రివ్యూ

విసిగించే ఫ్యాక్షన్ ఫార్ములా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణుడు ** ఫర్వాలేదు

** ** *** ***

తారాగణం:
నారా రోహిత్, రెజీనా రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు రఘుబాబు, ఆదిత్య మీనన్ రామరాజు, అజయ్, పృథ్వీ
శివ ప్రసాద్, వెనె్నల కిషోర్ శ్రీనివాసరెడ్డి తదితరులు.
సంగీతం: మణిశర్మ
కెమెరా: విజయ్ సి. కుమార్
ఆర్ట్: కోటగిరి వెంకటేశ్వరరావు
కథ, మాటలు: కొలుసు రాజా
నిర్మాణం: మాయాబజార్ మూవీస్, శరశ్చంద్రిక మోషన్ పిక్చర్స్
నిర్మాత: బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ మల్లెల

వై విధ్యమైన చిత్రాలతో కెరీర్ ఆరంభం నుంచి ప్రయాణం చేస్తున్న కథానాయకుడు నారా రోహిత్. తను నటించే ప్రతీ చిత్రంలో ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం వుండేలా జాగ్రత్తలు పడుతుంటాడు. వరుసగా చిత్రాలు చేస్తూ తరచుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే హీరోల జాబితాలో రోహిత్ కూడా వుంటాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘శమంతకమణి’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నారా రోహిత్ సినిమా అంటే సరికొత్త కథ, విభిన్నమైన కానె్సప్ట్ అన్న భావన ప్రేక్షకుల్లో కలగడం సహజం. అతడి కథల ఎంపిక కూడా అందుకు తగ్గట్టుగానే వుంది. ఈ విషయం తొలి చిత్రం ‘బాణం’తోనే ఇది స్పష్టమయింది. అంతేకాదు, వేగంగా సినిమాలు చేసే అతి కొద్ది మంది యువ హీరోల్లో ఈయన ఒకరు. స్టార్ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన రోహిత్ నటుడిగా మంచి మార్కులు కొట్టేస్తున్నా, కమర్షియల్‌గా సక్సెస్‌లు సాధించటంలో మాత్రం బాక్సాఫీస్‌కు దూరంగానే వుంటున్నాడు. ఓ పక్క నటుడిగా, మరో పక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి ప్రయోగాత్మక చిత్రాల మీదే దృష్టి సారించిన నారా రోహిత్‌కు తొలిసారిగా ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్‌తో సినిమా చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆలోచన వచ్చినట్లుంది. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన చిత్రమే ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రం ద్వారా పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. మరి దర్శకుడి తొలి ప్రయత్నం ఎలా వుంది? ‘బాలకృష్ణుడు’గా నారా రోహిత్ చేసిన తొలి కమర్షియల్ అడుగుకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో కథ మొదలవుతుంది. రాయలసీమకు చెందిన భానుమతి దేవి (రమ్యకృష్ణ), ఆమె అన్న రవీందర్‌రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే మనుషులు. తన చెల్లెలు భానుమతి దేవి ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు, ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటాడు. ప్రజల్లో రవీందర్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) తీవ్రంగా రగిలిపోతాడు. కానీ రవీందర్‌రెడ్డి చేతిలోనే పరాజయం పాలై ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాప్‌రెడ్డి (అజయ్) రవీందర్‌రెడ్డిని హతమారుస్తాడు. అంతటితో ఆగకుండా భానుమతి దేవి మేనకోడలు ఆద్య (రెజీనా)ని చంపి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని చాకచక్యంగా ముందే పసిగట్టిన భానుమతి ఆద్యకు తెలియకుండానే ఆమెకు రక్షణగా బాలు (నారా రోహిత్) అనే బాడీ గార్డ్‌ని నియమిస్తుంది. రవీందర్‌రెడ్డిని చంపిన కేసులో జైలుకెళ్లిన ప్రతాపరెడ్డి ఎలాగైనా ఆద్యను చంపడానికి జైలు నుంచి బయటికొస్తాడు. పక్కా ఫ్యాక్షనిస్ట్ అయిన అతని నుంచి ఆద్యను బాడీగార్డ్ బాలు రక్షించాడా? లేదా? వారిద్దరి మధ్య ఏం జరిగింది? అన్నదే కథ.
