రివ్యూ

అక్సిజన్ సరిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్సిజన్ * * ఫర్వాలేదు
తారాగణం: గోపీచంద్, జగపతిబాబు, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్, కిక్ శ్యామ్, అభిమన్యుసింగ్,
అలీ, నాగినీడు, బ్రహ్మాజీ, షాయాజీ షిండే, వెనె్నల కిశోర్, ఆశిష్ విద్యార్థి చంద్రమోహన్, సుధ, సితార
సంగీతం: యువన్ శంకర్‌రాజా
కెమెరా: ఛోటా కె. నాయుడు, వెట్రి
నిర్మాణం: శ్రీ సాయిరామ్ క్రియేషన్స్
నిర్మాత: ఎస్.ఐశ్వర్య
స్క్రీన్‌ప్లే: ఎ.ఎం రత్నం
రచన, దర్శకత్వం: ఎ.ఎం.జ్యోతికృష్ణ

** *** **************

యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా గోపీచంద్‌కు పేరుంది. మాస్ సినిమా కొలతలకి పక్కాగా సరిపోయేలాంటి ఫిజిక్ అతడిది. ఆయన బలం యాక్షన్ మాస్ కథలే. అందుకే ఆ తరహా కథలవైపు మొగ్గుచూపిస్తుంటాడు. ఈ అంశాలతో సాగే కొత్త కథలతోనే కెరీర్‌లో తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అయితే ‘లౌక్యం’ తరువాత ఆ స్థాయి విజయం లేక బాక్సాఫీస్‌కు దూరంగా వున్నాడు. వరుస పరాజయాలతో పూర్తిగా డీలా పడ్డాడు. గోపీచంద్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన చేసిన మాస్, యాక్షన్ సినిమాలే. చేసే ప్రతి సినిమా అందుకు తగ్గట్టుగానే ఉండేలా చూసుకుంటాడు. గతంలో వచ్చిన శౌర్యం, లౌక్యం, జిల్ వంటి చిత్రాలు ఆ కోవలోనివే. ఇప్పటికే ఈ ఏడాది ‘గౌతమ్‌నందా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం గోపీచంద్‌కు నిరాశనే మిగిల్చింది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆక్సిజన్’ ఎట్టకేలకు మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఎంతో ఆశగా. కుటుంబ కథా నేపథ్యంతో పాటు, యాక్షన్ అంశాలకు పెద్దపీట వేస్తూ సమాజంలో కొనే్నళ్లుగా జరుగుతున్న ఓ విషయాన్ని సందేశాత్మకంగా చూపించే ప్రయత్నం జరిగింది ఈ చిత్రంలో. ప్రముఖ నిర్మాత ఎ.ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో చవ్చిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌కు ‘ఆక్సిజన్’ను ఏ మేరకు అందించింది? 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’, ‘2006లో ‘కేడి’, 2012లో ‘ఊ లా లా’లాంటి చిత్రాలతో టాలీవుడ్‌ని పలకరించిన దర్శకుడు జ్యోతికృష్ణ మరోసారి తన ‘ఆక్సిజన్’తో ఆకట్టుకున్నాడా? తెలుసుకొనే ముందు కథేంటో చూద్దాం..
తన వ్యాపారాలతో కోట్లు సంపాదించి పెద్ద మనిషిగా ఎదిగిన రఘుపతి (జగపతిబాబు) రాజమండ్రిలోనే వుంటూ తన వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. తన అన్నా-తమ్ముళ్లు, వాళ్ల పిల్లలతో కలిసి వుండే అతని కుటుంబంలోని వ్యక్తులు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. ఇలా జరగడం వెనుక ఊరిలోనే తన ప్రత్యర్థి వీరభద్రమ్ (షాయాజీ షిండే) హస్తం వుందని అనుకుంటాడు రఘుపతి. ఈ క్రమంలో కూతురికి ఎలాగైనా పెళ్లి చేసి దూరంగా అత్తారింటికి పంపించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే కూతురు శృతి (రాశీఖన్నా)ను అమెరికా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేసే కృష్ణప్రసాద్ (గోపీచంద్) పెళ్లిచేసుకోవడానికి వస్తాడు. కుటుంబాన్ని వదలి అమెరికా అబ్బాయితో వెళ్లిపోవడం ఇష్టంలేని శృతి ఈ సంబంధం రద్దుచేయించాలని పడరాని పాట్లు పడుతుంది. కృష్ణప్రసాద్ మంచితనం కారణంగా ఆ ఎత్తులన్నీ పటాపంచలవుతాయి. అందరి అభిమానాన్ని చూరగొన్న కృష్ణప్రసాద్‌కు శృతినిచ్చి పెళ్లిచేయడానికే కుంటుంబలో అందరూ నిశ్చయించుకుంటారు. ఇక పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలోనే రఘుపతి కుటుంబం అజ్ఞాత శత్రువు కారణంగా తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటుంది. అతడి కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న అజ్ఞాత శత్రువు ఎవరు? అతడిపై ఎందుకు పగబట్టాడు? అల్లుడుగా రానున్న కృష్ణప్రసాద్ కధేంటి? ఆయన ఎవరు? ‘ఆక్సిజన్ మిషన్’ వెనుక వున్న కథేంటి? అన్నదే అసలు సిసలైన క్లైమాక్స్.
