రివ్యూ

మదిలో...మధురమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెంటల్ మదిలో... ** ఫర్వాలేదు

*** **** ****

తారాగణం:

శ్రీవిష్ణు, నివేత పెతురాజ్ అమృత శ్రీనివాసన్, శివాజీరాజా
అశోక్‌కుమార్, మధుమణి అనితా చౌదరి తదితరులు.
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాత: రాజ్ కందుకూరి
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

‘మెంటల్ మదిలో...’ పేరేమిటి? ఇలా ఉంది అని ‘కన్‌ఫ్యూజ్ అవకండి... ప్రతిమనిషి ఎదుట ఒక అంశంపై రెండు విధానాలు ఉంటే ఏది ఎంచుకోవాలో తెలియని కన్‌ఫ్యూజన్ మనలో చాలామందికుంటుంది. అలాంటి లక్షణమే ఈ చిత్రంలో కథానాయకుడు అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు)కుంటుంది. అలాంటి గందరగోళం ఏవో చిన్న విషయాల్లో అయితే ఫర్వాలేదు. కానీ అదే ‘పెళ్లి’వంటి వ్యక్తి జీవన నిర్దేశ దశకు కీలకమైన అంశంలోనూ ఆవరిస్తే పర్యవశనాలు ఎలా ఉంటాయో అన్నది ఈ చిత్రం చాలా సన్నితంగా చర్చించింది. అయితే ఈ గందరగోళ పరిస్థితికి ‘మెంటల్’ అని పేరు పెట్టడమే ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే ముందే చెప్పినట్లు ఈ తరహా అనిశ్చితత్వం చాలామందికుంటుంది. అంతమాత్రం చేత దాన్నో పరిగణించతగ్గ రుగ్మతగా దిద్దుబాటు చేసుకోలేనిదిగా అనడం సరికాదు. ఇదే చిత్రంలో కథానాయిక స్వేచ్ఛ (నివేత పెతురాజ్) అంటుంది కూడా. వివరాల్లోకి వెళితే...
పెద్దపెద్ద థీరీ పేపర్లు ఎంత కఠినమైన ఆన్సర్ చేసేసి ఫస్ట్‌మార్క్స్ తెచ్చుకునే అరవింద కృష్ణ (శ్రీవిష్ణు) మల్టిపుల్ ఆన్సర్స్ ఉండి అందులోంచి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ఆబ్జెక్టివ్ పేపర్స్‌లో మాత్రం విఫలమవుతూ ఉంటాడు. దీనికి కారణం విపరీతంగా కన్‌ఫ్యూజ్ కావడం అంటూంటారు చూసిన వాళ్లందరూ. రానురాను ఈమాదిరి గందరగోళతనం జీవితంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెంది పలువురి పరిహాసానికి గురవుతాయి. దీనివల్ల పెళ్లి సంబంధాలూ ప్రయత్నిస్తే అక్కడి అమ్మాయి స్వేచ్ఛ (నివేత పెతురాజ్)కి అరవింద్ నచ్చుతాడు. తీరా ఇది ఎంగేజ్‌మెంట్ స్థాయికి వచ్చేలోగా అమ్మాయి నానమ్మ చనిపోతుంది. పెళ్లి తతంగాలు రెండు నెలలు వాయిదా పడతాయి. పెళ్లి ఇక ఎలాగరా అనుకుంటున్న అరవింద్ తల్లిదండ్రులు (మధుమణి, శివాజీరాజా) తదితరలకు ఊరటగా నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అని స్వేచ్ఛ చెప్తుంది. అయితే ఈలోగా తన ఆఫీసు పనిపై అరవింద్ ముంబాయి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తన తరహా ‘కన్‌ఫ్యూజన్’ పోకడలుగల రేణు (అమృతా శ్రీనివాసన్) అనే అమ్మాయి ఇతన్ని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ పెరిగి రేణునే వివాహమాడతా అన్న స్థాయికి అరవింద్ చేరతాడు. ఈ పరిణామానికి స్వేచ్ఛ ఎలా స్పందిస్తుంది? చివరకు అరవింద్ ఎవరిని వివాహమాడతాడు అన్న వాటికి జవాబులతో చిత్రం ముగుస్తుంది. సినిమా తీరులాగే చిత్రం అంతా చూసిన తర్వాత ప్రేక్షకుడికి ‘బావుంది’ ‘బాగోలేదు’ అన్న రెండు విభిన్న లక్షణాల సారాంశాలూ మెదడుకి చేరతాయి. ఎందుకంటే సినిమా ప్రథమార్ధాన్ని వివేక్ ఆత్రేయ (చిత్ర దర్శకుడు) ఎంతో సరదాగా, పాత్రల స్వభావ స్వరూపాన్ని అతి వాస్తవంగా అప్పుడే విశ్రాంతి వరకూ వచ్చేసిందా? అన్న రేంజ్‌లో నడిపాడు. కానీ తర్వాతి భాగంలో చాలామటుకు సన్నివేశాల రిపిటేషన్‌తో (మొదటి భాగంలోని విషయాలకు జతకలిపే నిమిత్తం) నడుపుతాడు. రేణు అన్న అపరిచిత వ్యక్తి అరవింద్, మిత్రబృందంతో ప్రవర్తించిన తీరూ మనకు మింగుడు పడదు. అందులోనూ అంతవరకూ ఎంతో అంతర్ముఖుడిగా కనపడ్డ అరవింద్ ఆమెతో అంతలా కలిసిపోడమూ సమర్ధింప రీతిలో దర్శకుడు చూపలేకపోయారు. ఎలాగో అలాగ చిత్రానికి ఓ మలుపు, ఆ మలుపు నుంచి కడకు చేర్చడం అన్న కానె్సప్టుకు కమిట్ అయిపోవడంవల్ల అలా ముగించాడా? అనీ అనిపిస్తుంది. మళ్లీ నేను రేణు గురించి తీసుకున్న నిర్ణయం సరికాదు. ఒక ఛాన్సివ్వు అంటూ తిరిగి స్వేచ్ఛ దగ్గరికి వచ్చి అనడానికి తగిన కన్విన్సింగ్ సీన్స్‌ని క్లారిటీగా చూపించి వుంటే బావుండేది. స్వేచ్ఛతో అరవింద్ కలవడమే ధర్మం కూడా. అయితే ఆ ధర్మ లక్షణాన్ని వివరించడంలో దర్శకుడు ఇంకాస్త క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేసి వుండాల్సింది. ఇలా ద్వితీయార్థంలోని తడబాట్లవల్ల చిత్రం ‘్ఫర్వాలేదు’ అన్న స్థాయికే చేరింది. ఇక ఇత వివరాల్లోకి వచ్చే ముందు స్థూలంగా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సిన మాట - చిత్రంలో నటీనటుల దగ్గర నుంచి సంగీతం, కెమెరా తదితర అన్ని విభాగాల్లోని వారు అందరూ తమతమ పాత్రల్ని అభినందనీయ రీతిలో పోషించారు. ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది స్వేచ్ఛగా నటించిన నివేత ప్రతిభనే ఇది ఆమెకు తెలుగులో తొలి చిత్రం. అయినా ఎక్కడా ఆ మాదిరిగా ప్రేక్షకుడికి అనిపించదు. చిత్రంలో ఆమె పాత్రపరంగా ‘నాకేం కావాలో నాకు తెలుసు’ అంటుంది. అదేవిధంగా ఈ పాత్రని ఏవిధంగా నటించాలో అన్నది నాకు తెలుసు అన్నదాన్ని అచ్చుగుద్దినట్లు ఇందులో ప్రతిఫలింప చేసింది. భావ ప్రకటనలో, ముఖ్యంగా చూసే చూపులో చూపిన కాన్ఫిడెన్సు చాలా బావుంది. అలాగే అరవింద్ పాత్రధారి శ్రీవిష్ణుకు సోలో హీరోగా దాదాపు ఇది తొలి చిత్రం అనుకుంటా. ఆ పాత్రకు ముమ్ముర్తులా శ్రీవిష్ణు సరిపోయాడు. హీరో తండ్రిగా శివాజీరాజాది కూడా గుర్తుండిపోయే పాత్ర. ప్రత్యేకించి శివాజీరాజా, శ్రీవిష్ణుల మధ్య నడిపిన సన్నివేశాలు బాగా పండాయి. రెండవ సగంలో ఎంటరయిన రేణు పాత్రధారి అమృతాశ్రీనివాసన్ కూడా పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. చిన్నచిన్న సన్నివేశాన్ని కూడా మంచి సెన్సార్ రియాల్టీతో దర్శకుడు రూపొందించడం చూసి ముచ్చటనిపించింది. ఉదాహరణకు ఎంగేజ్‌మెంట్ నిశ్చయించుకోడానికి వెళుతూంటే కథానాయకుని తండ్రి, తల్లి (మధుమణి) చీరకుచ్చిళ్లు సవరించడం చాలా నాజూగ్గా చిత్రీకరించారు. అలాగే అదే తండ్రి పాత్ర ఆఖర్లో ఇదేమిటి గులాబ్ జాం ఇంత కారంగా ఉందేమిటి అని స్నేహితుడు (అశోక్‌కుమార్)తో అంటాడు. తిరిగి పెళ్ళి ఏర్పాట్లు చేసిన పెళ్ళికూతురు తండ్రి రాగానే ‘గులాబ్‌జాం’ సూపర్ అంటాడు. ఇవన్నీ నిజజీవితంలో వ్యక్తులు అనుసరించే విధానాలే. వాటికి దర్శకుడు అందంగా తెర రూపమిచ్చాడు. చిత్రంలో సంభాషణలు కూడా ఏవో పంచ్ డైలాగ్స్ కోసం పంచ్‌లు ఇచ్చే ఇప్పటి పద్ధతికి భిన్నంగా, చాలా వాస్తవంగా ఆలోచించే రీతిలో కొన్ని చోట్ల సాగాయి. ఈ కాలంలో పెళ్ళికి ముందే అబ్బాయి - అమ్మాయి కలిసి తిరగడాలూ, ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవడం కోసం, అవగాహన కోసం అనడం పరిపాటి. ‘‘అలా తిరగడాలు ఎక్కువై, ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకోవడం వల్ల పెళ్ళికి ముందే అనేక అనర్థాలు జరిగి మొదటికే మోసం వస్తుంది. అందుచేత అలా తిరగడం మంచిది కాదు పెళ్లాయ్యాక ఒకవేళ కొన్నికొన్ని తెలిసినా సర్దుకుపోతారు’’ అంటూ చాలా ప్రాక్టికల్ రీతిలో కథానాయిక తల్లి (అనితా చౌదరి)తో చెప్పిస్తారు. అదేవిధంగా అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలి అన్నదానికి స్వేచ్ఛ ఇచ్చిన టిప్స్ - ‘బాగా వెకిలిగా నవ్వకూడదు - నవ్వొస్తే ఆపుకోకూడదు... అనవసరంగా కాలితో క్రింద కొట్టకూడదు...’ వంటివీ బాగున్నాయి. ప్రశాంత్ విహార్ గీతాల్లో బాగుందయ్య చంద్రం - నీ ముబారక్ విందు’’ బావుందు. ‘హోంమేడ్’ గురించి సినిమాలో నిర్వచనం (-వాళ్లు హోమ్‌లోనే చేస్తుంటారు. నేను మాత్రం షాపులో కొన్నా...) కూడా సరదాగా ఉంది. ఏది ఎలా ఉన్నా దర్శకుడు తన తొలి ప్రయత్నంలోనే సింపుల్‌గా అనిపించే సంక్లిష్ట అంశాన్ని తడబాటు లేకుండా తొలి సగాన్ని తీయడం ప్రశంసార్హం. అదే ఊపు సెకెండాఫ్‌లోనూ కొనసాగించి ఉంటే ఇంకా బాగుండేది.

-అనే్వషి 7981327110