రివ్యూ

బోర్..జర్నీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10 * బాగోలేదు
తారాగణం:
విక్రమ్, సమంత తదితరులు
కెమెరా: కె.ఎమ్ భాస్కరన్
ఎడిటింగ్: శ్రీకరప్రసాద్
సంగీతం: డి.ఇమాన్
నిర్మాత: ఏ.ఆర్ మురుగదాస్
దర్శకత్వం: విజయ్ మిల్టన్

** ** *** ******

కోలీవుడ్ చిత్రాలు టాలీవుడ్‌పై దండయాత్ర చేయడం మనం చాలా కాలంగా చూస్తూనే వున్నాం. అక్కడ మంచి విజయాల్ని అందుకున్న చిత్రాలు.. స్టార్ హీరోల చిత్రాలు.. క్రేజీ నటుల చిత్రాలు తెలుగునాట బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ టాలీవుడ్ మార్కెట్‌ను సొమ్ము చేసుకుంటుంటాయి. కోలీవుడ్ నిర్మాతల జేబులు నింపుతున్నాయి. ఇది గత ఎంతో కాలంగా జరుగుతున్న తంతే. అయితే అలా వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. మరికొన్ని వచ్చినంత వేగంగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రేక్షకాదరణకు నోచుకోక పలాయనం చిత్తగిస్తున్నాయి. తెలుగునాట విక్రమ్ సినిమాలకు ఓ క్రేజ్ వుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లు రాబట్టాయి. టాలీవుడ్ మార్కెట్‌పై విక్రమ్ సినిమాలు ఓ కనే్నయడం మామూలే. ఆయన నటించిన మరో చిత్రం డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడానికి వచ్చింది. అదే ‘10’. విక్రమ్, సమంత జోడీగా తమిళంలో రూపొందిన ‘10 ఎంద్రాతుకుల్లా’ తెలుగులో ‘10’గా విడుదలైంది. తెలుగులో విక్రమ్, సమంతలకు మంచి క్రేజ్ వున్న దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలావుంది? టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుందా..లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
విక్రమ్‌కు కారు డ్రైవర్‌గా మంచి పేరుంటుంది. తన కారులో కొన్ని పార్శిల్స్‌ను విలన్‌లకు చేరవేస్తుంటాడు. ఇలా పార్శిల్స్ చేరవేస్తున్న క్రమంలో ఒక రోజు ఊహించని సంఘటన జరుగుతుంది. తనవద్దనున్న ఓ పార్శిల్‌ని డెలివరీ చేయడానికి బయలుదేరుతాడు విక్రమ్. కొంత దూరం ప్రయాణించాక విక్రమ్‌కు ఓ విషయం తెలుస్తుంది. తాను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాననే విషయం తెలుసుకున్న అతడు షాక్‌కు గురవుతాడు. ఇంతకీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేయాలనుకున్నారు? అలా కిడ్నాప్‌కు గురైన ఆ అమ్మాయి ఎవరు? ఆమెను విక్రమ్ ఎలా కాపాడాడు? అన్నదే అసలు సిసలైన కథ!
ఇలాంటి క్యారెక్టర్స్ విక్రమ్‌కు కొట్టినపిండే. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. విక్రమ్‌లాంటి నటుడుడికి ఈ చిత్రంలోని పాత్ర మాత్రం చాలా సులువనే చెప్పాలి. ఆయన పాత్రలోని కొన్ని సన్నివేశాలు అక్కడక్కడా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ముఖ్యంగా కారు ఛేజింగ్ సన్నివేశాలు బాగా కుదిరి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత పాత్ర ప్లస్‌పాయింటే అని చెప్పాలి. టాలీవుడ్‌లో క్రేజ్ వున్న ఈ బ్యూటీ ఈ చిత్రంలో వుండడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కొంత ఆసక్తికలిగింది. చూడాలన్న తపనతో థియేటర్లకు వచ్చారు. సమంత క్యారెక్టర్ వలన సినిమా సినిమా అలా అలా సాగిపోతుంది. తన మార్క్ మేనరిజంతో, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇందులో వున్న పాత్రలతో పోలిస్తే సమంత క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. అభిమన్యుసింగ్ క్యారెక్టర్ కూడా ఉన్నంతలో కాస్త బెటర్ అనిపిస్తుంది. అయితే చిత్రం చూశాక, క్రేజీ హీరో విక్రమ్ ఇలాంటి కథలో