ఇది పక్కా కమర్షియల్ సినిమా. సందేశంతో కూడిన కథను కుటుంబ నేపథ్యంతో రాసుకున్న దర్శకుడు, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం అంతగా పండలేదు. అగమ్యగోచరంగా ప్రథమార్థం సాగింది. విశ్రాంతికి ముందు ఒక సినిమా, తరువాత మరో సినిమా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ కథకి ప్రధాన బలం. దాంతో రఘుపతి కుటుంబానికి అసలైన శత్రువు ఎవరో తెలుస్తుంది. అప్పటివరకూ రొటీన్‌గా సాగే కథ, ఈ ట్విస్టుతో మలుపు తిరుగుతుంది. ట్విస్టు కొత్తగా వుంది. ద్వితీయార్థంలో బలమైన సామాజిక అంశంపైన కథ నడిపించాడు దర్శకుడు.
సంజీవ్‌గా వున్న గోపీచంద్ తర్వాత కృష్ణప్రసాద్‌గా ఎందుకు మారాడు? ఇంతకూ అతని లక్ష్యం ఏంటి? రాజమండ్రి రావడం వెనుక అసలు కథేంటి? అన్నదే ద్వితీయార్థం. పొగ తాగడం యువతరాన్ని ఎలా బలిగొంటుందో ద్వితీయార్థంలో చూపించే ప్రయత్నం జరిగింది. దానికి తగ్గట్టే ఆక్సిజన్ అన్న టైటిల్ పెట్టారు. దర్శకుడు చెప్పాలనుకున్న అంశం మెచ్చుకోతగిందే అయినా, ఓ డాక్యుమెంటరీలా రొటీన్ ఫార్ములాతో చెప్పడంతో ఆక్సిజన్ సరిపోలేదు. చక్కటి లక్షణాలున్న అబ్బాయి అమెరికానుంచి వస్తే కుటుంబాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేని అమ్మాయి, అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ఆమె అలీతో కలిసి కామెడీ చేస్తుంది అని దర్శకుడు అంటే సరిపోతుందా? కామెడీ అని ప్రేక్షకులు ఫీల్ అవ్వాలి కదా! ప్రథమార్థంలో ట్విస్టుతో షాక్ అవుతాడు. కానీ ఆ తరువాత అలాంటి సన్నివేశాలు మరిన్ని వుంటే బాగుండేది. ఒకే ట్విస్టును నమ్ముకుని సినిమాని గట్టెక్కించాలనుకున్నాడు దర్శకుడు. రొటీన్ సన్నివేశాల్లేకుండా వినోదం పాళ్లు మరింత పెంచి కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దాల్సింది. మంచివాడు, గణంలో రాముడు అని చెప్పిన కథానాయకుడు సగంలోకి వచ్చేసరికి రాక్షసుడైపోయాడు. రక్తపాతం సృష్టించాడు. ఇదొక ప్రతీకారం తీర్చుకునే కథ అనే పాయింట్‌కు వచ్చాక కానీ తెలిసిరాదు. సెకెండాఫ్‌లో హీరో అసలు పగకు కారణం ఏమిటనేది చూపారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో మొదలుపెట్టి సిగరెట్‌వైపు టర్న్ తీసుకున్న దగ్గరనుంచి ఆరంభంలో వచ్చే యాంటీస్మోకింగ్ యాడ్ ఎక్స్‌టెన్షన్‌లా తయారైంది. కథ ఒక పాయింట్‌కి చేరిన తరువాత ఆ చిత్రాన్ని ఏదో విధంగా ముగించేయాలనే ఆరాటం కనిపించిందే కానీ, ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. విలన్ల దగ్గరనుంచి చేజిక్కించుకున్న 5 వేల కోట్లు ప్రజలకు ఒక్కొక్కరికి 5 వేల చొప్పున అకౌంట్‌లో వేయడం వింతగా అనిపిస్తుంది. దానికితోడు ఆశిష్ విద్యార్థి పోలీస్ బృందం చేసే హడావుడి సిల్లీగా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో వచ్చే ప్రతీ సీను ఊహాజనితమే. కనీస స్థాయి స్క్రీన్‌ప్లే కన్పించలేదు. సినిమాలో అనేక సన్నివేశాలకు లాజిక్ లేదు. మంచి సందేశం వున్నా, రొటీన్ స్క్రీన్‌ప్లే కావడంతో విసుగుపుట్టిస్తుంది. విచ్చలవిడిగా సమాజంలో ప్రవేశిస్తున్న అనామకమైన సిగరెట్ బ్రాండ్లు యువతను ఎలా ఆకర్షిస్తున్నాయి? వారు ఎలా వ్యాధుల బారిన పడుతున్నారు? అనేది దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే. ప్రతి సినిమా ప్రారంభంలో చూపించే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే అంశంతో తయారైన కథ ఇది. అయితే దీనిని ప్రేక్షకుడు మెచ్చే రీతిలో దర్శకుడు చూపలేక చేతులెత్తేశాడు. కొన్ని ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు బాగానే వున్నా అనవసరమైన సీన్లతో లెంగ్త్ ఎక్కువై బోర్ కొట్టింది.
