రివ్యూ

గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంజెల్ * బాగోలేదు

** *** ***

తారాగణం:
నాగ అనే్వష్, హెబ్బాపటేల్, సప్తగిరి, షాయాజీషిండే, ప్రదీప్ రావత్, సుమన్,
సంగీతం: భీమ్స్ సిసిరియో
నిర్మాత: భువనసాగర్
దర్శకత్వం: బాహుబలి కె.పళని

సాధారణంగా ‘కథ’ అన్నదానికి నిర్వచనంగా ‘కాళ్లు, చేతులు లేనిది’ అని జనావళిలో చెబుతుంటారు. ఇక కథా కేంద్రంగా ‘దేవతలు’ తదితర ఊహాతీత శక్తుల్ని చొప్పిస్తే దానికి పగ్గాలు వేయడం ఎవరితరమూ కాదు. అదిగో.. సరిగ్గా ఇదే వర్గానికి ‘ఏంజెల్’ని ఏకగ్రీవంగా చేర్చేయచ్చు. వివరాలు చూస్తే ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు.
దేవలోకానికి చెందిన నక్షత్ర (హెబ్బాపటేల్) మానవలోకంలో బలంగా పెనవేసుకుపోయిన ‘బాధలు, బంధాలు’ వంటివి స్వయంగా అనుభూతి పొందడానికి తల్లిదండ్రలు (సుమన్, సన) సాయంతో భూలోకానికి విగ్రహ రూపంలో వస్తుంది. ఆ విగ్రహం అమరావతి తవ్వకాల్లో బయటపడుతుంది. దాన్ని విదేశాలకు అమ్మి భారీగా సొమ్ము దండుకుందామనే నెపంతో ఆ విగ్రహాన్ని హైదరాబాద్‌కు తరలించమని నాని (నాగ అనే్వష్) తో డీల్ సెటిల్ చేసుకుంటాడు స్థానిక స్మగ్లర్ (షాయాజీ షిండే). నాని తరలింపులో భాగంగా ఆ విగ్రహం కాస్తా నక్షత్రగా మారి అతనే్న హైదరాబాద్‌కు చేర్చమని అడిగి వచ్చేస్తుంది. అలా వచ్చిన నక్షత్ర ఎవరు? విగ్రహం కోసం పని పురమాయించిన స్మగ్లర్ల బృందం నానిని ఏం చేస్తారు? చివరకు ఏమవుతుంది? అన్న దానితో ‘ఏంజెల్’లో అన్ని ఏంగిల్స్ పూర్తవుతాయి. సినిమాలో ఏంజెల్ నక్షత్ర చెప్పే తన పూర్వాపరాలు విన్న నాని నువ్ చెప్పిన కథకి ‘‘స్వర్గలోకపు రాణి - వెర్రిబాగుల నాని అని పేరు పెడితే సరి’’ అని పరిహాసం చేస్తాడు. వాస్తవానికి ఆ వెర్రిబాగులతనం నానికే కాదు, సినిమా చూసిన ప్రేక్షకులందరికీ వర్తిస్తుందేమోనన్న అనుమానం కలిగేస్తుంది. అసలు డైరెక్టర్ అనుకున్న లేదా చూపించిన సన్నివేశానికి తర్వాత సన్నివేశం కట్టుబడి ఉండడం సహజం. కానీ అలాంటి సహజధర్మాలనేవి ఈ చిత్రం అనుసరించలేదు. ఉదాహరణకి మానవలోకంపై మోహం పోవడానికి గంధర్వ రాజు ఓ హా రాన్ని గరుడుడు (కబీర్‌సింగ్)కి ఇస్తాడు. కానీ అది చేతులు మారి ఓ దశలో వడ్డీ రాజా (ప్రదీప్ రావత్) స్మగ్లర్ తదితరులపై పడుతుంది. కానీ ఆ హారం గుణం మరోరకంగా వారిపై పనిచేసినట్లు చూపారు. పోనీ అది ఎవరి మెళ్ళో వేయాలో (అది నక్షత్ర మెళ్లో వేయడానికి ఉద్దేశించింది) వారి మెడలో వేస్తేనే ఈ లక్షణం వస్తుంది అనుకుంటే, మిగిలినవారి కంఠాలలో వేస్తే సంబంధిత సమీప లక్షణాలే ఆపాదించాలి తప్ప ఏదో కామెడీ కోసం ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నట్లు చూపడం తదితరాలు జబర్దస్త్ ఈటీవీ సీన్స్ చూపినట్లు అయింది తప్ప మరే ప్రభావ పూరిత సన్నివేశాలు చూసిన భావమే కలుగలేదు. ‘జబర్దస్త్’ అంటే గుర్తుకొచ్చింది-ఈ కామెడీ గలాటాలో జబర్దస్త్ కళాకారుడు చమ్మక్ చంద్ర కూడా ఉండడంతో ఈ బాపతు భావాలకు మరింత ఊతం కలిగింది. ఇక రెండవ సగంలో అచ్చు నక్షత్రలాగే ఉండే నందు ఏక్సిడెంట్‌లో మరణించి స్వర్గం రావడంతో అక్కడామెను చూసిన ఈమె భూలోకం వెళ్లడానికి అదీ ఒక కారణం అని చెప్పడం ఈ గందరగోళం శాతం ఇంకాస్త ఎక్కువైంది. అయితే నందు పాత్ర ద్వారా రైతులు - బాధలు వారికి సాయపడాలన్న భావన సాఫ్ట్‌వేర్ వర్గాల్లో కలగజేసే సీన్స్ బావున్నాయి. కానీ మానవ లోకంలో మజాలు ఎన్నో అంటూ- దేవలోకంలో అమృతం ఒక్కటే.. భూలోకంలో దానికి సమానమైన, మించిపోయిన మత్తుపానీయాలెన్నో.. అని నారద పాత్ర పేరిట చెప్పించడం అటు ఆ పాత్రనీ, మానవలోకాన్ని చిన్నబుచ్చినట్లే అనిపించింది. నాయకీ నాయకుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నాయిక పాత్రధారిణి హెబ్బాపటేల్‌నే. దాదాపు చిత్రం మొత్తం పేరుకు తగ్గట్లు ఆమె చుట్టూనే తిరుగుతుంది. చూడ్డానికి బబ్లీగా ఉండే హెబ్బాకు ‘అబ్బా’ అనిపించే పాత్ర దొరికినా భావ ప్రకటనలో మరింత సాధన చేసుంటే రోల్‌ను జస్టిఫై చేసినట్లు అనిపించేది. అయినా శక్తిమేరకు కష్టపడింది. నాగ అనే్వష్ ఈ తరం హీరోలకు ఉండే డాన్స్, ఫైట్స్ స్కిల్స్‌ను పరిధిమేరకు ప్రదర్శించాడు. వీరిద్దరి తర్వాత మేజర్ రోల్ పోషించిన గిరి పాత్రధారి సప్తగిరి, తన రొటీన్ టైపు సంభాషణోచ్ఛారణను మార్చి తీరాల్సిన అవసరాన్ని ఈ సినిమా మరోసారి హెచ్చరించింది. ఇక వడ్డీ రాజా పాత్ర ఎనభై దశకాలనాటి కథల్ని జ్ఞప్తికి తెచ్చింది తప్ప ఎక్కడా అలరించలేదు. భీమ్స్ అందించిన బాణీల సంఖ్య తక్కువ. ఉన్నంతలో సాహిత్యం కాస్త అదోలా వున్నా (పిచ్చిగాని పట్టిం దా? తిక్కగాని పుట్టిందా?) బీట్ పరంగా ఫర్వాలేదనిపించింది. సంభాషణల పరంగా ప్రేమించినవాడికి ధైర్యం దానంతటదే వస్తుంది.. ‘‘తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోమనేవాడే తప్ప రాసేవాడెవడు..’’ అన్నవి అలరించాయి. తాను అంతకుముందు సహాయకుడిగా పనిచేసిన చిత్రం (బాహుబలి) బాపతు గ్రాఫిక్ హంగులు స్వతంత్రంగా దర్శకత్వం వహించే ‘ఏంజెల్’ చిత్రంలో ఉండి తీరాలని ముందుగానే పళని ఫిక్సయిపోయినట్లు అక్కడక్కడా మనకు స్పష్టమైపోయింది. దాంతో అంతా గందరగోళం.. వీటితోపాటు ‘నమ్మబుల్’ సీన్స్‌పై ఎక్కువ ఆధారపడి ‘ఏంజెల్’ను ఎరేంజ్ చేసుంటే ఎంజాయ్‌మెంట్‌గా ఉండేది. ప్చ్..!

-అనే్వషి 7981327110