రివ్యూ

తడబడిన బుల్లెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు పోలీస్
--

తారాగణం: విజయ్, సమంత, ఎమీజాక్సన్, రాధిక, మహేంద్రన్, బేబీ నైనిక, తదితరులు.
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
నిర్మాతలు: కలైపులి ఎస్.్ధను, రాజు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అట్లీ.
--

బహుశా తెలుగులో ‘పోలీసు’ ఇతివృత్తంతో వచ్చినన్ని సినిమాలు మిగిలిన ఏ భారతీయ భాషల్లోనూ రాలేదేమో! మరి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడానికో ఏమో, ‘పోలీసు’ చిత్రానికి మాతృక ‘తెరి’అన్న తమిళ చిత్రమైనా తెలుగువారికీ ఆ చిత్రం విడుదలైన ఒక రోజు వ్యవధిలోనే తెచ్చేశారు. అయితే ఎంతగా సినిమాకు ముందు ‘ఈ చిత్రంలోని సన్నివేశాలు కల్పితాలు...’అన్న కాప్షన్ వేసినా సమకాలీన అంశాలు స్పృశించేటపుడు వాస్తవ జగతిలోని అంశాల ‘పోలిక’వస్తుంది. ఆ పోలికలో వాస్తవానికీ చిత్రంలోని అంశాలకీ పొంతన కుదరనపుడు ప్రేక్షకుడు పెదవి విరుస్తాడు. సరిగ్గా అలాంటి పెదవి విరుపే ‘పోలీస్’ విషయంలో జరిగింది. అదేమిటో చూద్దాం..
తన ఉద్యోగ విధులలో భాగంగా డిప్యుటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ (విజయ్) తనవద్దకు వచ్చిన ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుని హేండిల్ చేసినపుడు, ఉత్తరోత్తరా పెద్దవాళ్ళవద్దనుంచి ఒత్తిళ్లు వస్తాయన్న ఉద్దేశ్యంతో, ఆ నేరానికి కారకుడైన మంత్రి వెంకటరెడ్డి కుమారుడు అశ్విన్‌ను చంపేస్తాడు. ఆ పగతో ఆ మంత్రి విజయ్ తల్లి (రాధిక) భార్య (సమంత)ను చంపించేస్తాడు. కూతురు (బేబీ నైనిక)ని రక్షించుకోడానికి కేరళ వచ్చి ఓ బేకరీని నిర్వహించుకుంటూంటారు విజయ్. తర్వాత అతని ఉనికి తెలుసుకుని తన ప్రతీకారం తీసుకునే ప్రయత్నంలో జరిగిన సంగతులూ వగైరా మిగిలిన కథ. ఇలా ఒక పవర్‌ఫుల్ నేపథ్యం ఉన్న నాయకుడు, అనంతరం పరిస్థితుల ప్రాబల్యంవల్ల సామాన్య జీవనం గడిపే ఛాయలతో గతంలో రజనీకాంత్ హీరోగా ‘బాషా’మనం చూడనే చూశాం. అదే స్ఫూర్తితో అనేక తెలుగు చిత్రాల్లో కొన్ని సీన్సూ వచ్చాయి. వీటన్నిటినీ పక్కకుపెట్టి ఒక పోలీసధికారి ఉన్న చట్టాల్తో బాధితుడికి న్యాయంచెయ్యాలన్న దిశగా కార్యాచరణ చేయాలి తప్ప ఇలా ఎలాగ చేయలేం కాబట్టి తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తుదముట్టించడం ఎలా చూసినా సమర్ధనీయాంశం కాదు. అసలు అలా ఏ పోలీసు అధికారీ చేయడం కుదరదు. ఒకవేళ అలా జరిగినా దాని తర్వాత విధిగా జరిగే పరిశోధనలో అసలు నిజాలు రాబట్టచ్చు. అందులోనూ ఎదుటి పార్టీ పవర్‌ఫుల్ మినిస్టర్‌కి చెందినదీ అని చూపారు. అలాగే ఓ మేజర్ కేసులో జరిగిన తీవ్ర హింసాత్మక సంఘటనల అనంతరం అలా అందులోని కీలక వ్యక్తి ఇందులోలా అజ్ఞాతంగా ఉండడం జరగదు. ఎంతగా చనిపోయాడని