కథకు అవసరం లేని గ్రామీణ నేపథ్యంలో సన్నివేశాలను రాసుకొని సినిమా నిడివిని పెంచేసి ఇబ్బంది పెట్టాడు. భారీ తారాగణం వున్నా పాతసీన్స్, బోర్‌కొట్టించే స్క్రీన్‌ప్లే వల్ల చిత్రం నీరసపడింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే దేశ ప్రజలకు హాని చేసే సమస్యను పరిష్కరించేందుకు తన మిలటరీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ‘ఆక్సిజన్’ అనే మిషన్‌ను నడుపుతూ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని సిన్సియర్ మిలటరీ ఆఫీసర్ సంజీవ్‌గా, ఓ కుటుంబలోకి పెళ్లికొడుకు కృష్ణప్రసాద్‌గా గోపీచంద్ రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించాడు. లుక్స్‌పరంగా యాక్షన్ సీన్‌లలో అదరగొట్టాడు. మరోసారి మాస్, యాక్షన్ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. మంచి మనసున్న అమెరికా అబ్బాయిగా, రఫ్ అండ్ టఫ్ ఆర్మీ ఆఫీసర్‌గా రెండు వేరియేషన్స్‌లో తన నట విశ్వరూపం చూపాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశాలను హీరో పాత్ర ద్వారా ఎలివేట్ చేయడం మెప్పిస్తుంది.
రాశీఖన్నా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. చిరునవ్వులతో చలాకీ నటనను అందంగా ప్రదర్శించింది. నటనకు పెద్ద స్కోప్‌లేని అను ఇమ్మాన్యుయెల్ కొద్దిసేపే వున్నా, కథకు మలుపు తిప్పే పాత్రకు ప్రాణం పోసింది. జగపతిబాబు రెండు వేరియేషన్స్‌లో మెప్పించాడు. కిక్ శ్యామ్, బ్రహ్మాజీ, షాయాజీషిండే, వెనె్నల కిషోర్, నాగినీడు, అభిమన్యుసింగ్, చంద్రమోహన్, సుధ తదితరులు పాత్ర మేరకు నటించారు. కాలకేయ ప్రభాకర్, అమిత్‌కుమార్ తివారీలు కీలక పాత్రల్లో మెరిశారు. సావిత్రి పాత్రలో అలీ కామెడీ నవ్వించింది. టెక్నికల్‌గా సినిమాను క్వాలిటీతోనే రూపొందించారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలకు ప్రాధాన్యత లేదు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఐటమ్ పాట ఉన్నా అంతగా కిక్ రాలేదు. కెమెరా పనితనం సినిమాకు హైలెట్. ఎడిటింగ్ ఓకె. గ్రాఫిక్స్ వర్క్స్ కనీస స్థాయిలో లేదు. మొత్తం మీద ఈ సినిమాను చూస్తే మామూలు కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాలకు భిన్నంగా ఏవీ కనిపించవు. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బావున్నా, రొటీన్‌గా సాగే ఫస్ట్ఫా, గ్రాఫిక్స్, సంగీతం సినిమాను బాగా దెబ్బతీశాయి. అందుకే ‘ఆక్సిజన్’ సరిపోక ఓ టెలివిజన్ డాక్యుమెంటరీలా తయారయింది.

-ఎం.డి.అబ్దుల్