ఎలా నటించాడు? ఇందులో నటించడానకి ఎలా ఒప్పుకున్నాడు? అనిపిస్తుంది. ఈ చిత్రం చూస్తే అందరికీ ఇలాంటి అనుమానమే తడుతుంది. అలాంటి అనుమానం ఎందుకు కలుగుతుందీ అంటే.. ఈ చిత్రంలో అతడు నటించడానికి ఏమీలేదు. కథానాయకుడిగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. ప్రాధాన్యం లేని హీరో పాత్ర. అంతేకాదు, అతడి క్యారెక్టర్‌లో గొప్పగా ఫీలయ్యే సన్నివేశాలే లేవు. సినిమా అంతా కారు జర్నీతో సాగి విసిగిస్తుంది. ఈ కారు ప్రయాణం పరమబోర్‌గా అనిపిస్తుంది. చిత్రం చూస్తున్నంత సేపూ ఇదేం సినిమా..బాబోయ్! అనిపించకమానదు. హీరో హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యలపైనే చిత్రం సాగుతుంది. విక్రమ్, సమంత మధ్య కెమిస్ట్రీకి తావేలేదు. వీరిద్దరి మధ్య వచ్చే ఏ ఒక్క సన్నివేశం రుచించదు. వీరికి నటించడానికి ఈ చిత్రంలో ఏమీ లేకపోయినా వీరి పాత్రల్లో అత్యుత్సాహం మాత్రం కనిపిస్తుంది. చెప్పుకోవడానికి కనీసం ఒక్క సన్నివేశం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రతీ సన్నివేశం ఎంతో సిల్లీగా అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ చేసే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఆయా సన్నివేశాలు ఎక్కడా ఆకట్టుకునే రీతిలో లేక నీరసంగా తయారయ్యాయి. అలా నీరసంగా తయారైన ఈ చిత్రంలో దర్శకుడు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. అసలే పరమబోర్‌గా సాగుతున్న కథనానికి తోడు మధ్య మధ్యలో అనవసరంగా వచ్చే పాటలు భలే చిరాకును కలిగిస్తాయి. ఈ పాటలేంటి? బాబోయ్.. అనిపిస్తుంది. ఏ ఒక్కపాటా ఆకట్టుకోదు. పాటల చిత్రీకరణ కూడా ఏ మాత్రం ఆకట్టుకోదు. భాస్కరన్ ఫొటోగ్రఫీ అయినా ఫర్వాలేదనిపించిందా? అంటే అదీ కుదరలేదు. కెమెరా పనితనం చిత్రానికి ఎలాంటి బూస్ట్ ఇవ్వలేదు. నిర్మాణ విలువలు సైతం బాగోలేవు. ఎడిటింగ్ నాసిరకంగా తయారైంది. మరింత కసరత్తు చేయాల్సింది. డి.ఇమాన్ సంగీతంలో చెప్పుకునే మెరుపులేం లేవు. ఇదీ..నాసిరకమే! దర్శకుడు విజయ్ మిల్టన్ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ప్రేక్షకుల్ని మెప్పించలేక బోర్ కొట్టించాడు. దర్శకుడు విజయ్ నుంచి పరమనీచమైన చిత్రం వచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిభగల దర్శకుడు తీయాల్సిన సినిమాయేనా ఇది? అనిపించడం సహజం. కథలోగానీ, కథనంలోగానీ ఎక్కడా పసలేదు. ఫలితం శూన్యమే! థియేటర్లలోంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్లిపోదామా? అనే ఆలోచన ప్రేక్షకుల్లో పదే పదే కలుగుతుంది. అంతటి చిరాకు తెప్పించింది.
హీరో విక్రమ్ కెరీర్‌లో ఇంతటి ఘోరమైన చిత్రాన్ని మనం చూసి వుండం. ఆయన కెరీర్‌లో భారీ ఫ్లాపుల్లో ఇదొకటిగా నిలిచింది. తమిళంలో వచ్చిన ఈ ‘10 ఎంద్రాతుకుల్లా’ అక్కడా భారీ ఫ్లాపే కావడం గమనార్హం. మరి ఇలాంటి చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులపైకి ఎలా రుద్దారో..? అస్సలు అర్థం కాదు. దారుణమైన స్క్రీన్‌ప్లేకు తోడు కథ లోపించడం..వీటన్నింటికీ తోడు అస్తమానం సాగతీత సన్నివేశాలతో విసుగుతెప్పించింది. దర్శకుడి టేకింగ్ అయితే ఇక చెప్పలేం. అర్థంపర్థం లేని ఈ సినిమాను భరించడం ఎవ్వరితరమూ కాదు. విక్రమ్ ఇలాంటి పాత్రలు చేసేముందు ఒక్కసారి ఆలోచించాలి. అతడి నుంచి ఇంత పసలేని చిత్రం.. అంతకంటే ఘోరమైన క్యారెక్టర్‌లో నటిస్తాడని అనుకోరు. సో..కారు డ్రైవర్ చేసిన పూర్..జర్నీ ఇది. ప్రేక్షకులు ఈ చిత్రం గురించి ఆలోచించకపోవడమే బెటర్! ఏ మాత్రం ఆలోచించినా టైమ్‌వేస్ట్!

-రతన్