రివ్యూ

పేరుకే థ్రిల్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవి శ్రీ ప్రసాద్ * బాగోలేదు

** ** ** ** ** ** **
తారాగణం:
భూపాల్ రాజు, ధన్‌రాజ్
మనోజ్ నందన్, పూజ రామచంద్రన్.
సంగీతం: కమ్రాన్
నిర్మాత: ఆర్.వి.రాజు, డి.వెంకటేష్
దర్శకత్వం: శ్రీకిశోర్

దేశంలో రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. అలాంటి భిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం దేవి శ్రీ ప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధన్‌రాజ్, మనోజ్ నందన్‌లు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌తోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి దేవి శ్రీ ప్రసాద్ అనే ముగ్గురు ఎవరు? వాళ్లు చేసిన తప్పేమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
దేవి (్భపాల్ రాజు) ఆటో డ్రైవర్, శ్రీ (్ధన్‌రాజ్) ఆసుపత్రిలో వార్డుబాయ్, ప్రసాద్ (మనోజ్ నందన్) టీ స్టాల్ నడిపే యువకుడు. ఈ ముగ్గురు స్నేహితులు. వాళ్లకు స్టార్ హీరోయిన్ లీల (పూజ రామచంద్రన్) అంటే చాలా ఇష్టం. ఆమెను ఒక్కసారైనా దగ్గర్నుండి చూడాలని ఆశపడుతుంటారు. అలాంటి లీల ఒక రోజు అనుకోకుండా కారు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె శవాన్ని ఓ హాస్పిటల్ మార్చురిలో భద్రపరుస్తారు. అదే హాస్పిటల్‌లో పనిచేసే శ్రీ ఈ విషయం తెలుసుకుని తన మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ దేవి, ప్రసాద్‌లకు ఫోన్ ద్వారా విషయం చెబుతాడు. దాంతో ఆమెను ఎలాగైనా దగ్గరనుండి చూడాలన్న ఆశతో హాస్పిటల్‌కు చేరుకుంటారు దేవి, ప్రసాద్. శవాల గదిలో ఉన్న లీల శవాన్ని చూడటానికి వెళ్లినపుడు వాళ్లు ఏం చేశారు? వాళ్లు చేసిన పని వలన ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? అన్నది మిగతా కథ.
ఈ సినిమాలో దేవి పాత్రను చేసిన భూపాల్ మంచి నటన కనబర్చాడు. అతని నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక ధన్‌రాజ్, మనోజ్ నందన్‌ల పాత్రలు మామూలుగానే ఉన్నాయి. ఇక హీరోయిన్ లీల పాత్రలో పూజ రామచంద్రన్ పెద్దగా నటించే ఆస్కారం లేని పాత్రలో కనిపించింది. సినిమాకు ప్లస్ పాయింట్ అంటే దర్శకుడు ఎంచుకున్న కథాంశమనే చెప్పాలి. చనిపోయిన హీరోయిన్‌తో తాగిన మత్తులో వున్న ముగ్గురు యువకులు ఏం చేశారు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? ఆ ఇబ్బందులనుండి బయటపడటానికి తప్పు మీద తప్పులు ఎలా చేశారు? అనే సింగిల్ లైన్ పాయింట్‌ను బాగానే అనుకున్నాడు దర్శకుడు కిశోర్. ఈ పాయింట్‌తో మంచి డ్రామాను క్రియేట్ చేసే అవకాశముంది. చనిపోయిన బాడీ చుట్టూ నడిచే ఈ సినిమాను ఆరంభంలో బాగానే హ్యాండిల్ చేశారాయన. ముగ్గురు స్నేహితులు శవంతో తప్పు చేయడంవరకు చిత్రం ఆసక్తికరంగానే నడిచింది. అలాగే ఆ తప్పును కప్పిపుచ్చడానికి చేసే కొన్ని ప్రయత్నలు కూడా మెచ్చుకోలుగానే ఉన్నాయి. ఇక టెక్నికల్ అంశాలకు వస్తే.. కమ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫణిందర్ వర్మ సినిమాటోగ్రఫీ, చంద్రవౌళి ఎడిటింగ్ ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అయితే దర్శకుడు కిశోర్ రాసుకున్న పాయింట్ బాగానే ఉన్నా, అది స్క్రీన్‌మీద ప్రెజెంట్ చేసే విషయంలో తడబడ్డాడు. ఉత్కంఠమైన కథనం, సన్నివేశాల విషయంలో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతో సినిమా ఆరంభంలో కొద్దిసేపు బాగానే ఉన్నా, తర్వాత బోర్ కొట్టేసింది. కీలకమైన మలుపు కూడా చాలా సిల్లీగా అనిపించింది. ముఖ్యంగా చివర్లో రివీల్ చేసే అసలు పాయింట్ తెలిస్తే.. అసలు ఇంత సినిమా ఎందుకు తీసారా? అనిపిస్తుంది. దర్శకుడు కిశోర్ తనకు నచ్చినట్టు కథను మార్చేశాడు. దాంతో ప్రేక్షకుడికి చాలా నిరుత్సాహం కలిగింది. కథనం మధ్యలో వచ్చే కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. సరైన కథ, కథనాలు లేకపోవడం, సన్నివేశాలు, మలుపుల్లో లాజిక్స్ లేకపోవడంతో సినిమా ఫలితం తలకిందులైంది. పేరుకే క్రైం థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కినా, అది ఎక్కడా థ్రిల్లింగ్ కనిపించలేదు. మొత్తానికి దేవిశ్రీప్రసాద్ సినిమా ట్రైలర్స్‌లో ఏం చెప్పారో ఆ విషయాలను సినిమాలో మరచిపోయారు. అసలు కథ కథనం, పక్కన పెట్టి అనవసర హంగా మా చేయడం పెద్ద మైనస్‌గా మారింది.

-త్రివేది