పక్కా రొటీన్ కథే ఇది! ఏనాడో అరిగిపోయిన ఫ్యాక్షన్ నేపథ్యాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాత చింతకాయ కథలతో సినిమాలు రూపొందించడమనేది మన టాలీవుడ్‌కి కొత్తేమీకాదు. అయితే కొత్తదనం.. కొత్తదనం అంటూ పాకులాడే కథానాయకుడు రోహిత్ నుంచి కూడా ఇలాంటి మూస చిత్రం రావడమేమిటి? అని ఆశ్యర్యం కలుగుతుంది. ఇంత నాసిరకం ఎలా వర్కవుట్ అవుతుందని భావించారో ఏమో..! ప్చ్..!! కథలో కానీ, కథనంలో కానీ ఎక్కడా కొత్తదనం.. వైవిధ్యం అంటూ జాడలే కనిపించవుగాక కనిపించవు. చెప్పుకోతగ్గ కథ లేనప్పుడు అదనపు హంగులతో అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అదీ..జరగలేదు. అయితే దర్శకుడు వాణిజ్యాంశాలను మేళవించే ప్రయత్నం బాగానే చేశాడు. కమర్షియల్ ఫార్ములా తీయాలన్న ఆలోచనతో ఈ కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు పక్కా ఫార్ములా సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చాడు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలో వుండాల్సిన ఫైట్లు, గ్లామర్ పంచ్ డైలాగులు, ఛేజ్‌లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. అయితే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయిందనే విషయాన్ని మాత్రం గాలికొదిలేశాడు. కథకు ఫ్యాక్షన్ జోడించి రాసిన సన్నివేశాలు కూడా ఆసక్తిగా లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. తొలి పదినిమిషాల తర్వాత సినిమా ఎలా పడితే అలా వెళ్లిపోవడం అనవసర పాత్రలు కథలోకి ప్రవేశించడంతో చికాకు కలుగుతుంది. కథకు సంబంధం లేని సన్నివేశాల వల్ల సినిమాలో సీరియస్‌నెస్ అనేది లేకుండా పోయింది. పాటలు కూడా అంతే సందర్భం లేకుండా వచ్చిపడతాయి.
నారా రోహిత్ క్యారెక్టర్ మాత్రం బావుంది. పాత్రకు తగ్గట్టుగానే చేశాడు. గతంలో మనం రోహిత్‌ను ఇలాంటి పాత్రలో చూడలేదు. ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌ని కనబరిచాడు. తొలి సినిమాకే ఒక వైవిధ్యమైన కథను ఎంచుకొని అటు తర్వాత కూడా అదే బాటలో ఆ తరహా కథలతోనే ప్రయాణం చేస్తున్న అతడికి ఇది కొత్త ప్రయోగమనే చెప్పాలి. యాక్షన్ సీన్స్, డాన్సుల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సింది. హీరోయిన్ రెజీనాది మామూలు పాత్రే. నటనతోపాటు అందంతో అలరించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ నటన చిత్రానికి ప్లస్ పాయింటే. తన హావ భావాలతో భానుమతి పాత్రను రక్తికట్టించింది. అజయ్ విలన్ పాత్రలో కొత్తదనం లేదు. రొటీన్‌గానే సాగింది. ఎప్పుడూ బ్రహ్మానందం చేసే పాత్రలో కనిపించిన పృథ్వీ నవ్వించాడు. ఒక ఫార్మాట్లో సాగిపోయే ఈ కథలో కామెడీ కొంత వర్కవుట్ అయింది. వెనె్నల కిషోర్, రవివర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విషయానికొస్తే.. నిర్మాణ విలువలు బావున్నాయి. మణిశర్మ స్వరాలు, జగపతిబాబు వాయిస్ ఓవర్ సినిమాకు కలిసొచ్చే అంశాలే. ఫొటోగ్రఫీ బావుంది. యాక్షన్ సన్నివేశాలను బాగానే చూపించింది. మాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించి ఉండాల్సింది. మొత్తం మీద అరిగిపోయన ఈ ఫాక్షన్ ఫార్ములా ప్రేక్షకుల్ని విసిగించింది.

-ఎం.డి అబ్దుల్