రివ్యూ

బోర్ క్లబ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్స్ క్లబ్ * బాగోలేదు

** *** **

తారాగణం:
అనీష్ చంద్ర, పావని, పూర్ణి తదితరులు
సంగీతం: జరవి నిడమర్తి
నిర్మాత: భరత్ అవ్వారి
దర్శకత్వం: ధృవ శేఖర్

రోజురోజుకూ టెక్నాలజీ మారుతూనే వుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందాలని అనుకుంటారు దర్శక నిర్మాతలు. ఆ కోవలనే ఐఫోన్‌తో ఎందుకు సినిమా తీయొద్దు? అన్న ఆలోచనతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు ధృవ శేఖర్. ఇండియాలో మొదటిసారి ఐఫోన్‌ను ఉపయోగించి తీసిన సినిమా ‘లవర్స్ క్లబ్’. కొత్త నటీనటులతో ఆయన చేసిన ఈ ప్రయత్నం ఎలా వుంది.. అసలు ఐ ఫోన్‌లో తీసిన ఈ సినిమా ఎలా వుంటుంది.. మరి ఆయన ప్రయ త్నం ఎంతవరకు ఫలించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
హీరో రిషి భరద్వాజ్ (అనీష్ చంద్ర) లవర్స్ ఎ లాంటి సమస్యలు ఎదుర్కోకుండా వాళ్లకు అండగా వుం డేందుకు తన స్నేహితులతో కలిసి ‘లవర్స్ క్లబ్’ను ఏర్పా టు చేస్తాడు. ప్రేమించుకున్న జంటలను లవర్స్ క్లబ్ సహకారంతో కలుపుతుంటారు. అలా అనుకోకుండా ఒకసారి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె వివాహం చేస్తాడు. తన కుమార్తెకు వేరే కులం వాడితో పెళ్లి చేసాడనే కోపంతో రిషిమీద పగ పెంచుకుంటాడు ఆ అమ్మాయి తండ్రి. మరి ఆ పగను ఎలా తీర్చుకున్నాడు? అనుకోకుండా రాజు ఈ కథలోకి ఎందుకు వచ్చాడు? రాజుకు రిషికి సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
సినిమా మొత్తం ఐఫోన్‌తో చిత్రీకరించడం హైలెట్ అని చెప్పాలి. రెండు గంటల సినిమాను ఐఫోన్ సహాయంతో ఎంత కష్టపడి తీసారన్నది ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ప్రేమికులకు అండగా నిలబడే రిషి పాత్రలో అనీష్ చంద్ర, రిషి లవర్‌గా పల్లవి బాగా నటించారు. ప్రేమికులుగా నటించిన రాజు, రాణి సినిమాలో కీలక సన్నివేశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తారు. ముఖ్యంగా రాణిగా నటించిన అమ్మాయి తెలంగాణ భాషలో మెప్పించింది.
ఇక టెక్నికల్ అంశాల గురించి చెప్పాలంటే.. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు. ఇలాంటి కథలు ఇదివరకు చాలా చూశాం. స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోవడం, ముందు జరగబోయే సన్నివేశాలు మనకు ఊహకు సులభంగా అందడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. సినిమా మొదటి భాగంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశాలు ఎక్కువ. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా సాగడం కథలో దమ్ము లేకపోవడంతో అక్కడక్కడా వినోదం కూడా మిస్ కావడంతో సినిమా నిరాశ కలిగిస్తుంది.
ఇక సాంకేతిక అంశాలను పరిశీలిస్తే.. దర్శకుడు ధృవ శంకర్ ఐపోన్‌తో సినిమా తీయాలనుకోవడం మంచి ఆలోచన. కానీ చిత్రకథ కథనంలో కొత్తదనంపై దృష్టి పెట్టలేకపోయాడు. కెమెరామెన్ పనితనం బాగానే వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించారని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘లవర్స్ క్లబ్’ పాత ధోరణిలో సాగే బోర్ క్లబ్‌గా మారింది. కథ, కథనం కొత్తగా లేకపోవడం, దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు నిరాశపరిచాయి. సమాజంలో స్ర్తికి భద్రత లేదని చూపించే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే చిత్రం మొత్తాన్ని ఐఫోన్‌తో షూట్ చేయడం మెచ్చుకోదగిన విషయం. కానీ ఫోన్‌తో తీసారన్న భావన ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించకపోవచ్చు.

-కరిష్మా