ముగ్గురి దర్శకులకి కూడా ఇవి తమ మొదటి చిత్రాలు కావడం విశేషం! కొరియా సినిమాని తీసుకుంటే, హోటల్‌లో బస చేసిన అతిథులు వేర్వేరు కారణాలతో చనిపోతూ ఉంటారు. ఈ విషయం బయటికి తెలిస్తే హోటల్ మూతపడుతుందన్న భయంతో, గుట్టు చప్పుడు కాకుండా హోటల్ పరిసరాల్లోనే శవాల్ని పూడ్సేస్తూ ఏ విధమైన ఆందోళనని ప్రదర్శించకుండా యాథావిధిగా తమ దిన చర్యల్ని కొనసాగిస్తుంటారు. ఈ చిన్న లైన్‌కి కామెడీ టచ్ ఇచ్చి రక్తి కట్టిస్తాడు దర్శకుడు. ఇక తమిళంలోకి వచ్చే సరికి అతిథులని కాస్త దెయ్యాలుగా మార్చేసి, ఆ విషయాన్ని ఫస్ట్ఫా చివరి వరకూ సస్పెన్స్‌గా ఉంచి, ఆపై రిలీవ్ చేసి, సెకండాఫ్‌లో దెయ్యాలకే దెయ్యంగా మరో ఆడ దెయ్యాన్ని ప్రవేశపెడతాడు దర్శకుడు డీకే! మరి తెలుగులో ఈ సినిమా మాటేంటి? ఆ వివరాల్లోకి వెళ్లేముందు ఒకసారి కథని చూద్దాం..
కిరణ్ (ఆది) టీవి సీరియల్స్ నిర్మిస్తుంటాడు. తాను నిర్మించిన సీరియల్ అర్థాంతరంగా ఆగిపోవడంతో జెపి (జయప్రకాష్‌రెడ్డి) దగ్గర చేసిన 50 లక్షల అప్పు తీర్చలేకపోతాడు. వారం గడువిస్తాడు జెపి. ఇలా ఉండగా, తన కోసం తన తండ్రి ఓ ప్యాలెస్‌ని కొని ఉంచాడని తనకొచ్చిన లెటర్ ద్వారా తెలుసుకుంటాడు కిరణ్. తీరా ప్యాలెస్ దగ్గరికి వెళ్లి చూస్తే పాడుబడిన భవంతిలా ఉంటుంది. అయితే స్నేహితుడు శరత్ (బ్రహ్మాజీ) సలహా మేరకు ఆ భవంతిని రిసార్ట్‌గా రీ డిజైనింగ్ చేయిస్తాడు. ఇందుకుగాను జెపి కొడుకు రఘు (రఘు)ని బోల్తా కొట్టించి మరో 50 లక్షలు నొక్కేస్తాడు. అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. రిసార్ట్ ఓపెనింగ్ రోజున రూమ్‌లో బస చేసిన జంట తెల్లారే సరికి కరెంట్ షాక్‌తో విగతజీవులై పడుంటారు. ఈ సంగతి పోలీసులకి తెలిస్తే ఏమవుతుందో ముందుగానే ఊహించి శవాల్ని ప్రాంగణంలోనే పూడ్చేస్తారు కిరణ్ బృందం! గమ్మత్తేంటంటే రిసార్ట్‌లో బస చేసిన గెస్ట్‌లందరు కూడా రకరకాల కారణాలతో చనిపోవడం, చచ్చిన వాళ్లని కిరణ్ బృందం గుంతలు తవ్వి రహస్యంగా పూడ్చేయడం దిన చర్యలుగా మారిపోతాయి. ఒక ఫైవ్ మార్నింగ్ రిసార్ట్‌లో జరుగుతున్న వరుస మరణాల గురించి పోలీస్ అధికారి (బెనర్జీ)కి వివరిస్తాడు కిరణ్. అయితే ఈ విషయాన్ని కొట్టిపారేస్తాడు ఆ అధికారి! కిరణ్ చెబుతున్న నిజాన్ని పోలీస్ ఎందుకు నమ్మడం లేదు? రిసార్ట్‌లో సంభవిస్తున్న మరణాలకి అసలు కారణం ఏమిటి? కిరణ్ బృందం ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది? లాంటి ప్రశ్నలకి సమాధానమే తక్కిన సినిమా! పరభాషా చిత్రాన్ని రీమేక్ చేయడంలో మనకున్న సౌలభ్యం కథలో ఉన్న పొరపాట్లుని సరిదిద్దుకునే అవకాశం ఉండటం! ఈ ‘నెక్ట్స్ నువ్వే’ విషయంలో అప్రధానమైన సన్నివేశాలకి చిన్న చిన్న మార్పులు చేయడం మినహా, ప్రధానమైన పొరపాట్లని సరిదిద్దడానికి మాత్రం సాహసం చేయలేకపోయాడు దర్శకుడు. లాజిక్‌ని పక్కన పెట్టేసి లాఫింగే ప్రధానంగా కథనాన్ని నడిపించడం జరిగింది. పోసాని, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు ఇలా ఆయా పాత్రల ఒరిజినల్ సన్నివేశాలకి మార్పులు చేసినంత మాత్రాన దర్శకుడిగా తన ప్రతిభని నిరూపించుకున్నట్లు అవ్వదు. చికెన్ ఫ్రైడ్‌రైస్ స్థానంలో చికెన్ బిర్యానీ పెట్టగానే నేటివిటీ అయిపోతుందా? ఇలాంటి మార్పులని మినహాయిస్తే తమిళ చిత్రాన్ని ఉన్న ఫళంగా తెలుగులోకి దించేసారనే చెప్పాలి! అవసరాల శ్రీనివాస్ దెయ్యంతో డ్యూయట్ మింగుడు పడదు. యాభై ఏళ్ల కిందట సాగిన ఆ పాట అప్పటి కాలానికి అనుగుణంగా కనీసం ‘బ్లాక్ అండ్ వైట్’లో చూపించినా సర్దుకుపోవచ్చు! రిసార్ట్‌లో జరుగుతున్న చావులకి కారణం వ్యక్తులా? లేక అతీత శక్తులా? అన్న సస్పెన్స్‌తో ప్రథమార్థం చివరి వరకూ సిట్యువేషన్ కామెడీతో కథనం గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌కి ముందు దెయ్యం ఎంటర్ అవడంతో సస్పెన్స్‌కి తెరపడినా, సెకండాఫ్‌లో మరింత ఉత్కంఠను ఊహిస్తాడు ప్రేక్షకుడు. ఇక్కడే దర్శకుడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాల్సింది. కాని కామెడీ పేరుతో గోలగా, కంగాళీగా దెయ్యం చేష్టలతో సెకండాఫ్ మొత్తాన్ని కవర్ చేసేసాడు. ‘చచ్చిన వాళ్లు దెయ్యాలుగా మారి రిసార్ట్‌లోకి వచ్చి మళ్లీ చావడమేంటి? నాకే అర్థం కావడం లేదు’ అంటాడు కథానాయకుడు. ఈ ఆలోచన దర్శకుడికి ఎందుకు రాలేదో? ‘ప్యాలెస్’ ఒకప్పటి యజమానులను వరస పెట్టి చంపుతున్న దెయ్యం ప్రస్తుత ప్యాలెస్ యజమాని అయిన కథానాయకుడిని చంపకపోవడం సమాధానం లేని ఎన్నో ప్రశ్నలలో జస్ట్ ఒకటి!
కిరణ్ పాత్రలో ఆది లీనమై నటించాడు. జరుగుతున్న సంఘటనలతో ఆందోళనకి గురయ్యే భావాలని చక్కగా పలికించాడు. వైవిధ్యమైన పాత్రలని ఎంచుకోవడం హర్షించతగ్గ అంశం. ఇక శరత్ పాత్ర పోషించిన బ్రహ్మాజీ గూర్చి చెప్పాలంటే సినిమాని నిలబెట్టే వెన్నుముకగా చెప్పుకోవాలి. కామెడీ బాధ్యతని భుజాలపై వేసుకొని, ప్రేక్షకులని నవ్వించడంలో పూర్తి సఫలీకృతుడయ్యాడు. బ్రహ్మాజీ గుర్తుండి పోయే పాత్రలలో ఇదీ ఒకటి. బ్రహ్మాజీ చెల్లెలు పాత్రలో బుల్లితెర బ్యూటీ రష్మీ హస్కీ వాయిస్‌తో పంచ్ డైలాగ్‌లు చెప్తూ తెరపై హల్‌చల్ చేసిందనే చెప్పాలి. అన్నట్టు సినిమాలో పంచ్ డైలాగ్‌లకి కొదవేలేదు. తన నడకతో, చూపుతో ప్రేక్షకులని తన వైపునకు తిప్పుకుంటుంది. చీరకట్టు ఆ పాత్రకి మరో ప్లస్ పాయింట్. మేకప్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవల్సింది. వైభవి హీరోయిన్ పాత్ర పోషించినప్పటికీ రష్మీ పక్కన పూర్తిగా తేలిపోయింది. మరో బుల్లితెర భామ హిమజ దెయ్యం పాత్రలో కనిపించినా, ఆహార్యంలో ఆండాళమ్మగా అగుపిస్తుంది. తక్కిన నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు వాళ్ల స్టయిల్‌లో నటించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సట్! ‘డబ్బే పరిగెత్తే గుర్రం’ పాట చిత్రీకరణ బావుంది. ఉద్దేవ్ ఎడిటింగ్ ఉన్నంతలో ఫర్వాలేదు. కెమెరామెన్ కార్తీక్ లైటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సింది!
అసలు సినిమాలో దెయ్యం పాత్రలని ప్రవేశ పెట్టకుండా, రిసార్ట్‌లో సంభవించే మరణాలని, తద్వారా ఉత్కంఠతో కూడిన సస్పెన్స్‌ని ద్వితీయార్థంలోనూ కొనసాగించాలి, కొరియన్ మూవీలో చూపినట్లుగా ‘చావులన్నీ ప్రమాదవశాత్తు జరిగినవేనంటూ క్లైమాక్స్‌లో సస్పెన్స్‌కి తెరదించినట్లయితే దర్శకుడు ప్రభాకర్ వెండితెరపై కూడా క్రియేటివ్ దర్శకుడనిపించుకునే అవకాశం ఉండేదేమో! ఏది ఎలా ఉన్నప్పటికీ ‘‘నెక్ట్స్ ఏ సినిమా చూద్దాం?’’ అని అనుకునే ప్రేక్షకులు ‘నెక్ట్స్ నువ్వే’ అంటూ ఈ సినిమాకి వెళ్లొచ్చు! ధైర్యంగా!

-మురళి