విశ్వసించినా అది అయ్యేపనికాదు. ఇంకో రకంగా అంటే దీక్షాదక్షతలతో పనిచేసే నిజాయితీగల పోలీసధికారిగా వ్యక్తిత్వం ఇచ్చిన విజయ్ పాత్ర, జరిగిన హింసకు తడబడి అజ్ఞాతంలోకి వెళ్లడమూ జరగదు. ఇక్కడే ఆ పాత్ర ఔన్నత్యానికి (కథాపరంగా చూసినా) మచ్చ వచ్చింది. ఈ అసంబద్ధతని విస్మరించి చూస్తే చిత్రం నిర్మించిన రిచ్‌నెస్ తీరూ, అనవసరంగా మామూలు కమర్షియల్ చిత్రాల్లో కన్పడే వికారాలకు లోనవని విధానం ఎన్నదగింది. ఉదాహరణకు అవడానికి ఇది అనువాద చిత్రమైనా తెలుగు నేటివిటీకి తగ్గట్లు సన్నివేశాల వెనుక తెలుగు బోర్డులు, తెలుగు ప్రాంతాల పేర్లు వగైరాలు చూపి ఎక్కడా డబ్బింగ్ వాసన రాకుండా శ్రద్ధ చూపారు. అయితే చిత్రం నిడివిని రెండున్నర గంటల నుంచి రెండు గంటలకు నిరభ్యంతరంగా కుదించవచ్చు. అప్పుడు ఆసక్తి ఇంకా పెరిగేది. ప్రధాన పాత్రధారులందరూ పాత్రల ఒరవడి ప్రకారం చక్కగా నటించారు. అటు విజయ్‌కుమార్‌గా, ఇటు కురివెళ్ల జోసఫ్‌గా విజయ్ మంచి నటనను ప్రదర్శించారు. తన ప్రేమను వ్యక్తపరిచిన తీరు, (అదీ ప్రథమ చూపులోనే) భర్త ఉద్యోగ విధుల్లో అనివార్యంగా వచ్చే ఒత్తిడిని ఇష్టంగా జీర్ణించుకున్న విధానంలోనూ సమంత బ్రిలియంట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రతి నాయకుడు మినిస్టర్ వెంకటరెడ్డి పాత్రలో సుప్రసిద్ధ తమిళ దర్శకుడు మహేంద్రన్ మెచ్యూర్డ్ నటనను ప్రదర్శించారు. అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది విజయ్ కూతురు పాత్రలో బేబీ నయనిక (నటి మీనా కుమార్తె) తండ్రిని ‘బేబీ’అని సంబోధించడంలో కానీ, తప్పుచేసినవాడు సారీ చెప్పకపోతే అతనికి అర్థమయ్యే భాషలోనే బుద్ధిచెప్పే తీరప్పుడు కానీ చూపిన హావభావాలు ముచ్చటగొల్పాయి. చిత్రంలో సంభాషణ రచయిత సాహితీ కూడా మంచి ప్రతిభ చూపారు. ‘‘నాకు నచ్చిన వాడికి బాగా నచ్చిన వ్యక్తి నాకు నచ్చుతారు’’... ‘ఒక వ్యక్తి సూపర్‌మాన్‌గా ఉండడం అందరికీ బాగుండచ్చేమో కానీ, అది కట్టుకున్న వారికీ, కన్నవారికీ మాత్రం డెఫినెట్‌గా బాగా అనిపించదు’అన్న డైలాగ్స్ వాస్తవ సమీపంగా ఉన్నాయి. కేరళ అందాలు తెరపై ఆవిష్కరించడంలో జార్జ్ కెమేరా కృతకృత్యమయ్యింది. ముఖ్యంగా ఈ పనితనం యుగళ గీతాల్లో విజృంభించింది. ప్రత్యేకించి ‘ఓరకళ్ల...’ పాటలో దీన్ని పరిశీలించచ్చు. ఐతే పాటలో ‘ఐఫర్ యూ, యూఫర్ మీ ఒకటైతే సునామీ’ అన్న లైన్సూ సరదాగా ఉన్నాయి. జి.వి.ప్రకాష్‌కుమార్ అందించిన స్వరాలకన్నా నేపథ్య సంగీతం బాగుంది. ‘‘చెడు నెదిరించే ధైర్యం’’, నీతిగా బ్రతికే బలం అందరూ కోరుకునేవే అయినా వాటిని అమలులోఉన్న చట్టాలతోనే అణిచివేసి న్యాయం జరిపించినట్లు అట్లీ (చిత్ర దర్శకులు) ‘పోలీస్’లో చూపినట్లైతే అందరి ప్రశంసలూ విధిగా పొంది ఉండేది. అప్పుడు సామాన్యునికి కూడా కావాల్సినంత ధైర్యమొస్తుంది.

- అనే్వషి